అంతర్లీనంగా హిందూత్వం
మనదేశంలో ప్రజలు వివిధ వర్గాలుగా విడిపోయి ఉన్నారు. కొందరు రాజకీయ వర్గం కొందరు సెక్యుర్‌ వర్గం ఇంకొందరు మేధావి వర్గం. ఇలా ఎన్నెన్నో భాగాలుగా విడిపోయారు. వీరిలో హిందూ భావం శూన్యం అనే ఒక వాదన ఉన్నది. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు, వివేకానంద శిలాస్మారక నిర్మాత అయిన శ్రీ ఏకనాథ రానడే మాత్రం ఈ వాదనతో విబేధిస్తూ ఉండేవారు. ప్రతి హిందువులో కూడా హిందుత్వ భావం ఉంటుంది. చివరికి కమ్యూనిస్టులో కూడా ఈ భావం ఉంటుంది అని శ్రీఏకనాథ్‌ అంటూ ఉండేవారు. డెన్మార్కు దేశానికి చెందిన 52 సంవత్సరా వయస్సుగ ఒక వనిత భారత పర్యాటనకు వచ్చి దురదృష్టవశాత్తు నలుగురు దుండగు చేతిలో మానభంగానికి గురిఅయినది. ఈ దుండగుకు జీవిత కారాగారవాస శిక్ష విధించబడినది. ఢల్లీ ట్రయల్‌కోర్టు జడ్జి శ్రీ రమేశ్‌కుమార్‌ తన తీర్పులో ఈ విధంగా పేర్కొన్నారు.మనదేశానికి అతిథిగా వచ్చిన ఒక స్త్రీకి ఇలా జరగడం మన సంస్కృతి సాంప్రదాయాకు ఒక మచ్చ. అతిథి దేవోభవ అన్న మన సంస్కారానికి ఒక కళంకం. హిందూ సంస్కృతి ప్రకారం యత్రనార్యంతు పూజ్యంతే తత్రరమంతే దేవతా అన్న మన మహోన్నత సంస్కృతీ సంపదకు ఈ సంఘటన ఒక తీరని విఘాతంఅన్నారు. ఇటువంటి నేరాకు కఠిన శిక్ష వేయడం క్రొత్తకాదు, కానీ! ఒక న్యాయమూర్తి తన తీర్పులో భాగంగా హిందూ సంస్కృతిని ఈ విధంగా ఉంటంకించడం అరుదు.