మరాఠ్వాడ భీడ్‌లో వినూత్న ప్రయోగం- పశువుల రక్షణయే- మా సంరక్షణగా జనం కదిలారుముందే ఎండాకాలం, మండే ఎండలు - బీడువారిన పొలాలు, త్రాగేందుకు గుక్కెడె నీళ్ళులేవు` కూపడేందుకు నిట్ట నీడలేదు. అన్ని ఎండినాయి. ఆశన్ని వీగినాయి. ఆత్మహత్యలే శరణ్యమని అనేకమంది రైతులు, పశువులు ఆహుతులౌతుపోసాగాయి. కాని అనుకోని దృశ్యం ఆశ్చర్యానికి గురిచేసింది. అనేక గుడారాలుయాత్ర - జాతర సంబరవేళల్లో కానవచ్చే ఆర్భాటం ఇక్కడ నిశ్శబ్ద బ్రతుకుపోరాటం `రక్షణ` సంరక్షణ ఆరాటం కనిపించింది.  మరాఠ్వాడా ప్రాంతంలో ప్రస్తుతం భగ - భగ మండే ఈ ఎండకాలంలో పశుసంరక్షణ శిబిరాలు అనేకం వెలిసాయి. దానికి మరాఠ్వాడ ప్రభుత్వం అండగా వచ్చింది. తమ పశువుల్ని పోషించలేనివారు వాటిని తీసుకొచ్చి పశు సంరక్షణ కేంద్రాల్లో ఉంచొచ్చు. వాటి బాగోగులు చూస్తు తాము ఉండొచ్చు. వానలు పడేదాక ప్రభుత్వమే ప్రతిరోజు వారికోసం పశుగ్రాసం`మంచినీరు` అవసరం మేరకు సరుకులు ఉచితంగా అందిస్తూ వాటి పానా - పోషణ జాగ్రత్తలు చూసుకోమంటుంది. పశుసంరక్షణకార్యాచరణతో పేద -సాద  రైతుకు పనికి పని, నీడకు నీడ, చీకట్లో చిరుదివ్వే వెలుగులా బ్రతుకుకు అండ, గాభరపడిన గొంతుకు గుక్కెడు నీళ్ళు, కడుపులో కాసీంత గంజీ అన్నం ఆసరాగా అందించబడ్డది. ఆవు -పశుగ్రాసం ప్రభుత్వమే అందించినా, పశువు పేడ, పాలు, పెరుగు, నెయ్యి తయ్యారి చేసుకొని దగ్గరిగ్రామాలో - పట్టణాలో విరివిగా మరి బేరమాడి విక్రయించి నాలుగాణాలు కూడబెట్టుకోగలుగుతున్నారు. ఉచితం ఉచితం కరువుసాయం అని చెప్పి గత ప్రభుత్వాలు కొండంత చూపి, గోరంత ఇచ్చి ఉన్నాం - లేనిదంతయు తమ` తమ బ్యాంకు ఖాతాల్లో` స్వార్థానికే స్వాహా చేసుకున్నారే తప్ప.. ఈ ప్రభుత్వం పశువుకు ఆసరా మా బ్రతుకులకు సహరా కల్పించి మాకు పని కల్పించారు. గో ఆధారిత గ్రామం  ఎన్నటికి ఎప్పటికి క్షేమమేకాని క్షామము కాదని నిరూపించగలిగారు.