ఇష్రాత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌` ఒక ‘చిదంబర’ రహస్యం2004లో గుజరాత్‌లో జరిగిన ఇష్రాత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన అనేక వాస్తవ విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడి, బిజెపి అగ్రనాయకుడు అద్వానీను హతమార్చేందుకు ష్కర్‌--తోయిబా  పన్నిన కుట్రలో సభ్యురాలిగా ఇష్రాత్‌ జహన్‌ ఉన్నట్లు ముంబై ఉగ్రవాద దాడు నిందితుడు డేవిడ్‌హెడ్లీ సాక్ష్యం వెల్లడించింది.  దానితో అప్పటి యుపిఏ హోంమంత్రి చిదంబరం యొక్క వ్యవహారశైలి ప్రశ్నార్థకం అవుతున్నది. తమ స్వార్థ రాజకీయం కొరకు దర్యాప్తు సంస్థను ఏ విధంగా యుపిఏ నాయకత్వం దుర్వినియోగం చేసిందో మనకు స్పష్టం అవుతున్నది. శ్రీ నరేంద్రమోడిని, అప్పటి గుజరాత్‌ హోంమంత్రి శ్రీ అమిత్‌షాను ఏ విధంగానైనా అణగదొక్కానే దురుద్దేశ్యంతో ఇష్రాత్‌ జహన్‌ ఎన్‌కౌంటర్‌ను బూటకపు ఎన్‌కౌంటర్‌గా చిత్రికరించాని చేసిన ప్రయత్నం ఇప్పుడు హెడ్లీ సాక్ష్యంతో బెడిసికొట్టింది. శ్రీ చిదంబరం కనుసన్నలోనే అప్పటి హోంశాఖ కోర్టులో దాఖలు చేసిన మొదటి అఫిడవిట్‌లో ఇష్రాత్‌ జహన్‌ ఉగ్రవాది అని పేర్కొని, ఆ తర్వాత అఫిడవిట్‌లో దానికి విరుద్ధంగా మొదటి అఫిడవిట్‌ను మార్చి ఇష్రాత్‌ జహన్‌ను అమాయకురాలిగా ప్రకటించడం జరిగింది. కేవలం రాజకీయ స్వార్థంతో ఉగ్రవాదును సైతం అమాయకులుగా చిత్రీకరించి జాతీయ భద్రతను సైతం ప్రక్కకు పెట్టిన విషయం ఈ అఫిడవిట్‌ ద్వారా వెల్లడవుతోంది.  బాధ్యత గ కేంద్ర హోంమంత్రి శ్రీ చిదంబరం అప్పటి యుపిఏ ఛైర్‌పర్సన్‌ సోనియా కనుసన్నలోనే పనిచేస్తూ ఈ చర్య చేపట్టినట్లు స్పష్టం అవుతున్నది. ఈ విషయం బయటకు రాగానే కాంగ్రెస్‌ నాయకత్వం చిదంబరం చేసిన చర్యకు సోనియా, రాహుల్‌కు ఏమీ సంబంధం లేనట్లు ప్రకటించి తప్పుకోచూస్తున్నాయి. ఇప్పటికైనా ఎన్డీయే ప్రభుత్వం ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేసి అప్పటి హోంమంత్రి చిదంబరం ప్రమెయంపైన, సోనియగాంధీ ప్రమేయంపైనా వాస్తవాను ప్రజ ముందుకు తీసుకురావాలి. అప్పడే మీడియా పాత్రపైనా కూడా వాస్తవ విషయాలు తెలియాని ప్రజలు భావిస్తున్నారు. దేశ భద్రతను ఉగ్రవాదుకు తాకట్టుపెట్టి తమ క్షుద్రరాజకీయ ప్రయోజనాకొరకు కేంద్ర దర్యాప్తు సంస్థను దుర్వినియోగ పరచేవాళ్ళు ఏ స్థాయిలో ఉన్న కఠినమైన శిక్ష విధించిటం సరియైన చర్య కాగదు.