అమరవాణిసర్వం పరవశే దు:ఖం
సర్వమాత్మవశే సుఖమ్‌
ఇతి మత్వాతు రాజేన్ద్ర
స్వయం దాసాత్‌ తపస్విన:
ఇతరు మీద ఆధారపడితే ప్రతీదీ దు:ఖకరమే. తన చేతుల్లో ఉన్న ప్రతీదీ సుఖకరం. ఇది తెలిసిన మునులూ, ఋషులూ స్వయం దాసులుగా ఉంటారు. అనగా! వ్యక్తికి విద్య, నైపుణ్యం, సామర్థ్యం కలిగి ఉండి ఇతరు సహాయానికై అర్థించవసిన అవసరం రాకూడదు. తన పని తాను చేసుకోగలిగి ఉండడము ఉత్తమము.