నీకు నాలుగు - నాకు ఒకటేనా?మహమ్మదీయులో పురుషుడికి నలుగురు భార్యలు ఉండవచ్చు, స్త్రీకి మాత్రం నలుగురు భర్తలు ఎందుకు ఉండరాదు? స్త్రీలు కూడా నలుగురు పురుషును వివాహం చేసుకోవచ్చుకదా! అని ప్రశ్నించారు జనాబ్‌ కమాల్‌ షా. ఈయన కేరళలో జడ్జిగా పనిచేస్తున్నారు. ఒక కార్యశాలో మాట్లాడుతూ ఆయన పై విధంగా ప్రశ్నించాడు. దీనిపై ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌లా బోర్డువారు ఆగ్రహోదగ్ధుయ్యారు, నిప్పులుత్రొక్కిన కోతిలా రెచ్చిపోయారు. లా బోర్డు సభ్యుడు జనాబ్‌ హజ్రత్‌ హజీమహమ్మద్‌ మౌలానా రహీం` ఉద్‌`ద్దీన్‌ అన్సారీ తీవ్ర పదజాంతో కమాల్‌షాను దుయ్యబట్టాడు. ఇస్లాంలో పురుషుకు నలుగురు మహిళను వివాహం చేసుకొనే అధికారం ఉన్నది కానీ! స్త్రీను మాత్రం ఒకడే భర్త ఉండాలి అని కుండబ్రద్ధలు కొట్టాడు.