రెండేళ్ళ మోడి పాలన - సామాన్యుడికి స్వాంతన రెండేళ్ళ క్రితం బిజెపి నాయకత్వంలో ఎన్‌డి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది. సామాన్యుడి జీవితంలో మార్పు తెచ్చేందుకు మోడీ ప్రభుత్వం అన్ని విధా ప్రయత్నించింది. అవినీతి రహిత పానను అందించింది. వంటగ్యాసు సబ్సిడీ ని కోటిమంది వదులుకున్నారు. ఇది మోడీ ఇచ్చిన పిలుపుకు గొప్ప స్పందన. ఆ విధంగా మిగిలిన ధనాన్ని గత ఏడాదిలో రెండు కోట్ల మంది పేద మహిళకు గ్యాసు కనెక్షన్లనిచ్చేందుకు, రాబోయే మూడేళ్ళలో మరో 5కోట్ల మందికి గ్యాసునందించేందుకు మోడీ ప్రభుత్వం వెచ్చిస్తున్నది. సుమారు 20 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు తెరిచారు. వీరికి సబ్సిడీ మొత్తం ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా జమ అవుతోంది. ఇందులో ఉపాధిహామీ భత్యం, సామాజిక భద్రత రుసుము వంటివి కలిపి సుమారు 61 వే కోట్ల మొత్తం వుంది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 2.07 కోట్ల మరుగుదొడ్లు నిర్మించారు. స్వాతంత్య్రం వచ్చి 69 సంవత్సరాలైన ఇంకా విద్యుత్‌కు నోచుకోని 18000 గ్రామాకు విద్యుత్‌నివ్వడం మొదలై గత రెండేళ్ళలో 7వేగ్రామాకు విద్యుత్‌నిచ్చారు. చిన్నతరహా, గృహపరిశ్రమకు చెందిన 3.26 కోట్లమందికి, 1.33 క్ష కోట్ల రుణానందించారు. నామమాత్రపు సాలీనా రూ.12/- ప్రీమియంతో సామాన్యుకు రూ.2క్ష భీమా సౌకర్యం కల్పించారు. ఇది కాక పిఎమ్‌ జీవనజ్యోతి భీమా యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన పథకాలో 12 కోట్ల మంది భాగస్వాముయ్యారు. తయారీరంగాన్ని ప్రోత్సహించేందుకు మేకిన్‌ ఇండియాపథకం ప్రారంభించారు. ఇందుకై గత 15 నెల వ్యవధిలో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రూ. 2,91,490 కోట్లు. వ్యవసాయదారుకు వేపపూతతో కూడిన యూరియా నందించడం, పంటభూము పరిరక్షణకు చర్య  నమోదుకు ప్రత్యేక కార్డు జారీ, జాతీయ వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంది. 2019 లోగా దేశవ్యాప్తంగా నిరంతర విద్యుత్‌ సరఫరాను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర పనిచేస్తోంది. ప్రధానమంత్రి ముద్రయోజన క్రింద ఓ బ్యాంకును ఏర్పాటు చేశారు. మహిళలు, ఎస్సి,ఎస్టీల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు ఆర్థిక సహకారం అందించేందుకు స్టార్టప్‌ ఇండియా పేరుతో మరో పథకాన్ని మోడీ ప్రభుత్వం ప్రారంభించిది. దీనికింద 10క్ష నుంచి కోటి రూపాయ వరకు రుణాను మంజూరు చేస్తారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకతను పెంపొందించే డిజిటల్‌ ఇండియాపథకం ప్రారంభమైంది. గంగానది ప్రక్షాళన, నదు అనుసంధానం అమలులో వున్నాయి. 3వ తరగతి, 4వతరగతి ఉద్యోగా నియామకాల్లో ఇంటర్వ్యూలు ఎత్తేశారు. కేవలం రాతపరీక్ష ద్వారా ఉద్యోగ నియామక పత్రానందిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో రెండు క్ష మంది ఉద్యోగానిచ్చారు. అయితే స్టార్టప్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, మౌలిక సౌకర్యా అభివృద్ధి వంటి వాటిద్వారా మరెందరికో ఉద్యోగవకాశాలు భించాయి. ఇంకా భించనున్నాయి. జపాన్‌, బంగ్లాదేశ్‌, ఆప్ఘనిస్తాన్‌, అమెరికా, ఇరాన్‌, ఆస్ట్రేలియా, కెనడా, రష్యా, నేపాల్‌, శ్రీలం, చైనాతో సంబంధాలుపడ్డాయి. గత రెండేళ్ళుగా రాజకీయంగా కాంగ్రెస్‌ ఎంతో నష్టపోయింది. కేవలం 7% జనాభాకు, పాక పార్టీగా మిగిలిపో యింది. బిజెపి, ఎన్‌డిఎ రాష్ట్రాకు విస్తరించాయి. రైల్వే ఆధునీకరణ, రహదారు విస్తరణ వంటివి పెద్దఎత్తున మోడీ ప్రభుత్వం చేపట్టింది. సంపదను సృష్టించడం, దాన్ని ప్రజోపకరమైన పథకాకు వెచ్చించడం మోడీ ప్రభుత్వం విశేషత.