నింగికెగిసిన భారత కీర్తి
భారతదేశం జ్ఞానభూమి. తిమిరాంధకారంలో మ్రగ్గుతున్న ప్రపంచానికి జ్ఞానరశ్మిని ప్రసాదించినది హిందూదేశం. కా వైపరీత్యం కారణంగా మనం క్రొద్దిగా వెనుకబడిన మాట వాస్తవం, ఆ కారణంగా పాశ్చాత్యులు భారతీయును అనాగరికులుగా ప్రచారం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాలో పురోభివృద్ధి సాధించిన అమెరికా ఒకానొకదశలో మనదేశం మీద ఏకంగా ఆంక్షలువిధించి మనకు ఆధునిక శాస్త్ర విజ్ఞానం అందకుండా అడ్డుపడింది. మన శాస్త్రవేత్తలు  ఆ ఆంక్షను అధిగమించి విజయాలు సాధించారు, సాధిస్తున్నారు.
జూను మాసం 22వ తేదీ బుధవారం నాడు మన దేశం రోదసీ రంగంలో ఒక చరిత్ర సృష్టించబడింది. భారత అంతరిక్షపరి శోధన సంస్థ (ఇస్రో) సతీశ్‌ధావన్‌ రోదసీ కేంద్రం (శ్రీహరికోట) నుండి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్వీ) ద్వారా ఒకేసారిగా ఇరువది (20) ఉపగ్రహాను అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టారు. ఇది మన అంతరిక్ష ప్రయోగరంగంలో ఒక అపూరూప విజయం. భూమినుండి 505 కిలోమీటర్ల ఎత్తుకు పంపిన ఈ 20 ఉపగ్రహాలు భూ కక్ష్యను ఛేదించుకుని అంతరిక్షంలోకి ప్రవేశించాయి. మనం పంపిన 20 ఉపగ్రహాలో భారతదేశానికి చెందినవి మూడు ఉండగా, అమెరికా దేశానికి చెందినవి 13, కెనడా-2, జర్మనీ-1, ఇండోనేషియా-1 ఉన్నాయి. సత్యభామా శాట్‌, స్వయం శాట్‌లు కూడా వీటిలో ఉన్నాయి. ఇటువంటి విజయం సాధించిన దేశాలు ఇప్పటివరకూ ప్రపంచంలో రెండే దేశాలు ఉన్నాయి. అమెరికా 2013లో 29 ఉపగ్రహాలు పంపగా రష్యా 2014 లో 37 ఉపగ్రహాలు పంపింది. 20 ఉప్రగహాలు ఒకేసారి పంపి మనం 2016లో ఉన్నత స్థానాన్ని అంకరించినాము.