భావ ప్రకటన స్వేచ్చ పేరిట జాతి వ్యతిరేక చర్యలను ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్థించదు- ఎక్కా చంద్రశేఖర్‌మార్చి 18న హైదరాబాద్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాయంలో ప్రాంత కార్యవాహ శ్రీ. ఎక్కా చంద్రశేఖర్‌ ప్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. వాటి వివరాలు... భారత్‌మాతాకీ జై అనే నినాదం దేశభక్తికి సంబంధించిన విషయం. ఈ నినాదం దేశభక్తిని సూచిస్తుంది. తన మెడపై కత్తి పెట్టి భారత్‌మాతాకీ జైఅనమని చెప్పిన అనబోనని మజ్లిస్‌ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్ధీన్‌ ఓవైసీ వ్యాఖ్యానించడం బాధ్యాతరాహిత్యం. ఎంపీ హోదాలో ఉండి ఇలాం టి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ ప్రాంత కార్యవా (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ఎక్కా చంద్రశేఖర్‌ తెలియచేశారు. ఓటు బ్యాంకు రాజకీయా కోసమే అసదుద్ధీన్‌ ఓవైసీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. శుక్రవారం బర్కత్‌పురలోని ఆర్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర కార్యాయమైన కేశవ నియంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో సమాచార భారతి ప్రతినిధి వి.నరసింహం తదితరుతో కలిసి మాట్లాడారు.ఈ సందర్భంగా ఈ నె 11,12,13వ తేదిలో రాజస్థాన్‌లో జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ అఖి భారత ప్రతినిధి సభలో ఆమోదించిన తీర్మానాను పత్రికకు విడుద చేశారు. యుద్ధ సైనికుతో పాటు దేశం కోసం పని చేసే వారందరూ భారత్‌ మాతాకీ జై అని నినదిస్తారు. అవినీతి వ్యతిరేక ఉద్యమ సందర్భంగా అన్నా హజారే తదితరులందరూ భారత్‌మాతాకీ జై అని నినదించారని గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్చాక్‌ మోహన్‌జీ భాగవత్‌ కామన్‌గా ఈ స్టేట్‌మెంట్‌ ఇచ్చారని గుర్తు చేశారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించవద్దని సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ దేశభక్తిని సంకుచిత ధోరణిలో చూడవద్దని కోరారు. ఐఎస్‌ఐకు, ఓటు బ్యాంకు రాజకీయాకు వ్యతిరేకంగా మాట్లాడటం  నచ్చకపోవడం వల్లనే ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఆర్‌ఎస్‌ఎస్‌పై తరుచూ ఇలాంటి విమర్శలు   చేస్తూ ఉండవచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట జాతి వ్యతిరేక చర్యను ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్ధించడం లేదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట దేశాన్ని ముక్కులు చేయానడం, కాశ్మీర్‌కు స్వాతంత్య్రం ఇవ్వాని కోరడం, యుద్ధ సైనికుకు వ్యతిరేకంగా వ్యాఖ్యా నించడం, ఇతరు మనోభవాను కించపర్చడం జాతి వ్యతిరేక చర్యని తెలిపారు. హింసను రెచ్చగొట్టే వైఖరిని సమర్ధించడం లేదని చెప్పారు. విలుతో కూడిన విద్యా విదానం అవసరమని అభిప్రాయపడ్డారు. పాఠ్యాంశాలో మార్పు తదితర విషయాలో ఆర్‌ఎస్‌ఎస్‌ జోక్యం చేసుకోదని తెలిపారు. యోగా ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ప్రపంచ దేశాలో యోగా అత్యంత ప్రభావం చూపుతుంది.యోగా విలువను ఆర్‌ఎస్‌ఎస్‌ తెలియ చేస్తే కాషాయీకరణ అంటే ఎలా అని ప్రశ్నించారు. ఆరోగ్య బీమ ప్రతి ఒక్కరికీ సుభంగా అందిం చేందుకు ప్రభుత్వాలు,స్వచ్ఛంద సంస్థలు విశేషంగా కృషి చేయాని, గ్రామీణ, వనవాసీ క్షేత్రంలో విద్యాభివృద్ధికి కృషి చేయాని, సమాజం నుంచి కు బేధాలు, అంటరానితనం తొగిపోవాని, దోపిడికి అవకాశం లేని ఏకాత్మత, సమరస జీవనా న్ని కొనసాగించాని ఆర్‌ఎస్‌ఎస్‌ అఖి భారత ప్రతినిధి సభ తీర్మానించిందని తెలియచేశారు. దేశవ్యాప్తంగా 36,867 స్థలాల్లో 56,859 శాఖలు నడుస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో 1614 స్థలాల్లో 2357 శాఖలు నడుస్తున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 154000 సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో 1194 సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయని చెప్పారు.   భాగ్యనగరంలో విశేషంగా కిశోరి వికాస వర్గలు నడుస్తున్నాయి. వీళ్లకు విద్య, వైద్యం, సాంస్కృతిక విషయాపైన ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబడుతూ ఉంటుంది. ఈ సం॥ సామాజిక సమరసతకు సంబంధించిన విశేష ప్రయత్నాలు, కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరిగాయి. వాటి వివరాలు సభకు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో 14 స్థలాలో సామాజిక సమరసత సమ్మేళనాలు జరిగాయి. ఈ కార్యక్రమాకు తెలంగాణ ప్రాంతంలో 447 గ్రామా నుండి 4,360మంది పాల్గొన్నారు. ఈ సంవత్సరం శ్రీశ్రీ కమలానంద భారతీ స్వామిజీ 57 గ్రామాలో పర్యటన చేశారు. ఆ సమయంలో 14,395 మంది వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫిబ్రవరి 7వ తేది నాడు హైదరాబాద్‌ సిటీలో డా॥ అంబేద్కర్‌ ఆలోచనపై ఒక సెమినార్‌ కార్యక్రమం జరిగింది.