కార్యకర్తలను తీర్చిదిద్దే సంఘ శిక్షవర్గారాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రతి సంవత్సరం కార్యకర్తకు శిక్షణ ఇస్తుంటుంది. మే-జూన్‌ మాసాలలో దేశవ్యాప్తంగా ఈ శిక్షణ ఉంటుంది. సంఘంలో ప్రథమవర్ష, ద్వితీయవర్ష, తృతీయవర్ష ఉంటుంది. అందులో తృతీయవర్ష నాగపూర్‌లో దేశం మొత్తానికి సంబంధించిన అన్ని ప్రాంతా కార్యకర్తలు అక్కడ శిక్షణ పొందుతూ ఉంటారు. ప్రథమ, ద్వితియ వర్షలు ప్రాంతా వారిగా జరుగుతుంటాయి. ఈసారి తెలంగాణ ప్రాంతంలో ప్రథమ వర్ష, హైదరాబాద్‌, నిజామాబాద్‌లలో, ద్వితీయ వర్ష, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు సంబంధించి హైదరాబాద్‌లో నిర్వహించబడ్డాయి. ఈ వర్గలు మే 20-21 తేదిలో ముగిసాయి. ఈ వర్గలో ప్రథమ వర్షలో 714 మంది పాల్లొన్నారు. ద్వితీయ వర్షలో తెలంగాణ ప్రాంతం నుండి 193 మంది పాల్లొన్నారు. శిక్షావర్గ ముగింపుకు ముందు కార్యక్రమంగా సార్వజనికోత్సవాలు జరుగుతుంటాయి. ఈ సంవత్సరం మే 19వ తేది నాడు ఇందూరులో జరిగిన ప్రథమ వర్ష సార్వజనికోత్సవం, భాగ్యనగర్‌లో ద్వితివర్ష సార్వజనికోత్సవాలు జరిగాయి. 20వ తేది సాయంత్రం హైదరాబద్‌ లోని అన్నోజిగూడ దగ్గర రాష్ట్రీయ విద్యాకేంద్ర పాఠశా మైదానంలో ప్రథమవర్ష సార్వజనికోత్సవం జరిగింది. ఈ సార్వజనికోత్సవాలో శిక్షార్థులు తాము పొందిన శిక్షణను ప్రదర్శన ద్వారా అందరికీ చూపించారు. ఈ కార్యక్రమంలో సుమారు 30 నుంచి 40 నిమిషా పాటు శారీరక ప్రదర్శన జరుగుతుంటాయి. ఈ సంవత్సరం జరిగిన సార్వ జనికోత్సవ ఉత్సవాలో 1) ఇందూరులో కార్యక్రమ ముఖ్య అతిథి పి.సూర్యప్రకాశ్‌గారు పాల్గొన్నారు. ప్రధాన వక్తగా శ్రీ.మల్లికార్జున్‌జీ (ప్రాంత ప్రచార ప్రముఖ్‌) పాల్గొన్నారు. 2) భాగ్యనగర్‌లోని ద్వితియవర్షలో ఇండో-యు.ఎస్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పటిల్స్‌ చైర్మన్‌ పద్మశ్రీ డా॥ దాసరి ప్రసాదరావుగారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధానవక్తగా శ్రీ అన్నదానం సుబ్రహ్మణ్యంగారు (తెలంగాణ ప్రాంత సహకార్యవాహ) పాల్గొన్నారు. అన్నోజిగూడలో జరిగిన ప్రథమవర్ష సార్వజనికోత్సవంలో ముఖ్య అతిథిగా యడవల్లి సుబ్రహ్మణ్యం గారు, ప్రధాన వక్తగా శ్రీదూసి రామకృష్ణగారు (దక్షిణమధ్యక్షేత్ర కార్యవాహ) పాల్గొన్నారు.