ప్రతినిధి సభలో ఆమోదించిన తీర్మానాలు..


 తీర్మానం: 1: ప్రభావవంతమైన ఆరోగ్య రక్షణకు, అందుబాటులో  ఉండే సుభ వైద్య సేవ ఆవశ్యకత
దేశ ప్రజలందరూ ఆజీవనమూ ఏ విధమైన రోగములూ లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శుభ్రమైన, ఆరోగ్యప్రదమైన జీవనశైలిని అనుసరించటంతోపాటు వైద్యసేవలు ప్రజందరికీ అందుబాటులో ఉండటం ఎంతైనా అవసరం. అనారోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తున్న కారణంగా చెరేగే రోగాలు ఈనాడు దేశంలో పెరిగిపోతున్నయి. అదే సమయంలో వైద్యసేవలు బాగా ఖరీదైనవి కావటంతో, అవి సామాన్య  ప్రజకు అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా లెక్కలేనన్ని కుటుంబాలు అప్పు పావుతున్నాయి. సంపాదనాపరులైన వారికి కూడా సకాలంలో చికిత్స జరుగని కారణాన, ఖర్చు పెరిగిపోయి ఆదాయం తగ్గిపోయి, ఆయా కుటుంబా ఆర్థికస్థితి కుదేవుతున్నది.
మంచి ఆరోగ్యం కావాలంటే ఆహారవిహారాలు ఆరోగ్యవర్ధకమైనవిగా ఉండాలి. సాత్త్వికత, ఆధ్యాత్మిక ప్రవృత్తి, యోగాభ్యాసము, దైనందిన వ్యాయామము, పరిశుభ్రమైన పరిసరాలు వీటిపట్ల దృష్టిపెట్టి శ్రద్ధవహించాలి. చిన్నపిల్లలకు సకాలంలో టీకాలు వేయించాలి. మత్తుపదార్థాకు, పానీయాకూ సమాజం దూరంగా ఉండాలి. ఈ విషయానికి గ ప్రాధాన్యాన్ని గుర్తించాలి. ఈ దిశలో జనసామాన్యంలో చైతన్యం కలిగించేందుకు స్వయంసేవకుతోపాటు మేలుకొన్న ప్రజలందరూ కూడా విస్తృతంగా యత్నించవసియుందని అఖి భారతీయ ప్రతినిధి సభ భావిస్తున్నది.
వైద్య చికిత్సాసేవలు పెద్ద నగరాలోనే కేంద్రీకృతమై యున్నందున గ్రామీణ క్షేత్రంలోని వారికి, దూరప్రాంతా వారికీ వైద్య సేవలు భించటం లేదు. వైద్య సదుపాయాలు కొరవడినందున, సుశిక్షితులైన చికిత్సా నిపుణులూ, తగిన సంఖ్యలో నియమింపబడని కారణంగాను, ఎందరో ప్రజలు వైద్యసేవకు నోచుకోలేకపోతున్నారు. సేవలు లభిస్తున్న చోట్లలో ప్రవేశం పొంది, పరీక్షలు జరిపించుకొని, సేవలు పొందడానికి సుదీర్ఘంగా నిరీక్షించవసి ఉంటున్నది. బారులు  తీరి నిబడవసి వస్తున్నది. వైద్యసేవలు ఇంతగా ఖరీదైనవి కావడానికి వైద్యవిద్య బాగా ఖరీదైనది కావటం ఒక ముఖ్య కారణం. అది వైద్యసేవ నాణ్యతనూ, విశ్వసనీయతనూ దెబ్బతీసేవిధంగా దిగజారిపోవడానికీ కారణ మవుతున్నది. నాణ్యతగ వైద్యసేవల స్త్రీలు, పిల్లలతో సహా ప్రజలందరికీ దేశమంతటా గ్రామీణ, గిరిజన ప్రాంతాతోసహా` అందుబాటులోకి రావాలంటే, వివిధ విధానా వైద్యసేవను విస్తరించవసియున్నది. ఇచ్చిన సహాననుసరించి, చికిత్స, ఉపచారములూ జరుగుతున్నవో లేదో తెలుసుకొనుటకు సమాచార సాంకేతికవిజ్ఞాన వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకొను పద్ధతును అమలు చేయవసి యున్నది.
దానశీలురు, పరోపకారస్వభావులూ అయినవారు నెకొల్పిన చికిత్సాయము ద్వారా వివిధ సామాజిక సంస్థలు, ధార్మిక సంస్థలు, జనసముదాయము నడిపించే వైద్యశాల ద్వారా దేశంలో చాలా చోట్ల సాధారణ ప్రజానీకానికి సముచితరీతిలో సేవలందుతున్నవి. అనుకరణీయమైనరీతిలో సేవలందించుచున్న ఈ సంస్థకు ప్రభుత్వ సహాయ ము భింపజేయవసియున్నది. వివిధ సంస్థ ద్వారా జరుగుతున్న ఈ ప్రయాసపట్ల హర్షం వ్యక్తం చేస్తూ, దేశంలోని పారిశ్రామిక సంస్థను, స్వచ్ఛంద సేవా సంస్థను, సామాజిక సేవాసంస్థను, వితరణ శీ సంస్థనూ ఈ దిశలో సేవ విస్తరణకై ముందుకు రావసిందిగా అఖి భారతీయ ప్రతినిధి సభ కోరుతున్నది. ఈ దృష్టితో ప్రజాభాగస్వామ్యం తోను, జనసముదాయము భాగస్వామ్యంతోను, పరస్పర సహకారం ప్రాతిపాదికగానూ నడిచే సంస్థకు ప్రోత్సాహమీయటం అవసరం.
గత కొద్ది సంవత్సరాలో ఉచితంగా మందుల పంపిణీ పథకాను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించినవి. దేశ వ్యాప్తంగా 3000 జనరిక్‌ (వ్యాపార దృష్టి లేని) ఔషధము వితరణ కేంద్రాను నెలకొలపవలెనని ఇటీవలి కేంద్రప్రభు త్వపు బడ్జెట్‌  (అర్థ సంకల్పం)లో ప్రతిపాదింపబడింది. ఈ ప్రయత్నములూ స్వాగతార్హము. ఔషధము సామాన్య ప్రజకు అందుబాటులో ఉండాలంటే, జనరిక్‌ ఔషధమును ప్రోత్సహించటము, ఔషధము ధరను నియంత్రించటమూ, పేటెంట్‌ వ్యవస్థను మానవీయతకు అనుగుణంగా వ్యవహరింపజేయటం అవసరమౌతాయి. ఔషధము నాణ్యతను నిలిపి ఉంచడానికి సమయాసమయాల్లో వాటిని ప్రయోగశాల్లో పరీక్షింపజేయవసి ఉంటుంది. ఆయుర్వేద, యునాని తదితర వైద్య విధానాలో రూపొందిస్తున్న ఔషధము ప్రమాణీకరణం కొరకు పరీక్షా పద్ధతునూ రూపొందిం చటం అవసరమవుతున్నది.
ప్రజలందరి జీవితానూ రోగరహితంగా తీర్చిదిద్దుకొనడానికి ఆరోగ్యప్రదమైన జీవనచర్యను పాటించవలెనని, మాతా-శిశు ఆరోగ్య రక్షా విధానాను అనుసరించవలెనని, పౌష్టికాహార లోపంతో బక్కచిక్కి ఉండేస్థితి నుండి, మత్తు పదార్థా, పానీయా సేవనం నుండి  రక్షించుకోవాని, ఈ దిశలో సమాజాన్ని మేల్కొల్పానీ అఖి భారతీయ ప్రతినిధిసభ స్వయంసేవకుతోసహా దేశవాసులందరికీ, స్వచ్ఛంద సేవా సంస్థకు, ప్రభుత్వానికీ పిలుపునిస్తున్నది. అన్ని రకా ఆరోగ్య సేవలు ప్రజలందరికీ సుభంగా భించే విధంగా తగినంతగా వనరును కేటాయించటమేగాక విధానాను, పథకానూ అమలు చేయటంలో చట్రానికి ముడిపడిన మార్పు, విధానపరమైన నిర్ణయాలు, ప్రక్రియ లో అవసరమైన మార్పు చేయవసిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాను గట్టిగా కోరుతున్నది. ఇందుకై దేశంలో భ్యమౌతున్న అన్నిరకా చికిత్సా పద్ధతును సమన్వయాత్మకంగా విస్తరించటం, నియామకాలు చేయటం, ప్రశిక్షణ యిప్పించటం, పరిశోధనలను కొనసాగించటం,  ఉత్తమ ఫలితాలు వచ్చిన పద్ధతును విస్తృత పరచటం` మొదలైన కార్యకలాపాకు  ప్రోత్సాహామివ్వాని, నియామకాలోను, నిర్ణయాను అమలు చేయటంలోనూ పారదర్శకంగా వ్యవహరించాని కూడా కోరుతున్నది.
 తీర్మానం: 2: వాసిగ విద్య అందరికీ చేరువ కావాలి, అందుబాటులో ఉండాలి
ఏ జాతియైనా, సమాజమైనా వికాసం చెందాలంటే` అందుకు విద్య ఒక మౌలిక సాధనం. కాబట్టి విద్యావ్యవస్థకు చేవ నివ్వడానికి, ప్రోత్సహించడానికి, విస్తరింపజేయడానికి ప్రభుత్వమూ, సమాజమూ ఉభయులూ బాధ్యులే. ఒక విద్యార్థి సమగ్రమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకొనడానికై తనలో బీజరూపంలో ఉన్న ప్రతిభా పాటవాను పోషించుకొంటూ మెరుగు దిద్దుకొనడానికి విద్య ఉపకరిస్తుంది. ప్రజలందరికీ ఆహారము, దుస్తులు, నివాసగృహము, జీవనోపాధి కల్పించటంతోపాటు విద్యను, ఆరోగ్య రక్షణనూ అందించటం కూడా సంక్షేమ రాజ్యంలో ప్రభుత్వము యొక్క ప్రాథమిక బాధ్యతగా గుర్తింపబడుతున్నది.
నేడు ఏ దేశంలోనూ లేనంత పెద్ద సంఖ్యలో యువజనులు భారతదేశంలో ఉన్నారు.  దేశం వైజ్ఞానికంగా, సాంకేతికంగా, ఆర్థికంగా, సాంఘికంగా అభివృద్ధి సాధించాలంటే ఈ దేశపు యువతకు వారి అభిరుచులు, సామర్థ్యాలు, గుణగణాను దృష్టిలో ఉంచుకొని తగినరీతిలో విద్యను నిరాటంకంగా అందించవసిన బాధ్యత ప్రభుత్వముమీద, సమాజంమీద ఉన్నది. ఈనాడు తల్లిదండ్రులందరూ తమ పిల్లలు బాగా చదువుకొని పైకి రావాని కోరుకొంటున్నారు. చదువుకొంటున్న విద్యార్థు సంఖ్య పెరుగుతున్న కొద్దీ, వారికి నాణ్యత, వాసి గ విద్య భింపజేయటం కష్టమవుతున్నది. గడచిన సంవత్సరాలో ప్రభుత్వం విద్యారంగానికి ఇవ్వవసినంత ప్రాధాన్యం ఇవ్వని కారణంగాను, అవసరమైన మేరకు నిధును కేటాయించని కారణంగానూ`లాభాపేక్షతో పోటీపడే సంస్థలు విద్యారంగంలో పెద్ద ఎత్తున చొరబడినవి. ఫలితంగా ఈనాడు పేద విద్యార్థుకు మంచి విద్య భించేస్థితిలేదు. తత్కారణంగా సమాజంలో ఆర్థిక అసమానతలు మరింతగా పెరిగిపోతున్నవి. ఇది యావత్తు జాతికి చింతాజనకమౌతున్నది.
విద్యారంగానికి తగినన్ని నిధులు కేటాయించడానికి, యోగ్యమైన విధానా రూప కల్పనకూ ప్రభుత్వము ముందుకు రావసిన  అవసరం నేడు ఎంతైనా ఉంది. విద్యారంగంలో పెరిగిపోతున్న వ్యాపారధోరణును అరికట్టవసి ఉంది. విద్యార్థులు తమకు అందుబాటులో లేనిస్థాయిలో డబ్బు పోయవసిన దుర్భరస్థితిని కొనసాగ నీయరాదు.
నాణ్యతాప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, అన్ని రకా వసతులు, సిబ్బందికి జీతభత్యానిచ్చే నియమనిబంధనలు, విద్యార్థునుండి వసూలు చేసే శుల్కము (ఫీస్‌) మొదలైన ప్రమాణాను స్థిరీకరించుకొని అనుసరించటంలో విద్యాసంస్థలు స్వాయత్తంగా ఉండటమేగాక తమను తాము నియంత్రించుకొనే విషయంలో పారదర్శకంగా వ్యవహరించేటట్లుగా ప్రభుత్వం వ్యవస్థను బలోపేతం చేయాలి.
బాబాలికందరూ విలుపట్ల శ్రద్ధ వహించే జాతీయ విద్యను పొందాని, అందరికీ సమానా వకాశాలు కల్గిన వాతావరణం కల్పిస్తూ అందరి జీవనోపాధికి దోహదం చేయగ ప్రావీణ్యంతో కూడిన విద్యను అభ్యసించాని అఖి భారతీయ ప్రతినిధి సభ అభిప్రాయపడుతున్నది. సరియైన ప్రమాణాను నిబెట్టడానికి ప్రభుత్వం నడిపే సంస్థలో నైనా, ప్రభుత్వేతర పాఠశాలోనైనా ఉపాధ్యాయుకు తగినంత శిక్షణ, చాలినంత జీతమూ ఉండాని, వారిలో కర్తవ్యనిష్ఠ ఉండాని అభిప్రాయపడుతున్నది.
సామాన్య వ్యక్తికి నాణ్యతగ విద్యను భారంలేని  విధంగా అందించటంలో మన సమాజం తరతరాలుగా చురుకైన పాత్రవహిస్తున్నది. మరి ఇప్పుడు కూడా వివిధ సామాజిక ధార్మిక సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, విద్యావేత్తలు, సమాజ ప్రముఖులూ బాధ్యత వహిస్తూ ముందుకు రావసి ఉన్నది.
వాసిగ విద్యను ఎవరికీభారంలేని విధంగా అందరికీ అందించేవిధంగా నిధును వెచ్చించవలెనని, అవసరమైన చట్టవిహితమైన పద్ధతును రూపొందించుకొనవలెనని అఖి భారత ప్రతినిధి సభ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వమును, స్థానిక సంస్థనూ కోరుచున్నది. విద్యను అందించటమనే మహత్కార్యంలో ముందుకు రావసినదని, ముఖ్యంగా గ్రామీణ, వనవాసీ క్షేత్రాలోనూ, అంతగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలోనూ దృష్టిని కేంద్రీకరించి పనిచేయవసినదని `అప్పుడు మాత్రమే సమర్థవంతమైన, యోగ్యమైన, జ్ఞానాధారితమైన సమాజము రూపుదిద్దుకోగదని, మన జాతిని అభివృద్ధిపరచి, సముద్ధరించుటకు అది కీకపాత్ర వహింపగదని ఈ సభ పిలుపునిచ్చుచున్నది.
తీర్మానం: 3: దైనందిన జీవితంలో సమరసతను పాటించండి
భారతదేశం ఎంతో ప్రాచీనమైనది. చింతనము ఎంతో కాలంగా మన పరంపరలో ఒక భాగమై ఉంది. చరాచర సృష్టి అంతా ఒకే తత్త్వంతో నిర్మింపబడి ఉందని, ప్రాణిమాత్రులైన వారందరూ ఆ తత్త్వానికి నియాలేనని మన విశ్వాసం. మనుష్యులందరూ సమానం, ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ అదే ఈశ్వరీయ తత్త్వం సమాన రూపంగా వ్యాపించియుంది. ఈ సత్యాన్ని తమ అనుభవా ఆధారంగా, ఆచరణ రూపంలో ఎందరో ఋషులు, మునులు, గురువులు, సాధుసంత్‌లు, సమాజ సంస్కర్తలు పదేపదే ప్రకటించి యున్నారు.
శ్రేష్ఠమైన చింతనను ఆధారం చేసుకొని మన సామాజిక వ్యవస్థను, దైనందిన ఆచరణనూ రూపొందించుకొని అమలు చేసిన రోజుల్లో భారతదేశం ఒకటిగా సమైక్యంగా, సమృద్ధంగా, అజేయంగా ఉండింది. ఈ శ్రేష్ఠమైన చింతనము విస్మరణకు గురైనపుడు మన వ్యవహారమూ దిగజారిపోయింది, సమాజం పతనమైంది. కులం ఆధారంగా హెచ్చు తగ్గు భేదభావాలు పెచ్చరిల్లాయి. అస్పృశ్యతవంటి అమానుషమైన దురాగతాలు చోటుచేసుకున్నవి.
ప్రతి ఒక్క వ్యక్తి తనదైనందిన జీవనంలో` వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా` ఏ స్థాయిలో వ్యవహరిస్తున్న ప్పటికీ మన సనాతనమైన శాశ్వత జీవనదర్శనానికి అనుగుణమైన విధంగా సమరసతాపూర్వకంగా మెలుగుతూ ఉండాని అఖి భారతీయ ప్రతినిధి సభ అభిప్రాయపడుతున్నది. అటువంటి ఆచరణ వల్లనే సమాజంలోనుండి కుభేదాలు, అంటరానితనము, పరస్పర అవిశ్వాసముతో కూడిన వాతావణమూ తొలగిపోతాయి. దోపిడీకి అవకాశంలేని, ఏకాత్మక, సమరస జీవితాన్ని మన అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాము.
మన దేశంయొక్క శక్తి సమాజంలో ఉంటుంది. సమాజంయొక్క శక్తి ఏకాత్మతా, సమరసతా భావన ఆచరణలోనూ, సోదరభావంలోనూ ఇమిడి ఉంటుంది. ఈ ఉదాత్త భావనను నిర్మించగ సామర్థ్యం మన సనాతన దర్శనం (తాత్త్విక చింతన)లో ఉంది. ఆత్మవత్‌ సర్వభూతాని (అన్ని ప్రాణునూ తనలోపలే ఒకే ఆత్మ ఉన్నదని భావించుట), అద్వేష్టా సర్వభూతానాం (అన్ని ప్రాణులు ఎడ ద్వేషరహితముగా నుండుట), ఏక్‌నూర్‌ తే సబ్‌ జగ్‌ ఉపజ్యా, కౌణభలే కౌ మందే (అంతటా ఒక తేజస్సు నిండి యుండగా, అధికుడెవడు, ల్ప్డెవడు?) మొదగు సూత్రము ననుసరించి అందరితోనూ ఆత్మీయతతోనూ,  గౌరవంతోనూ, సమానస్థాయిగ వారుగా గుర్తించి వ్యవహరించాలి. సమాజజీవితంలో నుండి భేదభావాతో కూడిన ప్రవర్తనము, అస్పృశ్యత వంటి దురాచారము, కూకటివేళ్ల తో సహా పెకలింపబడాలి. సమాజ జీవితం ఒడిదుడుకులు లేకుండా చక్కగా సాగిపోవాలంటే, సమాజంలోని ధార్మిక, సామాజిక సంస్థన్నీ ఈ దిశలో నిమగ్నమై పనిచేయాలి`ఇది ఎంతైనా అవసరం.
సనాతన కాలంనుండి సమాజ జీవన ఆదర్శ స్థితి గురించి సమగ్రచింతనను దేశప్రజానీకం ముందు ఉంచే సమయాలో అనేకమంది మహాపురుషులు, సంఘ సంస్కర్తులు సమతా యుక్త శోషణముక్త సమాజ నిర్మాణం కొరకు వ్యక్తిగత ఆచరణ ద్వారా సామూహిక ఆచరణ ద్వారా దేశకామాన పరిస్థితుకు అనుగుణమైన మార్పు తీసికొని రావసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. వారి జీవితము, వారు చేసి చూపిన పనులు, వారి జీవిత సందేశము ఎప్పటికీ మన సమాజానికి ప్రేరణనిస్తూనే ఉంటవి.
పూజ్యసంత్‌కు, పౌరాణికుకు, ప్రవచన కారుకు, విద్వజ్జనుకు, సామాజిక కార్యకర్తకూ అఖి భారతీయ ప్రతినిధి సభ చేయుచున్న మనవి ఏమంటే`ఈ దిశలో జరుగుతున్న సమాజ ప్రబోధన కార్యంలో మీరున్నూ సక్రియ భాగస్వాములు కావాలి. సమరసతకు అనురూపమైన తీరులో ప్రవర్తించాని స్వయంసేవకుతోసహా పౌరులందరినీ, అలాగే సమరసత అనేభావాన్ని బలోపేతం చేసేందుకు అన్ని రకా ప్రయత్నానూ తప్పక చేయాని ధార్మిక సామాజిక సంస్థనూ అఖి భారతీయ ప్రతినిధి సభ గట్టిగా కోరుతున్నది.