భగవద్గీత సాక్షిగా..మనవారు ఎందరో వృత్తి, విద్య వ్యాపారాల కోసం పాశ్చాత్య దేశాలకు వెళుతూ ఉంటారు. కొందరు అక్కడే స్థిరపడిపోతారు. ఏదైనా పదవి స్వీకరించినప్పుడు బైబిల్‌ మీద ప్రమాణం చేయటం అక్కడి వారికి ఆచారం. ఐతే ఇటీవల కాలంలో మార్పు వచ్చింది. భారత మూలాలు ఉన్న అమెరికన్లు ఇప్పుడు భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేకంగా గమనించాయి. ఇలా చేసిన ప్రముఖులలో కొందరు.. వివేక మూర్తి (సర్జన్‌ జనరల్‌), అతుల్‌ కాశ్యప్‌ (శ్రీంకలో అమెరికా రాయబారి), తులసీ గబ్బార్డ్‌ (అమెరికా పార్లమెంటు సభ్యురాలు), శ్రీనివాసన్‌ (అప్పీల్‌ కోర్టు న్యాయమూర్తి), దానియేు మూఖే (ఆస్ట్రేలియాలో రాజకీయ నాయకుడు) వీరంతా భారతీయ మూలాలు  ఉన్న విదేశీయులు. జై గీతా!