రసాయన ఎరువుల వాడకంతో వ్యాదులు పెరుగుతున్నాయి..దేశంలో సేంద్రీయ వ్యవసాయంపై రైతు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌ స్పష్టం చేశారు. రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ సంస్థ (ఎన్‌ఐఆర్డీపీఆర్‌)లో  రెండ్రోజులపాటు సేంద్రీయ వ్యవసాయంపై  జాతీయ సదస్సును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవ్‌వ్రత్‌ మాట్లాడుతూ.. 30ఏళ్ల కిందట వరకు మధుమేహం, క్యాన్సర్‌ వంటి జబ్బులు దరిచేరేవి కావని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం దేశంలో ఇలాంటి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోందని చెప్పారు. దీనికి కారణం రైతు పంటల్లో అధిక రసాయనాలను వినియోగించడమేనన్నారు. రసాయనాల వల్లనే సారం కోల్పోయి దిగుబడులు తగ్గడంతో పాటు కాలుష్యం పెరిగి రైతుకు సహకరించే పురుగు, పక్షులు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సేంద్రీయ వ్యవసాయంతో ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. 1982లో మూడు గోవులు కొనుక్కోని సేంద్ర వ్యవసాయం ప్రారంభిచానని తన అనుభావాలను వివరించారు.