ఎట్టకేలకు కంచీపిఠాధిపతిని నిర్దోషిగా ప్రకటించిన చెన్నై కోర్టుకంచి మఠానికి సంబంధించిన అక్రమాను లేఖ ద్వారా బయటతెలిపారనే ఆరోపణపై 2002 సెప్టెంబర్‌ 20వతేది నాడు రాధాకృష్ణన్‌ అనే ఆ పీఠానికి సంబంధించిన మాజీ ఆడిటర్‌ హత్యచేయబడ్డాడు. అదే విధంగా 2004 సెప్టెంబర్‌లో ఆ పీఠంలో పనిచేసిన మేనేజర్‌ శంకర్‌రామన్‌ హత్యకూడా జరిగింది. దీనిపై కంచి పీఠానికి సంబంధించిన ఇద్దరు స్వామీజీతో సహా 12మందిపై కేసు నమోదు చేసారు. శంకర్‌రామన్‌ హత్యకేసుకు సంబంధించి 2013 పుదుచ్చేరి కోర్టు స్వామీజీలిద్దరిని నిర్దోషిగా ప్రకటించింది. మొదటి కేసుకు సంబంధించి ఏప్రిల్‌ 29, 2016నాడు చెన్నై అదనపు సెషన్‌ న్యాయమూర్తి ఆ కేసులో ఉన్న వారందరినీ నిర్దోషులుగా ప్రకటించాడు. ఎట్టకేకు కంచి స్వామీజీ హత్య కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డాడు. ఈ విషయాన్ని చెప్పేందుకు కోర్టులు పది సంవత్సరాకు పైగా కాలం తీసుకున్నాయి. దేశంలోనే ప్రసిద్ధిపొందిన ఈ పీఠం యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు చాలా పెద్ద ఎత్తున కుట్ర జరిగిందన అనిపిస్తున్నది.