ఏరువాకను మరచిపోతున్నారా?
ప్రతి సంవత్సరం జేష్టమాసంలో వచ్చే పౌర్ణిమే ఏరువాక పౌర్ణమి. ఈ పండుగ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతా రైతులు ఉత్సాహంగా, ఉల్లాసంగా గ్రామాలో అందరూ సమైక్యంగా కలిసి జరుపుకునే పండుగ. రోహిణీ కార్తిలో రోళ్ళ పగుగొట్టేంత ఎండలు  మృగశిరకార్తీప్రవేశంతో కాస్త అమ్మయ్యా.. అనుకునే విధంగా శాంతించిన భానుడి ప్రతాపం దాంతో బాటే ఋతుపవనా ప్రవేశంతో తొకర్లు’ (తొకరివర్షాలు). అప్పటి దాకా ఎండకాలంలో పనుల్లేక అటకెక్కించిన పనిముట్లను దింపి, దుమ్ముదులిపి బండీని, నాగలిని వ్యవసాయానికి సిద్ధంచేసే పండగే ఏరువాక.
పండుగ రోజు రైతన్నలు ప్రత్యేకించి వారి ఎద్దును వాటి కష్టాన్ని గుర్తిస్తూ కృతజ్ఞతా పూర్వకంగా రంగురంగు మాలు వేసి పసుపు కుంకమతో పూజించి వాటికి బమైన ప్రత్యేక ఆహారాన్ని సమర్పిస్తారు. అలాగే నాగలి, ఎద్దు బండి వంటి వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు. వారు వేసేటటువంటి విత్తనాలు బాగా పండి మంచి ఫసాయాన్ని అందించాని వారు వేసే విత్తనాను (నవధాన్యాలుగా) పూజిస్తారు. సేద్యానికి వర్షాలుకాలంలో  కురవాని వరుణుడిని ప్రార్థిస్తూ శివాయాల్లో పూజలు నిర్వహిస్తారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతిని ఆరాధించే సంస్కృతిలో భాగంగా జరుపుకునే పండుగ. సినిమాల్లో సైతం ఏరువాక సాగారో.. రన్నోచిన్నన్న అనే పాట జగత్ప్రసిద్ధమైంది అంటే గ్రామాల్లో దీని ప్రాముఖ్యత ఎంతో తెలుస్తుంది.
కేవలం ప్రకృతి ఆరాధన, కృతజ్ఞతే కాదు ఈ పండుగ జరుపుకోవడంతో గ్రామాల్లో రైతు మధ్య సహకార` సమైక్యభావన కూడా ఇమిడి ఉంది. ఇటీవ కాలం వరకు గ్రామాల్లో రైతులు పొలం పనుల్లో పరస్పర సహకారంతో కలిసి పనిచేయడం ఉండేది. తమ పొలంలో పనిపూర్తయిన తరువాత పక్కవారి పొలం అందరూ సహకారస్ఫూర్తితో పనిచేసేవారు. ఈ విధంగా ఒకరి తరువాత ఇంకొకరి పొలంలో పనిచేసి సామూహికంగా శ్రమైకజీవన సిద్ధాంతాన్ని పాటించేవారు. ఇప్పటికీ పొలాల్లో నీరు పారించేటప్పుడు, పక్కపొలం వారికి చెప్పి బయటి వూరికి వెళ్ళటం పరిపాటిగా చూస్తూనే వుంటాము. సామూహికంగా మాట్లాడుకొని ఒక గ్రామంలోని రైతులంతా ఒకేరకమైన పంటను వేసుకోవటం ఈ పండుగ రోజునే ప్రారంభమౌతుంది. ఈ పండుగ గ్రామాల్లో కేవలం వ్యక్తిగతంగానే కాకుండా సామూహికంగా శ్రమైక జీవన పరస్పర ` సమైక్య జీవనవిధానానికి ప్రతీక. అందుకే గ్రామాల్లో ఏ కులా వారైనా పెద్ద, చిన్నను గౌరవిస్తూ బాబాయ్‌, మావయ్య, అత్తమ్మ లాంటి వరసతోనే పిలుచుకుంటారు. కానీ గ్లోబలైజేషన్‌, కేబుల్‌టివి పుణ్యమా అని మన సాంప్రదాయ పండుగలు క్రమంగా కనుమరుగవుతున్నాయి.  మనుషు మధ్య సంబంధ బాంధవ్యాలు సన్నగిల్లుతున్నాయి. సాంకేతికతపేరు తో ఎంత అభివృద్ధి చెందినా మానవ సంబంధాను అది నిర్వహించలేదు, నిర్మాణం చేయలేదు అందుకే మనదైన ఆచార వ్యవహారాను  సాంప్రదాయాను జానపద కళను పాటను రక్షించుకోవాలి. అదే ఏరువాక పండుగ మనకు అందిస్తున్న సందేశం.