గురువు


తల్లిదండ్రు తరువాత గురువు దేవుడితో సమానం. గురువు అనే పదం ఎంతో విలువైనది. క్రమశిక్షణను సక్రమంగా నేర్పించేది గురువే. పిల్లల భవిష్యత్తును కనీవినీ ఎరుగని స్థాయికి చేర్చే అద్భుతమైన ఆయుధం గురువు. పిల్లలు భగవంతుడి దగ్గర భక్తి తెలుసుకుంటే, కన్న తల్లిదండ్రు దగ్గర ప్రేమానురాగాను తెలుసుకుంటారు. అదే గురువు దగ్గర భయము, భక్తి, క్రమశిక్షణ నేర్చుకుంటారు. అదే భవిష్యత్తుకు ఉపయోగపడేది.
జన్మనిచ్చిన తల్లిదండ్రును మరిచిపోతే విద్య బోధించిన గురువును మరిచినట్లే. పై లోకంలో బోధించేది భగవంతుడైతే ఈ లోకములో బోధించేది గురువు. అందుకే గురువుకు పిల్లలకు మధ్య బంధం ఏ విధంగా ఉండాలంటే ఆ భగవంతుడికి భక్తునికి ఎలాంటి బంధం ఉంటుందో అలాంటి బంధం గురువు పిల్లలకు మధ్యన ఉండాలి.
నాతి సరిత