సంప్రదాయానికి ప్ర‌తీక ఉగాది..

మ‌న తెలుగు సంప్ర‌దాయానికి అద్దం ప‌డుతూ ప్ర‌కృతిని మ‌న ముంగిట‌కు తెచ్చే పండుగే ఉగాది. " మాసానాం మార్గశిర్షీహం..రుతూనాం కుసుమాక‌ర అని భ‌గ‌వ‌ద్గీత‌లో శ్రీకృష్ణ ప‌ర‌మాత్మ చెప్పాడు. అంటే అన్నీ మాసాల‌లోకెల్లా మార్గశిర మాసం ఉత్త‌మ‌మైన‌ది.