చిన్ని ఆశయమే ‘‘స్త్రీ శక్తి’’ఒక మహిళ తచుకోవాలే కానీ ఏమైనా చేయగదు. తన కుటుంబాన్ని, సమాజాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకె ళ్లగదు. అదేవిధంగా పాతాళానికీ పంపగదు. ప్రతీవారూ ఈ వ్యవస్థ మారాని, సమాజంలో మార్పు రావాని కోరుకునేవారే. దేశం మారాలంటే స్త్రీలో, కుటుంబంలో మార్పు వస్తేనే అది సాధ్యమవుతుంది. కుటుం బాన్నయినా, వ్యక్తినైనా, సమాజాన్నయినా మార్చే శక్తి స్త్రీకి ఉంది. అలాంటి ఓమహిళ ఓమారుమూ పల్లెటూర్ల లో ఉన్న ఎన్నో కుటుంబాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దింది. మరి ఆ మహిళ గురించి తెలుసుకుందామా! ఉత్తరాంచల్‌ రాష్ట్రంలో పుర్కల్‌ అనే ఓ చిన్న గ్రామం. అక్కడ ఎక్కడ చూసినా సరే ఆనందం వెల్లివిరుస్తుంది. ఇదంతా జరగడానికి కారణం చిన్నిస్వామి అనే మహిళ. 2001 లో చిన్ని, ఆమె భర్త స్వామి ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వస వెళ్లి ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించాని అనుకున్నారు. అలా అందమైన ప్రాంతమైన డెహ్రాడూన్‌, ముస్సోరి మధ్యలో ఉన్న పుర్కల్‌ అనే అందమైన గ్రామాన్ని ఇద్దరూ ఎంచుకున్నారు. అలా ఆగ్రామంలోకి వెళ్లగానే వెనకబడ్డ ఆ గ్రామాన్ని చూసి దాన్నెలాగైనా అభివృద్ది పరచానుకున్నారు. చుట్టుపక్క పిల్లల కోసం స్వామి ఒక పాఠశాను ప్రారంభిస్తే చిన్ని స్థానిక మహిళ కోసం ఎంబ్రాయిడరీ దుప్పట్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. నెమ్మదిగా దాన్ని ఓ వ్యాపార సంస్థగా మలిచి వారు తయారు చేసిన రంగు రంగు ఎంబ్రాయిడరీ దుప్పట్లను ప్రపంచానికి పరిచయం చేసింది చిన్ని.
ఒక్క మహిళతో ప్రారంభమై...
వెనుకబడిన పుర్కల్‌ గ్రామాన్ని అక్కడి ప్రజను చూడగానే కనీసం ఒక్క పేద మహిళకు తాను సహా యపడితే చాలు అనుకుంది చిన్ని. అందుకే తనకిష్టమైన అల్లికనే ఆధారంగా చేసుకుని అక్కడి ప్రజ జీవనాన్ని కొత్తగా అల్లేశారు చిన్ని. ముందుగా ఒక మహిళతో కలిసి దుప్పట్లను తయారు చేసిన ఈమె గ్రామంలోని మహిళందరికీ దీన్ని ఉపాధిలాగా మచాని భావించింది. అలా ఒక్కరితో మొదలైన ఈసంస్థలో ఇప్పడు 15 గ్రామా నుంచి దాదాపు 130 మంది దాకా సభ్యులున్నారు.మహిళా సాధికారతే క్ష్యంగా లాభాపేక్షరహితంగా గుర్తింపు పొందింది ఆమె స్థాపించిన స్త్రీ శక్తి అనే సంస్థ.
దేశవిదేశాలో
కేవలం దుప్పట్లను మాత్రమే కాదు కుషన్‌ కవర్స్‌, బ్యాగు, స్కార్‌ఫ్‌ ఇలా ఒక్కటి కాదు అన్నింటినీ వీళ్లు తయారు చేస్తారు. పుర్కల్లో ఉన్న విమెన్‌ సెంటర్‌లోని రిటైల్‌ దుకాణంలో స్త్రీ శక్తి ఉత్పత్తున్నీ భిస్తాయి. ఆన్‌లైన్‌ స్టోర్స్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు జరిగే ఎగ్జిబిషన్లలో కూడా స్త్రీ శక్తి ఉత్పత్తును ప్రదర్శిస్తున్నారు.. అమెరికా, ఇంగ్లండ్‌ దేశాల్లో కూడా రిటైల్‌ పార్టనర్లు  ఉండడం విశేషం.
ఒడిదొడుకులు వచ్చినా సరే
వ్యాపారం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సమస్యలు కూడా అంతే ఎక్కువయ్యాయి. అమ్మకాలు పెరుగుతున్నప్పుడు సీజనల్‌ మార్కెట్‌ డిమాండ్‌కి తగినట్లు ఉత్పత్తి పెంచడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇందుకోసం నాలుగైదు నెల స్టాకును ముందే తయారు చేసుకోవాల్సి వచ్చేది. పెట్టుబడి అంతా ఖర్చయ్యేసరికి ఇతర ఖర్చుకు సరిపడా ఉండేవి కాదు.  దాంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. కేవలం వ్యాపారం మాత్రమే కాదు ఆ సంస్థ లాభాకన్నా మహిళా సంక్షేమమే చాలా ముఖ్యమైనందంటారు చిన్ని. మహిళలు తమ పనును తాము ప్రశాంతంగా చేసుకోవడమే తన క్ష్యం అంటారు ఆమె. అందుకే పనిచేసే సెంటర్‌కు రవాణా సౌకర్యాను కలిగించడం, ఆరోగ్య పరీక్షలు చేయించడం వంటి సేవను ఉచితంగానే అందచేస్తోంది స్త్రీ శక్తి సంస్థ. మహిళ తన కాళ్లపై తాను నిబడి కుటుంబంలోనూ, సమాజంలోనూ గౌరవం తెచ్చుకున్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని చెబుతున్నారు చిన్ని.
పితాపుత్ర భ్రాతృంశ్చ భర్తా రమేవసుమార్గం ప్రతిప్రేరయంతీ మివ!
ఇది మనం నిత్యం సమితి ప్రార్థనలో చదువుతూనే ఉంటాం. ఒక మహిళ కనుక ఉత్తమమైనదీ, చదువుకున్నది అయితే తనతో పాటు తన తండ్రినీ, అన్నదమ్మునీ, భర్తను ఇంటిల్లిపాదినీ కూడా మంచి మార్గంలో ప్రయాణించడానికి, వారిలో మార్పు తీసుకురావడానికి కారణం అవుతుంది అని దానర్థం. తనకు వచ్చిన పనిద్వారా నలుగురిలో మార్పుతెచ్చి వారికి చేయూతనిచ్చి, ఈ అర్థాన్ని నిజం అని నిరూపించింది చిన్ని స్వామి.