హైందవి స్వరాజ్‌ నిర్మాత ఛత్రపతి శివాజీ
గడిచిన వెయ్యి సంవత్సరా కాఖండంలో ఇస్లాం భారత దేశాన్ని చిన్నాభిన్నం చేసేందుకు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాను తిప్పికొట్టేందుకు అనేక మంది అనేక రకాలుగా పోరాటాలు చేశారు. ఇస్లాం ఆక్రమణ పరాకాష్టకు చేరుకున్న సమయంలో హిందూ సమాజం నుంచి చాలా తీవ్రమైన ప్రతిఘటన జరిగింది. ఒకప్రక్క పంజాబ్‌లో గురుగోవింద్‌ సింగ్‌ ఇంకోప్రక్క ఛత్రసాలు మరోప్రక్క ఛత్రపతి శివాజీ ఈ పోరాటా న్ని ముమ్మరం చేశారు. అందులో ఛత్రపతి శివాజీ పేర్కొనదగినటువంటి వారు. ఎటువంటి శత్రువుతో ఏ విధంగా వ్యవహరించాలో శివాజీ నేర్చుకున్నారు. హైందవీ స్వరాజ్యం స్థాపించానే క్ష్యంగా పెట్టుకుని పనిచేసిన ఛత్రపతి శివాజీ 1674వ సంవత్సరం జూన్‌ 6వ తేదిన ఆనందనామ సంవత్సరం జేష్ట శుద్ధత్రయోదశి గురువారం నాడు క్షత్రియ కువతంస సింహాసనాదీశ్వర మహారాజ ఛత్రపతిగా శివాజీ మహరాజ్‌గా పట్టాభిషేకం చేసుకొని అష్టప్రధాను తో ధర్మపాన చేశాడు. భారతీయ సంస్కృతి చరిత్రపై సమగ్రమైన అవగాహన ఉన్న కంచి పరమాచార్య ఒక సందర్భంలో శివాజీ మహారాజ్‌ చిత్రపటాన్ని పట్టుశాలువాతో ఆలంకరించి వారు పలికిన మాటలు ఈ రోజున మా వంటి హిందూ సన్యాసులు నిర్భయంగా రాజవీధుల్లో తిరుగగులుగుతున్నామంటే అది శివాజీ మహారాజ్‌ పెట్టిన భిక్ష’. మొగలాయి చక్రవర్తులో అసహనానికి, మతదురంహకారానికి ప్రతి రూపం ఔరంగజేబు. అతడు యావత్‌ భారత్‌ను ఏకఛత్రంగా పాలించాని కలుగన్నవాడు. ఆ సమయంలో శివాజీ 36 గ్రామాకు అధిపతి. అతి చిన్న జమీందారు. అటువంటి శివాజీ మహారాజ్‌ గురించి ఔరంగాజేబు మాట్లాడుతూ నేను ప్రాచీన సార్వభౌములందరినీ నాశనం చేసే సందర్భంలో శివాజీ స్వయంగా సార్వభౌమత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రతిభాశాలి. నా సైన్యాలు 19 సంవత్సరా నుండి అతనిని వెంటాడుతూనే ఉన్నా అతని రాజ్యం పెరిగిపోతూనే ఉంది అనిచెప్పాడు. హైందవ ధర్మాన్ని కారాయాని బద్ధకం కణుడైన ఔరంగజేబుకు చివరకు మిగిలింది ఏమిటి? తన సైన్యం పీనుగు పెంటగా తన రాజ్యం బంజరులుగా, బీడుగా నాలుగు సంవత్సరా ప్లేగు వ్యాధితో క్ష మంది చనిపోగా వెన్ను చూపి పారిపోతూ ఆగ్రా చేరుకుందామని కలుగన్న ఔరంగజేబును మరఠా సైనికులు వెంటబడి కుల్లబొడుస్తుంటే మనోవ్యధతో ఔరంగజేబు దారిలోనే మరణించాడు. అతడి శవం కూడా ఆగ్రా చేరుకోలేదు. 25 సంవత్సరా పాటు రాజధాని ముఖమే చూడలేని ఒక చక్రవర్తి రాజ్యం ఎట్లా ఉంటుంది? చిన్నాభిన్నమైపోయింది. రాజపుత్రులు తిరిగి స్వతంత్రుయ్యారు. ఔరంగజేబుకు 25 సంవత్సరా మరాఠాతో సంఘర్షణే లేకపోతే యావత్‌ భారతంలో హిందూ ధర్మం వలేశమైన లేకుండా తుడిచిపెట్టుకుని పోయి ఉండేదంటే అతిశయోక్తి కాదు. కంచి పరమాచార్యు వారు పలికిన వ్యాఖ్యాకు ఇంత అర్థం ఉంది. అందుకే హిందూజాతికి శివాజీ ఒక ఆదర్శ వీరుడు. శివాజీ ఎంతో దూరదృష్టితో సువర్ణదుర్గం, సింధూదుర్గం, కొబాలో పటిష్టమైన నౌకస్థావరాను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. పోర్చుగీసువారిపై దండెత్తి పాండాను స్వాధీనం చేసుకున్నారు. ఈ రకంగా ఆరోజుల్లోనే నౌకస్థావరాను పటిష్టం చేసినవాడు ఛత్రపతి శివాజీ. భారతదేశంలోకి అప్పుడప్పుడే ప్రవేశిస్తున్న ఐరోపా దేశా వారీ ఆగడాను అరికట్టడంలో కూడా శివాజీ విజయం సాధించాడు. శివాజీ జీవితాన్ని మలుపు తిప్పిన ఘట్టాను ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందులో మొదటిది శివాజీ బాల్యంలో తండ్రితోపాటు బీజపూర్‌ సుల్తాన్‌ కొలువులోకి ఒకసారి వెళ్లాడు. ఆ సమయంలో శివాజీ తండ్రి షహజీ శివాజీని సుల్తాన్‌కు నమస్కరించమన్నాడు. శివాజీ దానికి స్పందిస్తూ ఈ పరాయి ప్రభువుకు నేను నమస్కరించను అని స్పష్టంగా తెలియజేశాడు. అంటే శివాజీ మనసులో ఉన్న స్వాతంత్రేచ్చ, దేశాన్ని కాపాడానే సంకల్పం చిన్న వయసులోనే ఎంత గాఢంగా ఉందో మనకు అర్థం చేయించిన సందర్భం అది. 2) అఫ్జల్‌ఖాన్‌ శివాజీని మట్టుబెట్టానే క్ష్యంతో క్ష మంది సైన్యాన్ని తీసుకొని అట్టహాసంగా శివాజీ రాజ్యంపై దాడులు చేసాడు. శివాజీ భక్తిశ్రద్ధతో పూజించే తుల్జా భవానీ మందిరాన్ని కూడా ధ్వంసం చేశాడు. ప్రజలంతా శివాజీ ఎక్కడికి పారిపోయాడు, ఏం చేస్తున్నాడు అని చర్చించుకోవటం ప్రారంభం చేశారు. అటువంటి పరిస్థితులో అఫ్జల్‌ఖాన్‌ను మట్టుబెట్టేందుకు శివాజీ వేసిన ఎత్తుగడ ఎంతో సఫమయ్యింది. శివాజీ అఫ్జల్‌ఖాన్‌ను తనకు అనుకూమైన స్థలానికి అనుకూమైన సమయానికి రప్పించి మరీ మట్టుబెట్టాడు. ఈ సందర్భంగా శివాజీ సైనికులు అఫ్జల్‌ఖాన్‌ సైన్యం మీద దాడిచేసి నాశనం చేశారు. క్షలో కొద్ది మంది సైనికులు మాత్రమే తిరిగి బీజపూర్‌ చేరుకోగలిగారు అది శివాజీ సాధించినటువంటి అద్భుతమైన విజయం. 3) ఢల్లీని పాలిస్తున్న ఔరంగజేబు శివాజీని ఎట్లాగైనా సరే మట్టుబెట్టాని చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న సమయంలో శివాజీ కూడా చాలా తెలివిగా ఔరంగజేబుతో పోరాటం చేస్తుండేవాడు. ఆ సమయంలో ఔరంగజేబు శివాజీని బంధించిగాని, శవాన్నిగాన్ని తీసుకొని రమ్మని తన సర్వసైన్యాధ్యక్షుడైన జయ సింగ్‌ను పంపించాడు. ఈ సమయంలో శివాజీ అనుసరించిన వ్యూవం ఎంతో వ్యూహాత్మకమైన ది. శివాజీ జయసింగ్‌కు ఒక ఉత్తరం రాసాడు. ఆ ఉత్తరంలో మీరు ఒకవేళ హైందవ ధర్మాన్ని సంరక్షించేందుకు కంకణం కట్టుకొని పోరాటం చేసేందుకు సిద్ధమైతే మీ పల్లకి మోసే బోయగా నేను మారతాను. హిందూ ధర్మ రక్షణకోసం మీరు పనిచేయాలిఅని రాశారు. జయసింగ్‌తో పోరాటం హిందూ సమాజానికి నష్టదాయకమైనదని గుర్తించిన శివాజీ లొంగిపో యేందుకు సిద్ధపడ్డాడు. ఈ లొంగి పోవటం ద్వారా ఔరంగజేబు యొక్క కుయుక్తును అర్థం చేసుకునేందుకు ఢల్లీకి వెళ్ళవచ్చు అని భావించాడు శివాజీ.  అక్కడ అవమానాలు జరుగుతాయని తెలిసి కూడా శివాజీ ఔరంగజేబు సంస్థానంలోకి వెళ్లాడు. అక్కడి నుంచి తప్పించుకొని శివాజీ బయటపడిన వ్యూహం కూడా చాలా విశిష్టమైనది.  శివాజీ తప్పించుకున్నాడని తెలిసి ఔరంగజేబు చిందులుతొక్కాడు. శివాజీ అక్కడి నుంచి నేరుగా తన రాజ్యానికి వెళ్లిపోయాడు. ఆ తదుపరి కొంతకాలానికి శివాజీ పట్టాభిషేకం చేసుకున్నాడు. శివాజీ జీవితంలో సంఘటనను పరిశీలించి నట్తైతే మనం సంఘప్రార్థనలో చెప్పుకున్నట్టుగా విజయశీలి అయిన సంఘటన శక్తి నిర్మాణం చేసి చూపించినవాడు శివాజీ. అందుకే శివాజీ మహరాజ్‌ పరమపదించిన తరువాత కూడా హైందవీ స్వరాజ్‌ సంరక్షణకు జరిగిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. శివాజీ జీవితంలో విజయాను సాధించటమే ప్రధాన క్ష్యంగా తన పోరాటాన్ని జరిపినవారు. ఎటువంటి శత్రువుతో ఏ విధంగా వ్యవహరించాలో స్వయంగా ఆచరించి చూపించినవాడు ఛత్రపతి శివాజీ. శివాజీ ఒక గొప్ప వీరుడిగా, ఒక గొప్ప నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభించిన పరమపూజనీయ డాక్టర్‌జీ సంఘానికి ఆదర్శం సిద్ధాంతమే, కాని ఎవరైనా ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి అని అనుకున్నట్లైతే మనం ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పారు. అట్లాగే వియత్నాం అమెరికాతో జరిపిన పోరాటంలో విజయం సాధించింది. ఆ తదుపరి 1977వ సంవత్సరంలో అక్కడి రక్షణ శాఖమంత్రి మేడంబిన్‌ భారతదేశానికి వచ్చారు. ఢల్లీలో ఆమె అక్కడ మనవాళ్లతో నేను శివాజీ మహరాజ్‌ విగ్రహానికి పూమావేసి గౌరవించాని తన కోరిక తెలియజేశారు. ఢల్లీలో మన నాయకులు, ప్రభుత్వాధికారులు హాడావుడిగా ఎక్కడో మారుమూలో ఉన్న శివాజీ విగ్రహాన్ని గుర్తించి దానిని శుభ్రం చేసి ఆమెను అక్కడికి తీసుకెళ్లారు. ఆమె స్వయంగా శివాజీ మహారాజ్‌ విగ్రహానికి పూమా సమర్పించి ఆమె మాట్లాడుతూ మా పోరాటానికి స్ఫూర్తి ప్రధాత ఛత్రపతి శివాజీ మహారాజ్‌. శివాజీ మహారాజ్‌ ఒకప్రక్క పటిష్టమైన యుద్ధవ్యూహాను తయారు చేసుకుంటూనే రెండోప్రక్క తన సైన్యంలో జాతీయ భావాన్ని నిర్మాణం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ వ్యూహాన్నే మేము కూడా అనుసరించాం. దాంతో అమెరికా లాంటి శక్తివంతమైన దేశాన్ని ఓడించి మా స్వాతాంత్య్రాన్ని మేము కాపాడుకోగలిగాం. అందుకే శివాజీ మహారాజ్‌ మా విజయానికి ప్రేరణ అనిచెప్పారు. ఈ విధంగా ఛత్రపతి శివాజీ జీవితం అనేకమందికి ప్రేరణ ఇచ్చింది. ఈరోజున హిందూ సమాజానికి ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించుకొని విజయం సాధించటానికి శివాజీ జీవితం ఎంతో ప్రేరణదాయకంగా కనిపిస్తుంది. ఎటువంటి శత్రువుతో ఏ విధంగా వ్యవహరిం చాలో నేర్చుకోవాల్సిన అవసరం ఇప్పటి పరిస్థితుల్లో మనకు ఎంతో ఉంది. మనల్ని మనం సంబాళించుకుంటునే శత్రువుతో పోరాటం ఏట్లా చేయాలో కూడా శివాజీ నుండి మనం నేర్చుకోవాలి. అందుకే ఛత్రపతి శివాజీ మహారాజ్‌ పట్టాభిషేకాన్ని హిందూసామ్రాజ్య దినోత్సవంగా నిర్వహించుకుంటూ మనం హిందూ సమాజానికి ప్రేరణ కలిగించే ప్రయత్నం చేస్తున్నాము.