నా కూతుర్ని భారత సైన్యంలో చేరుస్తాను
నాకు కొడుకులు లేరు.. ఉన్నది ఒక్క కూతురు.. తనని సైన్యంలో చేరుస్తానని అమరజవాను హనుమంతప్ప భార్య మహాదేవి అన్నారు. గురువారం హనుమంతప్ప తల్లిదండ్రులను పలు సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న హనుమంతప్ప భార్య మహాదేవి మాట్లాడుతూనాకు కొడుకులు లేరు.. అందుకు నేను బాధపడడం లేదు, నా కుమార్తెనే సైన్యంలో చేరుస్తానని పేర్కొన్నారు. అలా చేయడమే తన భర్తకి నిజమైన నివాళి అవుతుందని ఆమె పేర్కొన్నారు. దేశానికి సేవ చేసేందుకు తన బిడ్డను ఇవ్వడం చాలా గర్వంగా ఉందన్నారు.

- హనుమంతప్ప భార్య