రోహిత్‌ ఆత్మహత్య.. ఎస్‌ఎఫ్‌ఐ నేత సంచలన వ్యాఖ్యలుహైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో రీసెర్చ్‌ స్కార్‌ వేము రోహిత్‌ ఆత్మహత్యపై విచారణ సమగ్రంగా జరిపించాని హెచ్‌సీయూ విద్యార్థి సంఘం నేత రాజ్‌ కుమార్‌ సాహు డిమాండ్‌ చేశారు. రోహిత్‌ వేము ఆత్మహత్యకు అసలు కారణాలువేరని ఆయన సంచ వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి జరిగిన ఎన్నికల్లో సాహు ఎస్‌ఎఫ్‌ఐ తరఫున పోటీ చేసి ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించారు. ఎస్‌ఎఫ్‌ఐపై రాజకీయ నేత జోక్యం ఎక్కువైందని, ఫలితంగా రోహిత్‌ వేము ఘటన జరిగిందని హైదరాబాద్‌లో కొద్దిరోజు క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాహు తెలిపారు. రోహిత్‌ ఆత్మహత్య ఘటనను కొంత మంది కావాని రాద్దాంతం చేశారని, ఆయన ఆత్మహత్య వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయన్నారు. రాజకీయ నేతలు ఎస్‌ఎఫ్‌ఐ వ్యవహారాల్లో త దూర్చడంతో వత్తిళ్ళకు లోనై రోహిత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఆత్మహత్యపై విచారణ జరిపిస్తే వాస్తవాన్నీ వెలుగులోకి వస్తాయని, అసలు దోషులెవరనేది తేలుతుందని ఆయన స్పష్టం చేశారు. కాగా రోహిత్‌ ఆత్మహత్య ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆత్మహత్యకు కారణాలు కేంద్ర మంత్రుని, బీజేపీ నేతని, హెచ్‌సీయూ వీసీ అప్పారావు అని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై దేశంలోని అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేయడంతో ఒక్క సారిగా వాతావరణం వేడెక్కింది. హెచ్‌ సీయూ ఘటనను నిరసిస్తూ దేశంలోని సెంట్రల్‌ యూనివర్సి టీకు చెందిన విద్యార్థులు ఢల్లీలో భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. విద్యార్థు ఆందోళనకు కాంగ్రెస్‌, వామపక్షాలు సహా పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతిచ్చాయి. రోహిత్‌ ఆత్మహత్యపై పార్లమెంట్‌ లోనూ చర్చ జరిగింది. విద్యార్థి ఆత్మహత్యకు కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయతో పాటు వీసీ అప్పారావు, ఏబీవీపీ విద్యార్థు తీరే ప్రధాన కారణమని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. రోహిత్‌ ఆత్మహత్య ఘటన నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న హెచ్‌ సీయూ తాజాగా సాహు చేసిన ఆరోపణతో మరోసారి వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.