పంచాయతీ సుపరిపాలనకు పట్టుగొమ్మ
పంచాయతీను బలోపేతం చేసే ప్రక్రియకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. ఏప్రిల్‌ 24న పంచాయతిరాజ్‌ దినోత్సవంలో పాల్గొంటూ ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో మోడీ పంచాయతీను పటిష్ట పరచవసిన అవసరాన్ని, అభివృద్ధిలో వాటి క్రియాశీక పాత్ర గురించి మాట్లాడారు. కేంద్రం అందిస్తున్న పథకాను అందిపుచ్చుకొని గ్రామాలు ఆధునిక సదుపాయాను సమకూర్చు కోవాన్నారు. సంసద్‌ గ్రామ యోజన ద్వారా ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి పార్లమెంటు సభ్యుడినీ సంవత్సరానికి ఒక గ్రామం దత్తతతీసుకోమని పిలుపునిచ్చిన మోడీ అందుకనుగుణంగా 2018 వరకు అన్ని గ్రామాకు రోడ్లు, 2019వరకు అన్ని గ్రామాకు విద్యుత్తును అందించే  క్ష్యంతో ముందుకెళ్తున్నారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, శిశుమరణాలు ఆపడం, పిల్లలు బడికెళ్ళడం మానకుండా చూడడం, రైతు పంట భీమా పథకంలో చేరడం, మహిళలు కట్టెపై వంటచేయకుండా వుండేలా గ్యాస్‌కనెక్షన్లు ఇప్పించడం వంటి విషయాపై శ్రద్ధ పెట్టాలని పంచాయతీకు పిలుపునిచ్చారు. పంచాయతీ ద్వారా స్థానిక స్వపరిపానకు, సుపరిపానకు ఆచరణాత్మక రూపునివ్వాని కేంద్రం భావిస్తోంది. 1959లో రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో నాటి ప్రధాని నెహ్రూ ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థ పురుడుపోసుకుంది. 1992లో నాటి ప్రధాని పి.వి.నరసింహారావు హయాంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగబద్ధత భించింది. దీని ప్రకారం స్థానికంగా ప్రజా పంపిణీ వ్యవస్థ, సామాజిక సంక్షేమం, మార్కెట్లు, కుటుంబ సంక్షేమం, సాంకేతిక శిక్షణ వృత్తివిద్య, దారిద్య్ర నిర్మూ, గ్రామీణ విద్యుదీకరణ, భూసంస్కరణలు, మహిళా శిశుసంక్షేమం, పశుపోషణ, వ్యవసాయం ఇత్యాది 29 అంశాను స్థానిక సంస్థకు బదిలీ చేయాలి. కాని ఈ బదిలీ విషయంలో అనేక రాష్ట్రాలో ఇంకా సంతృప్తికరమైన పనిజరగలేదు. స్థానికంగా ప్రజలు స్థానిక సంస్థలో ఎక్కువ పాలుపంచుకోవడమే ప్రజాస్వామ్యానికి బలాన్నిస్తుంది. గ్రామ స్వరాజ్యం ద్వారా రామ రాజ్యం సాధించాన్నారు గాంధి. అంబేద్కర్‌ జయంతి ఏప్రిల్‌ 14నాడు వ్యవసాయ ఉత్పత్తుకు మంచి ధర భించే విధంగా ప్రధానిమోడీ ఈ` మార్కెట్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. 10 రోజుపాటు గ్రామ్‌ ఉదయసే భారత్‌ ఉదయ్‌పేరున ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాను గ్రామీణ ప్రజకు తెలియజేసే బృహత్తర కార్యక్రమం తీసుకున్నారు. గ్రామ పంచాయతీకు 2015-2020 మధ్యకాలంలో నేరుగా రెండు క్ష కోట్ల నిధును అందజే యాన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసును మోడీ ప్రభుత్వం ఆమోదించింది. ఇదొక గొప్ప నిర్ణయం. గతంకంటే ఈ నిధులు మూడు రెట్లు ఎక్కువ. మౌలిక వసతు కోసం ఏడాదికి 17క్షలు మంజూరు అవుతాయి.  ఈ ఏడాది ఆ నిధు విడుద జరిగిపోయింది. తాలూకా పంచాయతీ, జిల్లా పంచాయతీ అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీర్చాలి. పన్నులో రాష్ట్రాకిచ్చే వాటాను కేంద్రం 32శాతం నుంచి 42 శాతానికి పెంచింది. పంచాయతీలో మహిళ రిజర్వేషన్లను 33శాతం నుంచి 50శాతానికి పెంచేందుకు ప్రభుత్వం సవరణలు  ప్రతిపాదించనుంది. గ్రామాలు కళకళలాడితేనే దేశం బాగుంటుంది. అప్పుడే రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభుత్వాలు పనిచేసినట్లవుతుంది.