ఆర్‌ఎస్‌ఎస్‌ ముక్త భారత్‌:? నితీష్‌ కలఆర్‌ఎస్‌ఎస్‌ ముక్తభారత్‌ అది సాధ్యమా?’ బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఆర్‌జెడి, కాంగ్రెస్‌, లూప్రసాద్‌ పార్టీ పొత్తుతో బీహార్‌ సీఎం పీఠం ఎక్కిన తన సొంతబమెంతో తెలుసుకోలేకపోతున్నాడు. 2019 సాధారణ ఎన్నికలో ప్రధానమంత్రి పదవికి ఆశ, ఊహ పల్లకిలో ఓలాలాడుతున్నాడు. ఆ కల స్వప్నమే ఆర్‌ఎస్‌ఎస్‌ ముక్తభారత్‌పిలుపు కాసేపు చర్చ కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ అనే పదాన్ని ప్రక్కనబెడదాం. దాని భావజాలం గురించి చర్చిద్దాం. ఈ దేశంలోని (జాతి) ఏ ప్రజలైతే అనేక వే సంవత్సరాలుగా సాగిస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక (ధర్మము), సాంస్కృతిక, సదాచార, సాంప్రదాయ, నైతికత ఆధారంగా ఏ జీవన విధానమేదైతే వుందో అదే ఈ జాతికి ప్రపంచ వ్యాప్తంగా అనేక వే సంవత్సరాలుగా గుర్తింపు తెచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌తో ఏలాంటి సంబంధంలేని కొన్నికోట్ల సాధారణ పౌరులు కూడా పైన తెలిపిన జీవన మార్గంపై విశ్వాసం కలిగి తన జీవితాన్ని ఈ దేశంలో ఆ మార్గంలోనే కొనసాగిస్తున్నారు. ఈ జాతి ఈ భూమిని, మట్టిని, నదీ-నదాను, చెట్టుచేమను ప్రకృతిలోని జడత్వాన్ని, చేతనత్వాన్ని ఆరాధనా భావంతో కొలుస్తుంది. దానిని పరిరక్షిస్తూ,  మనదేశాన్ని పరమవైభవస్థితికి చేర్చడమే, ఈ భావజాలం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ దేశ ప్రజ అర్వాచీన జీవన విధానమే ఈ భావజాలం. అటువంటి జీవన విధానం ఈ దేశానికి ఆత్మలాంటిది. భారతదేశం శరీరమైతేఆ శరీరంలో నిగూఢంగా కనిపించకుండా వున్న ఆత్మలాంటిది. ఏనాడైతే ఈ శరీరం నుండి ఆత్మ వెలువడి వెళ్ళిపోతుందో ఆ శరీరము నిర్జీవమై శవమై పోతుంది. ఇది కూడా అంతే ఏనాడైతే ఈ దేశం ప్రజలో ఈ భావజాలం ఉండదో! ఈ దేశం నీర్వర్యం అయిపోతుంది. అది ఈ పవిత్రదేశానికి (జాతికి) ఊహించకూడని పరిణామం. కనుక భారతీయులారా! నితీష్‌కుమార్‌ రాజకీయం, అవకాశవాద పిలుపును లోతుగా విశ్లేషించి, రాబోయే 2019 ఎన్నికలో ఆర్‌ఎస్‌ఎస్‌ ముక్తనినాదంతో ఏకమౌతున్న కుహానా సెక్యుర్‌ పార్టీకు, అవకాశవాదుకు తగిన రీతిలో గుణపాఠం చెప్పాలి.