సమర్పణా భావానికి ప్రతీక భగవాధ్వజం
దేనికోసం జీవించాలి ?
ఒక వ్యక్తి ఎలా జీవించాలి..? దేనికోసం జీవించాలి..? ఈ జీవించటంలో ఆదర్శం ఏమిటి..? అనే విషయంలో ‘‘చతుర్విధ  పురుషార్ధ  సాధన’’  అనే  ఒక  ఆదర్శాన్ని భారతదేశం ఋషులు ప్రపంచం ముందు ఉంచారు అదే చతుర్విధ పురుషార్ధాలు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఇందులో ధర్మం అనేది జీవితానికి ఆధారం. ఈ సృష్టిలో ఏకాత్మతను దర్శింపచేసి మనవిధులు, నిషేధాను నిర్ధారించేది ధర్మం. ఈ సృష్టిలోని ఏకాత్మతానుభూతిని పొంది ధర్మ బద్ధంగా జీవించాని సూచించేది ధర్మం. అట్లా జీవితానికి అంతిమక్ష్యం మోక్షం. మోక్షాసాధన కోసం సాధన చేయాలి. అలాగని అర్థ, కామము గురించి విస్మరించలేదు. డబ్బు సంపాదించవద్దని, సుఖాలు అనుభవించవద్దని మన శాస్త్రాలుచెప్పలేదు. కాని అందులో మునిగి తేవద్దని చెప్పాయి. వే సంవత్సరాలుగా ఈ తత్వం ఆధారంగా మనదేశం, మన సంస్కృతి వికసిస్తూ వస్తున్నది. ఈ దేశంలో ఒక నిర్దిష్ట జీవన విధానం దాని కారణంగా వికసించింది. ఈ దేశంలో జన్మించిన అనేకమంది మహాపురుషు జీవితాలు చూస్తే ఈ దేశతత్వం మనకు అర్థమ వుతుంది. ఆధునిక కాలంలో కూడా అరవింద, రమణ మహర్షి, నేతాజీ, వివేకానంద ఇట్లా చెప్పుకొంటూపోతే చాలా పెద్ద జాబితానే తయారవుతుంది. వీరందరు దేనికోసం జీవించారు? ఈ దేశం, ఈ సంస్కృతి, ఇక్కడి ధర్మాన్ని కాపాడటం కోసం జీవించారు. మోక్షం సాధించటమంటే ఏమి సాధన చేయాలి? ఈ దేశ, ధర్మ, సంస్కృతును ఆచరించటం, కాపాడటం చేయాలి. వే సంవత్సరాలుగా ఈ దేశంలో జన్మించిన మహాపురుషులు అదే చేసారు. ఆ పరంపరను జ్ఞాపకం చేయటం కోసం ఒక గురు పరంపర ఈ దేశంలో వికసించింది. అనేక ప్రక్రియలు వికసించాయి. ఈ గురు పరంపరలో మనం జ్ఞాపకం చేసుకోవసిన వారు ఇద్దరు. ఒకరు వేదవ్యాసుడు, ఇంకొకరు భగవాన్‌ శ్రీకృష్ణుడు. అందులో ఒకరు జ్ఞాన, విజ్ఞానాను అందిస్తే మరొకరు సామాజిక, రాజనైతిక క్షేత్రంలో ఆదర్శ పథాన్ని చూపించారు. భగవాన్‌ శ్రీకృష్ణుని మన సమాజం జగద్గురువుగా పూజిస్తుంది. అందుకే ‘‘కృష్ణం వందే జగద్గురుమ్‌’’ అంటాము.
గురుపూజ ఎప్పుడు చేయాలి ?
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హిందూ సమాజంలో గురు పూజ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆషాఢ పౌర్ణమి వ్యాసపూర్ణమగా పిలుస్తారు. వ్యాసభగవానుడిని మన సమాజం గురువుగా భావిస్తుంది. ఎవరీ వ్యాసుడు ? ద్వాపర యుగ అంతంలో, కలియుగ ప్రారంభంలో జీవించిన వాడు వ్యాసుడు. వ్యాసుడు ఏమి చేసాడు? ఆ కాలంలో అందుబాటులో ఉన్న వేదవిజ్ఞానాన్ని వ్యవస్థీకరించి సామాన్య ప్రజకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. వేదశాఖలు ఏర్పాటు చేసారు. వేదాకు అనుబంధంగా ఉపనిషత్తు, వీటికి జోడింపుగా పదునెనిమిది (18) పురాణాను మనకు అందించారు. వాటన్నింటి ఇతివృత్తం ధర్మబద్ధంగా జీవించే వారు సుఖంగా  సంతోషంగా  ఉంటారు. అధర్మ మార్గంలో పయనించేవారు దుఃఖాలో ఉంటారు. నాశనమవుతారు. అందుకే మన జీవితాకు ఆదర్శం ధర్మాచరణే అని గుర్తు చేసారు.
ఈషణ త్రయం
మనదేశంలోని జన్మించిన ఋషులు మునులు మానవ నైజాన్ని చాలా లోతుగా  అధ్యయనం  చేసారు.  మనుష్యులో  ఉండే ఈషణత్రయాను గుర్తించి హెచ్చరించారు. ఏమిటీ ఈషణ త్రయాలు? 1) పుత్రేషణ, 2) విత్తేషణ, 3) లోకేషణ. పుత్రేషణ అంటే తను, తన కుటుంబమే సర్వస్వం అనుకోవటం. విత్తేషణ అంటే డబ్బు సంపాదించటమే జీవిత పరమావధి అనుకోటం. లోకేషణ అంటే ఈ లోకంలో కీర్తిప్రతిష్ట కోసం ప్రాకులాడటం.
అటువంటి వాటిలో చిక్కుకోకూడదని మన పెద్దలు చెప్పారు. అవి శృతిమించితే వచ్చే నష్టాలు, వాటి అనుభవాలు చరిత్రలోను, సమకాలీన చరిత్రలోను మన కళ్ళ ముందు అనేక ఉదాహరణలు కనబడతాయి. అట్లాగే వాటినుండి బయటపడి తమ జీవితాను సార్ధకం చేసుకొన్నవారు అనేక ఉదాహరణలుగా మనకు కనబడతారు. వాళ్ళ జీవితాలు మనకు ఏమి నేర్పిస్తున్నాయి? దేశం కోసం జీవించాని మనకు నేర్పిస్తున్నాయి. ఈ దేశంలో కొందరు ఈ దేశాన్ని రక్షించేందుకు తమ క్షాత్రశక్తిని చూపించారు, మరికొందరు ఈ సమాజంలోని దీనదుఃఖిత ప్రజ జీవితాలో వెలుగులు నింపేందుకు పనిచేసారు. ఇంకా కొందరు ఈ దేశ సంస్కృతి, చరిత్ర అన్ని విషయాను రాబోవు తరాకు అందించటం కోసం పరివ్రాజక జీవితాను గడిపినవారు కనబడతారు. ఈ మూడు రకా వ్యక్తు జీవితాలో మనకు కనబడే స్వభావాలు రెండు. 1) త్యాగము, 2) సేవాభావం. ఈ రెండు స్వభావాలు మన ఆచార-వ్యవహారా చుట్టూ తిరుగుతుంటాయి. వాటిని గుర్తించినప్పుడు కుటుంబము, సమాజ పరంగా మనకు ఉన్న బాధ్యతలు గుర్తుకు వస్తాయి. ఈ ఆలోచనను సమకాలీన సామాజిక పరిస్థితుకు అన్వయం చేసి ఈ దేశానికి ఒక దిశ దర్శనం చూపించింది రాష్ట్రీయ స్వయంసేవక సంఘము.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘము పరంపరా గతంగా వస్తున్న ఈ దేశ ఆదర్శాలైన త్యాగము, సేవాభావాను తన వ్యవహారంలో చూపిస్తూ పనిచేస్తున్నది. అందుకే సంఘమును జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సంఘం ఎవరికి తిరుగులేని ప్రాధాన్యతనిచ్చిందో మనం జాగ్రత్తగా గమనించాలి. సమైక్యము, క్రమశిక్షణాయుతమైన జాతీయ జీవన నిర్మాణ క్ష్యానికి అనుగుణమైన పద్ధతిని, చిహ్నాన్ని, ప్రతీకనీ, మంత్రాన్ని, అనుశాసన విధానాన్ని రూపొందించు కోవటానికి ప్రాధాన్యతను ఇచ్చింది. ప్రాంతం, పంథా, కులం, భాష, ఆచారాలు అనే బాహ్యమైన అడ్డుగోడను పూర్తిగా అతిక్రమించి ప్రాచీనము, పవిత్రము, సమగ్రమునైన మన జాతీయ పరంపరను సజీవంగా మన కనుకు కట్టినట్లు చూపే అమర భగవధ్వజాన్ని స్ఫూర్తిప్రదమైన ఉత్తమ ప్రతీకగా స్వీకరించాము. మన చరిత్రకు సాక్షీభూతం భగవాధ్వజం. చరిత్రను పునర్‌నిర్మాణం చేయటానికి ప్రేరణ ప్రదాత భగవధ్వజం. ఈ సందర్భంగా మన ప్రార్ధనలోని ‘‘సుశీన్‌ జగత్‌యేన నమ్రం భవేత్‌’’ అనే పంక్తిని జ్ఞాపకం చేసుకోవాలి. దీనిభావం మన ప్రవర్తన, మన శీలం చూసి ప్రపంచం మన ముందు వినమ్రంగా మోకరిల్లాలి, అటువంటి శీ నిర్మాణంలో భగవధ్వజమే మనకు ప్రేరణ. త్యాగము, సేవా భావాకు ప్రతీక భగవధ్వజం. అందుకే సంఘంలో మనం పరమపవిత్ర భగవధ్వజాన్ని గురువుగా స్వీకరించాము. ఈ భగవధ్వజాన్ని గురువుగా, ఆదర్శంగా డాక్టర్‌జీ మన ముందు ఉంచినప్పుడు తోటి కార్యకర్తలు అనేకమంది నివ్వెరపోయారు. సంఘ ఆదర్శాన్ని సజీవంగా డాక్టర్‌జీలో చూసిన వారంతా డాక్టర్‌జీనే ఆదర్శంగా ఎందుకు తీసుకోకూడదు? అని ప్రశ్నించారు. ఒక వ్యక్తి ఎంత ఘనుడైనప్పటికి  జాతికి  ఆదర్శంగా ఉండజాడు. అనంతమైన జాతీయ జీవనంలో వ్యక్తి అస్తిత్వం కేవలం క్షణికమైంది. చరిత్ర లో అనేక మంది ఆదర్శంలో ధృవతారలుగా ఉన్నప్పటికి వారందరిని అందరూ సమానంగా స్వీకరించటం ప్రశ్నగానే ఉంటుంది. అందుకే డాక్టర్‌జీ సంఘంలో ఏ వ్యక్తిని, ఏ గ్రంథాన్ని గురుస్థానంలో ఉంచలేదు. ఒక ప్రతీకను గురుస్థానంలో ఉంచారు. ఎటువంటి వ్యక్తి అయినప్పటికి ఆ పరమ పవిత్రమైన భగవాధ్వజం ముందు నతమస్తకం కావసిందే. భగవాధ్వజం ముందు మన జీవనం సమర్పించ బడాలి. ఆ భావన నిర్మాణం చేసారు. సంఘంలో సమాజం కోసం సమర్పణ కావానే భావాన్ని వికసింపచేసారు. సమర్పణ 1) ను, 2) మన, 3) ధన పూర్వక సమర్పణ. అందుకే ప్రతిరోజు శాఖలో మన శరీరం, మనస్సు సమర్పణ చేసుకొంటాము. సంవత్సరంలో ఒకసారి గురుపూజ, గురుదక్షిణ పేరుతో మన ధనాన్ని వినమ్రంగా భగవాధ్వజం ముందు సమర్పిస్తాము. సమాజం కోసం మనం సమర్పణ భావంతో పనిచేయానే ఆదర్శం సంఘం స్వయంసేవకు ముందు, సమాజం ముందు ఉంచింది. దేశంలో ఆమూలాగ్రమైన పరివర్తన సంఘ క్ష్యం. సంఘము సాధించదచుకున్న క్ష్యానికి ఇదే సహజమైన కార్యపద్ధతి. ఈ భావనతో పనిచేసి నప్పుడే ఈ సమాజం గురించి అందరూ బాధ్యతవహించి ఎటువంటి త్యాగాలు చేయటానికైనా సిద్ధపడతారు. అందుకే సంఘము సామాజిక, సేవాకార్యక్రమా ద్వారా అందరిని చైతన్యపరచగలుగుతున్నది. ఈ జాతిహితమే మన జీవిత క్ష్యం అని సంఘం స్పష్టం గా చెప్పగులుగుతున్నది.