సామాజిక ప్రజాస్వామ్యమే ఈ దేశానికి శ్రీరామ రక్ష` అదే అంబేద్కర్‌ ఆకాంక్షబ్రిటిష్‌ వారు భారతదేశాన్ని ఆక్రమించుకుని పరిపాలిస్తున్న రోజుల్లో ఈ దేశ పునర్‌నిర్మాణం కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి. ఒక ప్రక్క ఈ దేశాన్ని వంద సంవత్సరాలుగా వెంటాడుతున్న సామాజిక సమస్య నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూనే మరోప్రక్క ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించడానికి ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఈ దేశాన్ని ప్రభావితం చేసిన ప్రముఖులో మహాత్మాగాంధి, వీరసావర్కర్‌, డా బి.ఆర్‌.అంబేద్కర్‌ పేర్కొనదగిన వారు. వీరిలో గాంధీజి దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తూనే సామాజిక సమస్య పరిష్కారానికి కూడా విశేషంగా కృషిచేశారు. వేల సంవత్సరాలుగా ఉన్న ఈ దేశ సాంస్కృతిక జాతీయ వాదానికి ఈ కాలానికి సంబంధించిన ఒక సైద్ధాంతిక భూమికను అందించిన వారు వీరసావర్కర్‌. అదే సమ యంలో డా బి.ఆర్‌. అంబేద్కర్‌ వందల సంవత్సరాలుగా ఈ దేశాన్ని వెంటాడుతున్న అంటరానితనం అనే సమస్యను దూరం చేసి అట్టడుగు వర్గాల ప్రజలను మిగతా సమాజంతో పాటు ఎదిగింపజేసే ప్రయత్నం చేసినవారు. ఆ వర్గాలలో సామాజికంగా, రాజకీయంగా చైతన్యం నిర్మాణం చేసేందుకు విశేష కృషిచేసిన వారు బి.ఆర్‌.అంబేద్కర్‌.
సామాజిక ప్రజాస్వామ్య ప్రాధాన్యత
1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమలు చేసుకునే రోజు ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ దేశం రాజకీయ స్వాతంత్య్రం సంపాదించుకొంది. దేశం యొక్క సామాజిక ప్రజాస్వామ్యం ఎట్లా ఉండాలి అనేటటువంటి అంశంపైన ప్రసంగిస్తూ సామాజిక ప్రజాస్వమ్యం అంటే ఏమిటి? సామాజిక ప్రజాస్వామ్యం అనేది ఒక జీవన విధానం. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం అనే ఈ మూడు అంశాను జీవనానికి అవసరమైన సిద్ధాంతంగా ఇది పరిగణి స్తుంది. ఈ మూడు ఒకదానితో ఒకటి మమేకమైనవి. వీటిని విడదీయటం ఆ సామాజిక ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. ఇందులో ఏ ఒక్క దానిని తొగించినా ప్రజాస్వామ్య మనుగడ ఉండదు. సమానత్వంలేని స్వేచ్ఛ వ్యక్తు ఆధిపత్యాన్ని నెలకొల్పుతుంది. స్వేచ్ఛ లేని సమానత్వం వ్యక్తిగత చొరవను చంపేస్తుంది. సోదర భావం లేని స్వేచ్ఛ సమానత్వం సహజంగా ఉండలేవు. వాటిని బవంతంగా రుద్దాల్సిన పరిస్థితి తలెత్తుతుందిఅని వివరించారు. అంబేద్కర్‌ ఈ మాటను చెప్పి 66 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 66 సంవత్సరాలో ఈ సమాజంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. సామాజిక ప్రజాస్వామ్యం పటిష్టత కోసం దేశంలో అనేక సంస్థలు, వ్యక్తులు పనిచేసుకుంటూనే వస్తున్నారు. ఆ పను యొక్క సకారాత్మక ప్రభావం సమాజం మీద కూడా పడుతున్నది. అంబేద్కర్‌ కాలంలో లేని ఒక కొత్త సమస్య ఈరోజుల్లో చోటు చేసుకుంది. అదే రాజకీయ ఆధిపత్యం. స్వతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి రాజకీయ అధికార కోసం, రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటంలో ఈ సమాజాన్ని చీల్చేటటువంటి ప్రయత్నాలు అనేకం జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రజ మధ్య పరస్పర అవిశ్వాసం నిర్మాణం చేయటం అనేది ఈ దేశంలో రాజకీయ నాయకుకు వెన్నతో పెట్టిన విద్యలాగా మారిపోయింది. ఈ పరిస్థితును అధిగమించి అంబేద్కర్‌ ఏ సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించాని కలుగన్నాడో దానికోసం మనం పనిచేయావల్సిన అవసరం ఉంది.
వివిధ పత్రికల్లో అంబేద్కర్‌ గురించి..
ఈ సమయంలో అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా దేశంలో ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో పత్రికలో వచ్చిన వ్యాసాను మనం గమనించినట్లయితే అంబేద్కర్‌ ఏదైతే కగన్నాడో దానిని సాధించేందుకు ఈ సమాజం ఏం చేసింది అనేటటువంటి విషయాను ప్రక్కన పెట్టి అంబేద్కర్‌ 100 సంవత్సరాకు పూర్వం ఈ సమాజానికి సంబంధించి ఏ సమస్య గురించి ఆయన మాట్లాడాడో ఆ మాటను చర్విత చరణంగా పత్రికల్లో నింపేశారు. దాంతో వాళ్లేం సాధించానుకున్నారో సామాన్యుకైతే అర్థం కాని విషయం. పత్రికల్లో వచ్చిన వ్యాసాను మనం గమనించినట్లైతే అంబేద్కర్‌ చెప్పిన మాటతోనే సమాజంలో వైష మ్యాలు నిర్మాణం చేసేందుకు కావాల్సిన అంశాన్నింటిని ఒకదగ్గరకు తీసుకొచ్చి రాశారు. వాస్తవంగా అంబేద్కర్‌ కోరుకున్నది వైషమ్యాను తొగించడం కోసమే. కాని వారి మాటను ఉపయోగించుకొని వైషమ్యాను రెచ్చగొట్టడం అనేది ఈ రోజున కమ్యూనిస్టులు, మావోయిస్టులు ఉదారవాదం ముసుగు తగిలించుకున్న కొందరు మేధావులు విశేషంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ భేద తంత్రాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్‌ కమ్యూనిజం గురించి ఏం చెప్పారో మనం గమనిద్దాం. దళిత వర్గా ప్రజను కమ్యూనిజంలో కవకుండా అంబేద్కర్‌ ఇనుప గోడలాగా నిబడ్డాడు. ఈ విషయాన్ని అంబేద్కర్‌ స్వయంగా భారతీయ మజ్దూర్‌సంఘ్ నాయకులైన దత్తోపంత్‌ ఠెంగ్డేజీతో చెప్పిన మాటను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఠెంగ్డేజీతో అంబేద్కర్‌ భారతదేశంలో కమ్యూనిజాన్ని మనం పెరగని వ్వకూడదు. కమ్యూనిజానికి, దళిత వర్గా ప్రజకు మధ్య నేను ఇనుప గోడలాగా నిబడతాను. మిగతా సమాజానికి కమ్యూనిజానికి మధ్య మీరు అట్లాగే నిబడి కమ్యూనిజాన్ని భారతదేశంలో నిరోధించాలిఅని చెప్పారు. ఈ రోజున ఆ కమ్యూనిస్టులే దళిత వర్గా సంరక్షుము మేమే అని నిరూపించుకునేందుకు సమాజంలో వైషమ్యాలు నిర్మాణం చేసేందుకు, రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
అంబేద్కర్‌ - గాంధీజీ
అట్లాగే ఆ రోజుల్లో గాంధీజి ఈ సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు స్వాతంత్య్రాన్ని సంపాదించేందుకు ఆయన మార్గంలో ఆయన విశేష ప్రయత్నం చేశారు. గాంధీజి చేతిలో అడవిలోని గడ్డి, సముద్రంలోని ఉప్పు, నూలు వడికే రాట్నం బ్రహ్మాస్త్రాలుగా బ్రిటీష్‌ వారిపై పనిచేశాయి. గాంధీజి ఈ సమాజంలోని అంటరానితనం దూరం చేసేందుకు నిజాయితీగా ప్రయత్నం చేశారు. అయితే గాంధీజి అంబేద్కర్‌ ఆలోచనల్లో కొంత సారూప్యత, కొన్ని విషయాల్లో అభిప్రాయబేధాలు ఉండవచ్చు. కాని సంపూర్ణ సమాజంలో ఒక సామరస్య పూర్వక వాతావరణం నిర్మాణం చేయానేదే వారి ఇరువురి ఆలోచన. ఇరువురి క్ష్యం ఒకటే. ఆలోచనలు, అనుసరించే విధానాలు వేరుకావచ్చు. దానిని అడ్డంపెట్టుకుని సమాజంలో సామరస్య పూర్వక వాతావరణాన్ని భగ్నం చేసే ప్రయత్నం చేయటం ఎంత వరకు సమంజసమో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రముఖ దినపత్రికలో పసలేని గాంధీ తత్వంఅనే శిర్షీకతో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో గాంధీజి గురించి అంబేద్క ర్‌ చెప్పాడని కొన్ని విషయాను ఊటంకించారు.
గాంధీజి ఆలోచనలో పసలేదని అంబేద్కర్‌ గాంధీజి చెప్పిన మాటను చెప్పుతూ చివరకు గాంధీజిని బోనులో నిబెట్టే వరకు వెళ్లారని రాశారు. దానిని సమర్థించుకునేందుకు రాజీజీ 1932 డిసెంబర్‌ 20న ఒక కార్యక్రమంలో చెప్పిన మాటలు గాంధీ మహాత్ముడు మానసికంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎంతో గాయపడ్డారు కానీ వాటన్నింటికంటే అంబేద్కర్‌ విమర్శలు మరింత పదునైనవి. ఇంగ్లాడు ప్రభువు చర్చిల్‌ ముందు కూడా మహాత్ముడు చలించలేదు కాని అంబేద్కర్‌ ఆరోపణ ముందు బోనులో నిబడవసి వచ్చిందనిచెప్పారు. బహుశా ఈ విషయాన్ని తతోక తీసేసి చెప్పిన మాటలుగా కనబడుతున్నాయి. మొత్తం మీద గాంధీజి మరియు అప్పటి నాయకత్వం గత చరిత్రకు పూర్తిగా బాధ్యులు అని చెప్పేవరకు సాగింది వారి మాటలు. ఇది చాలా తీవ్రంగా గర్హించదగిన విషయం. చరిత్రలో జరిగిన తప్పును సరిచేసుకుని ముందుకు పోయేందుకు పరస్పరం కలిసి పనిచేయావసి ఉంటుంది. ఇది విస్మరించటం ఒక బాధ్యత రాహిత్యం. సమాజంలో వైషమ్యాలు నిర్మాణం చేయాలి అనుకునేవారు ఇట్లాగే వ్యవహరిస్తారని అని అర్థం చేసుకోవాల్సిన అవసరం కనబడుతుంది.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం మన కర్తవ్యం
హిందూ సమాజం వే సంవత్సరా చరిత్ర కలిగింది. ఈ సమాజం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. అయినా సమాజంలో ఏకత్వాన్ని సాధిస్తూ ముందుకు పోతూనే ఉంది. రూఢీ వాదులుగా చరిత్రకెక్కిన కమ్యూనిస్టులు, మావోయిస్టులు ఇటువంటి వాళ్లు సమాజంలో ఏకత్వాన్ని చూడటం అనేది వాళ్లకు ఇష్టం లేని విషయంగా కనబడుతుంది. కాబట్టే పరస్పర విధ్వేషాలు నిర్మాణం చేసే పద్ధతిలో అంబేద్కర్‌ మాటల్ని పత్రికల్లో నింపేశారు. ఇటువంటి వాటి విషయంలో హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలి. అంబేద్కర్‌ ఏ పరిస్థితుల్లో ఆ మాటను మాట్లాడారో వాస్తవంగా ఏమి కావాని కోరుకున్నాడో అది ఎంత వరకు సాధించబడింది అనే విషయాన్ని ఈరోజున మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన మనం దృష్టి సారించి సామాజిక ప్రజాస్వామ్యం కోసం కృషి చేయటం నిజంగా అంబేద్కర్‌కు మనం సమర్పించే నివాళి.
అంబేద్కర్‌ ఈ దేశం గురించి ఏఏ విషయాను స్పష్టంగా తెలియజేశాడు? అవి ఈ రోజుకి కూడా ఆ మాటలు సత్యం అని మనకు గుర్తు చేస్తున్నది. కమ్యూనిజం గురించి అంబేద్కర్‌ చెప్పింది అక్షరసత్యం. ఆ కమ్యూనిస్టులు ఈరోజున అంబేద్కర్‌ను దళిత నాయకుడిగా దళిత ఉద్ధరణ కొరకు మాత్రమే పనిచేసినవాడిగా చూపించేందుకు నానా తంటాలు పడుతున్నారు. అంబేద్కర్‌ ఒక జాతీయ నాయకుడు. ఈ దేశం భవిష్యత్తులో ఎట్లా ఉండాలో సూచించిన వారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం అనేది మన అందరి కర్తవ్యం అని 1950వ సంవత్సరం ఉభయ సభను ఉద్దేశించి చేసిన యొక్క ప్రసంగం సారాంశంగా మనకు కనబడుతుంది. ఈ రోజున ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా నిబడేందుకు ఈ దేశం ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటున్నారు అనే విషయం సమకాలిన చరిత్ర మనకు తెలియజేస్తున్నాయి. ఈ దేశ ప్రజలు అత్యంత ప్రేమతో ఆదరించిన ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తే ప్రజాస్వామ్య రక్షణ కోసం ఆమెను ఎన్నికల్లో ఓడించిన ఖ్యాతి ఈ దేశ ప్రజది. ప్రజాస్వామ్య వ్యవస్థపై సామాన్య ప్రజలు చూపిస్తున్న విశ్వాసమే దీనికి తార్కాణం. ఆ ప్రజాస్వామ్యాన్ని బహీనం చేయాని ప్రయత్నం చేస్తున్న శక్తులు ఎవరో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఈ దేశ ప్రజను కలిపి ఉంచే భాష సంస్కృతం. ఆ భాషను మళ్లి తిరిగి ఈ దేశంలో శక్తివంతం చేయాలి, దానిని జాతీయ భాషగా చేయాని  రాజ్యాంగం నిర్మాణం జరుగుతున్న సమయంలో అంబేద్కర్‌ సూచించారు. ఆ సంస్కృత భాషను మృత భాషగా పేర్కొంటూ ఈ దేశంలో ఏ మేధావులు పనిచేస్తున్నారో మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పొతే అనేక విషయాలు ఉంటాయి.
రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘం - సామాజిక ప్రజాస్వామ్యం
ఇక్కడ ఈ సందర్భంలో ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1925వ సంవత్సరంలో ప్రారంభించబడింది. ఆ రోజు నుండి ఈరోజు వరకు ఈ దేశంలో సామాజిక ప్రజాస్వామ్యం గురించే ప్రధానంగా పనిచేస్తున్న సంస్థ. గాంధీజి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యక్రమాలు ప్రత్యక్షంగా చూసారు. సంఘంలో సామాజిక సామరస్య భావన ఎట్లా నిర్మాణం చేస్తున్నదో తమ కళ్లతో స్వయంగా చూశారు. ఈ పని వేగంగా జరగాని తమ ఆకాంక్షను కూడా తెలియజేశారు. డా అంబేద్కర్‌ కూడా సంఘ నిర్మాత డాక్టర్‌జీ జీవించి ఉన్న కాలంలోనే ఒకసారి సంక్రాంతి ఉత్సవంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఉండటాన్ని చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అప్పటి నుంచి ఈ పనను చేసుకుంటూనే వస్తున్నది. కరుడుగట్టిన ఛాందసవాదులు కళ్లను తెరిపించి సమాజంలో సామాజిక సమైక్యత కోసం కృషిచేస్తూనే ఉన్నది. ఈరోజు సామాజిక సమరసత అనే ఒక వేదికను ఏర్పాటు చేసి తన పనిని తాను చేసుకుంటూ పొతున్నది. అట్లాగే సేవాభారతి ద్వారా క్ష మంది సమాజంలో ఉన్న అట్టడుగువర్గా సంక్షేమం కోసం, చైతన్యం కోసం కృషిచేస్తున్నది. ఇటువంటి సంస్థపై అంబేద్కర్‌ విశ్వాసం వ్యక్తం చేస్తే అంబెద్కర్‌ గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ మాట్లాడడం ఏమిటి? అని ప్రశ్నించే వారు ఉన్నారు.  అంబేద్కర్‌ గురించి మాట్లాడే హక్కు తమకే ఉంది అనేంతవరకు వెళ్లారు. ఇట్లా సమాజంలోని కొన్ని వర్గాలు ఆర్‌ఎస్‌ఎస్‌పైన బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా  చేసేవాళ్ల్లు సమాజం సమైక్యంగా ఉండాలి అని కోరుకొనేవారా? సమాజాన్ని విడగొట్టేవారా? అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ముగింపు
వే సంవత్సరాలుగా ఈ దేశంలో జన్మించిన మహాపురుషులు ఎవరైనా ఈ దేశం యొక్క సమైక్యత సామాజిక చైతన్యం కోసమే పనిచేశారు అనేది మన చరిత్ర చెప్తున్న సాక్ష్యం. ఈ దేశంలో ఏ మహా పురుషుడు కూడా దేశ వచ్ఛినాన్నికి కాని, సామాజిక విచ్ఛినానికి కాని పనిచేయ్యలేదు. సమాజంలోని తమ సమకాలిన సమస్య గురించి ప్రస్తావన చేసి ఉండవచ్చు. కాని అంతిమ క్ష్యం సామాజిక ప్రజాస్వామ్యమే అని మనకు కనబడుతుంది. డా బి.ఆర్‌.అంబేద్కర్‌ కూడా తను ఎదుర్కొన్న అనేక సమస్యలు, దేశంలో పరిస్థితులు సాంస్కృతికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్న అప్పటి పరిస్థితుపై మాట్లాడారు. కాని వారి క్ష్యం ఈ దేశం సామాజిక ప్రజాస్వామ్యంతో శక్తివంతం కావటమే. సమకాలిన సమస్య గురించి మాట్లాడటం అనేది పరిస్థితును అర్థం చేయించేందుకు మాత్రమే. కాని అదే క్ష్యం కాదు. క్ష్యం సామాజిక ప్రజాస్వామ్యం. ఈ దిశలో కృషిచేసిన అనేక మంది మహా పురుషు బాటలో మనం కూడా ముందుకు వెళ్లాలి. అదే మనం వారికి సమర్పించే నిజమైన నివాళి.