అంబేద్కర్‌ 125వ జయంతి కార్యక్రమాలు - కవి సమ్మేళనంకరీంనగర్‌లోః జాతీయ సాహిత్య పరిషత్‌ ఆధ్వర్యంలో శ్రీగాజు రవీందర్‌ మరియు నంది శ్రీనివాస్‌ నిర్వాహణలో సామాజిక సమరసతా మరియు డా అంబేద్కర్‌ అను అంశంపై కవితాగోష్టి జరిగింది. కరీంనగర్‌ పట్టణ మేయర్‌ శ్రీరవీందర్‌సింగ్‌ పాల్గొన్నారు. వక్తలుగా ఉపాధ్యాయులు శ్రీకన్నం రమేశ్‌, శ్రీ అప్పా  ప్రసాద్‌ ప్రసంగించారు. అతిథులుగా ఎస్‌సి హక్కు సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొమరయ్యగారు, గండ్రక్ష్యణ్‌రావు పాల్గొన్నారు. సుమారు 50 మంది కవులు తమ కవితా గేయాతో సామా జిక సమరసతా సందేశాన్ని అందించారు. కరీంనగర్‌ లో మొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన భించింది. పద్యాలు, కవిత రూపంలో పాడిన ఈ గేయా సంపుటిని ముద్రించి ఆవిష్కరించాని నిర్ణయించారు.
 నల్గొండలోః నల్గొండ పట్టణంలో జరిగిన డా బిఆర్‌ అంబేద్కర్‌ జయంతి కార్యక్రమంలో జాతీయ సాహిత్య పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ప్రధానవక్తలుగా ప్రసంగిస్తూ జాతీయ నాయకుడిగా గుర్తింపు కలిగించినపుడే, డా అంబేద్కర్‌కు న్యాయం చేసినట్లవుతుందని, హిందూ సమాజ సంస్కర్తలో ప్రధాన పాత్రను పోషించి, నిమ్నవర్గా నాయకుడిగా పేరు పొందినప్పటికీ, భారత రాజ్యాంగ రచన ద్వారా ప్రజలందరి మన్ననను పొందిన మహనీయుడని కీర్తించారు. రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ శ్రీకాశీరాము కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ అన్ని వర్గా ప్రజల్లో సామరస్యతకు సమరసతా వేదిక పనిచేస్తున్నదని వివరించారు. పల్లెర్ల యాదయ్య, కత్తు మారయ్య, చక్రహరి రామరాజు (నాల్గొండజిల్లా బిసి సంక్షేమ అధ్యక్షులు), పరంగి రవికుమార్‌ (పరీక్ష నిర్వహణాధికారి నాగార్జున డిగ్రీకళాశా), కరిది సూర్యనారాయణ కవి, రచయిత చింత ముత్యారావు తదితరులు పాల్గొన్నారు.
నాగారంలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ (రంగారెడ్డి జిల్లా)
ఏప్రిల్‌ 14న నాగారం గ్రామంలో డా బి.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ జరిగింది. సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా శ్రీడాక్టర్‌ వంశతిలక్‌, సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. శాసనసభ్యులు సంజీవరావు, గ్రామ సర్పంచ్‌ శ్రీమతి ప్రమీ, సింగిల్‌ విండో చైర్మన్‌ హన్మంతరెడ్డి, మండ ప్రెసిడెంట్‌ శ్రీమతి ఉమాపార్వతి, జెడ్పిటిసి శ్రీరాములు, ఉపాధ్యాయులు శ్రీగోవర్ధన్‌గారు, ఎంపీటిసి మునీరాబేగం, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ పాల్గొన్నారు. సుమార్‌ 500 మంది హిందూ బంధువులు పాల్గొన్నారు.