వినీలాకాశంలో మహిళా శక్తిముదితల్‌ నేర్వని విద్యగదే` ముద్ధార నేర్పించినన్‌అన్న నానుడి మన మెరిగినదే! ప్రపంచం మొత్తంలో స్త్రీని ఒక మాతగా దేవతగా కొలిచిన జాతి హిందూజాతి మాత్రమే. చాలా కాలం స్త్రీకు సాయుధ దళాలో ప్రవేశం లేదు. ఒక దశాబ్దం క్రిందట వారు సైన్యంలో చేరారు కాని వైమానిక దళంలో మాత్రం స్త్రీకు ప్రవేశం దక్కలేదు. మేము కూడా విమానాలు నడపగలం మాకు వైమానిక దళంలో యుద్ధపైలెట్లుగా అవకాశం కావాలి అని మహిళలు కోరుతున్నారు. ఎట్టకేకు 1991లో హెలికాప్టర్‌ మరియు ట్రాన్స్‌పోర్టు పైలెట్లుగా మహిళకు అవకాశం దక్కింది. అయితే 2016 సంవత్సరంలో ముగ్గురు మహిళను యుద్ధపైలెట్లుగా తీసుకోవడంతో వారి చిరకా కోరిక నెరవేరింది.  భాగ్యనగరంలోని కిరణ్‌శిక్షణా కేంద్రంలో శిక్షణ పొంది కంబైండ్‌ గ్రాడ్యుయేట్‌ పెరేడ్‌`2016’ ద్వారా అవనీ చతర్వేది (మధ్యప్రదేశ్‌), భావనా కాంత్‌ (బీహార్‌), మోహనాసింగ్‌ (రాజస్థాన్‌) అనే ముగ్గురు మహిళలు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని భారత వైమానిక దళంలో మొట్టమొదటి మహిళా ఫైటర్‌ పైలెట్లుగా చేరారు. వీరి రెండవదశ శిక్షణ బీదర్‌ వైమానిక క్షేత్రంలో కొనసాగనుంది. మహిళలు అన్ని రంగాలో విజయం సాధిస్తూ ముందుకు దూసుకొని వెళ్తున్నారు.