‘భారత్‌మాతకీజై’ని రాజకీయం చేస్తున్నారా?
ఉన్న ఊరు కన్నతల్లిఅనేది మన నానుడి. ఈ దేశాన్ని మనం మన మాతృదేశంగా భావిస్తాము. అందుకే అధర్వణవేదంలో మాతాభూమి: పుత్రోహం పృధివ్యా: అని చెప్పబడింది. ఈ భూమి నా తల్లి నేను ఆమే పుత్రుడను అని దాని భావము. మనకు మన దేశంతో ఉన్న మమత్వానికి చిహ్నం మాతృభావన` స్వాతంత్య్ర పోరాటానికి ఊపిరిగా పని చేసిన వందేమాతరం’. అంటే ఓ తల్లి నీకు నమస్కారము అని అర్థము. మనం ప్రాథమిక   ఉన్నతపాఠశాలో చదువుకొనే రోజులో జాతీయగీతంతో పాటు ఒక ప్రతిజ్ఞ చెప్పుకొనే వాళ్ళము. అందులో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులుఅని ప్రారంభమవుతుంది. అంటే ఈ దేశం మన మాతృభూమి అని భావన. ఇటువంటి భావాత్మకత ఉన్నదేశంలో భారత్‌మాతాకీ జై అనేది ఒక సహజమైన నినాదం. ఇది ఏదో ఆర్‌ఎస్‌ఎస్‌ నినాదం కాదు.
ఈదేశంలో ప్రతిదానిని రాజకీయం చేయటం రాజకీయ నాయకుకు వెన్నతో పెట్టిన విద్య. ఆర్‌ఎస్‌ఎస్‌ని బూచిగా చూపించి దశాబ్దాలుగా రాజకీయ బ్ది పొందటానికి ప్రయత్నం  చేయని రాజకీయ పార్టీ లేదు అనటం అతిశయోక్తికాదు. ఆర్‌ఎస్‌ఎస్‌ సర సంఘాఛాక్‌గారు ఈదేశంలో అందరూ భారత్‌ మాతాకీజైఅని అనాని అన్నారు. కాబట్టి హైద్రాబాద్‌ ఎంపి అసదుద్దీన్‌ ఓవైసి నా మెడమీద కత్తిపెట్టిన నేను భారత్‌మాతాకీజై అని అనను అని ఒక సభలో మాట్లాడాడు. కనీస మర్యాద పాటించని ఇటువంటి వాళ్ళు దేశానికి  నాయకు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుండి ముస్లింకు రక్షకుడను నేను అని చెప్పుకొనటాకి అసదుద్దీన్‌ ప్రయత్నిస్తున్నట్టు ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్‌` కమ్యూనిస్టు ఆర్‌ఎస్‌ఎస్‌ను బూచిగా చూపించి ఓట్లు ర్చాుకొనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఈ రోజున దేశంలో ఏ స్థితికి దిగజారారో మనం గమనించవచ్చు. ఏదైనా కొంతకాం సాగుతుంది. ఎ్లకాం సాగదని అసదుద్దీన్‌ లాంటి వాళ్ళు ఎప్పటికి గ్రహిస్తారో?