అమరవాణి


శ్లో॥ న్యాయాగతస్య ద్రవ్యస్య
బోద్దవ్వౌ ద్వావతిక్ర మౌ
అపాత్రే ప్రతిపత్తిశ్చ
పాత్రే చాప్రతిపాదనమ్‌
న్యాయముగా సంపాదించిన ధనమును దుర్వినియోగం చేయు మార్గము రెండు.
1 అనర్హునికి ఇచ్చుట
2 అర్హునకు ఇవ్వకుండుట
అనగా! దానం చేయడమే సరిపోదు అర్హత ఉన్నవారికి (మంచివారికి మంచి కార్యము కొరకు పనిచేసేవారికి) దానం చేయాలి.