పుష్కరం.. అంటే ఏమిటి?ము అనే పదానికి 27 పర్యాయపదాను (అర్దాను) అమరకోశంలో పేర్కొనడం జరిగింది. వాటిల్లో జలానికి పుష్కరం అనే పేరుకూడా ఉంది. పోషయ తీతిపుష్కరం. అనీ వూష్ణాతీతి పుష్కరంఅనే వ్యుత్పత్తి అర్థాన్ని తెలియజేస్తుంది. అంటే జీవును పోషించేది అని అర్థం. జలానికి అధిపతి అయిన తుందిలుడు పుష్కరుడు అయ్యాడు. పుష్కరాలు ఏర్పడడానికి కారకుడైన తుందిలుడు జలానికి ఎలా అధిపతి అయ్యాడు అనే వృత్తాంతం తెలుసుకుందాం. తుందిలుడు గొప్ప ధర్మాత్ముడు. పంచాక్షరీ జపాన్ని జపిస్తూ ఘోరతపస్సుతో పరమశివుని మెప్పించాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అందుకు తుందిలుడు స్వామి! నేను శాశ్వతంగా నీతోవుండేట్లు అనుగ్రహించుఅని వరం కోరుకున్నా డు. అందుకు శివుడు నా అష్ఠమూర్తుల్లో మొదటి రూపమైన భవుడురూపంలో వున్నాడు. ఆ రూపంలో నీకు శాశ్వతస్థానాన్ని అనుగ్రహిస్తున్నాను. అంతేకాదు మూడున్నర కోట్ల తీర్థాకు నిన్ను అధిపతిని చేస్తున్నాను అని వరమిచ్చాడు. ఆ విధంగా తుందిలుడు జ తత్వ రూపాన్ని పొందాడు. సృష్టికార్యాన్ని ప్రారంభించడానికి జలం ఎంతో అవసరమైంది. ఆ విషయయాన్ని గుర్తించిన బ్రహ్మదేవుడు జలం కోసం పరమశివున్ని అర్థించాడు. పరమ శివుడు జతత్వంలో ఉన్న పుష్కరున్ని బ్రహ్మదేవుడి యొక్క అధీనంలో ఉండేట్లుగా అనుగ్రహించాడు. ఇది గమనించిన జీవనదున్నీ బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి తమ బాధను మొరపెట్టుకున్నాయి. అందరూ వచ్చి మాలో స్నానం చేసి వారి పాపాను పోగొట్టుకుని మమ్మును అపవిత్రం చేస్తున్నారు. మమ్మును కాపాడే శక్తి కేవలం పుష్కరుడికి మాత్రమే ఉంది. ఆ పుష్కరున్ని మాకు ప్రసాదించడని జీవనదులు బ్రహ్మదేవుడికి మొరపెట్టుకున్నాయి. అదే సమయంలో దేవగురువు బృహస్పతి బ్రహ్మతో జీవును బ్రతికించే ధర్మం నాది కాబట్టి జీవుకు జీవనాధురడైన పుష్కరున్ని నా ఆధీనంలో వుంచవమని అర్థించాడు. దానికి బ్రహ్మ సమ్మతించాడు. కానీ పుష్కరుడు తనతో పాటు బ్రహ్మను కూడా బృహస్పతి దగ్గర ఉండాని కోరుకున్నాడు. అది సృష్టివిరుద్ధం కనుక లోకకళ్యాణం కొరకు అందరకు ఆమోదయోగ్యంగా వుండే విధంగా దేవగురువైన బృహస్పతి గ్రహస్వరూపుడిగా మేషాది 12 రాసుల్లో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు, ఆ రాశు నుండి నిష్క్రమించేటప్పుడు చివరి 12 రోజులు, ఆ మధ్యలో ఆ ఏడాదిలో మిగిలిన అన్ని రోజు మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తా కాలం పాటు పుష్కరుడు ఆయా నదుల్లో వుండేట్లుగా ఆకాలంలో బ్రహ్మ ముక్కొటి దేవతతో కలిసి పుష్కరుడుతోబాటుగా ఆరాశికి సంబంధించి పుణ్యనదిలో వుండే విధంగా ఏర్పాటు చేశాడు. అప్పటి నుండి తుందిలుడు పుష్కరుడి రూపంలో బృహస్పతి ఒకొక్క రాశిలో కూడివున్నప్పుడు ఆయా నదుకు పుష్కరాలు ఏర్పడి అత్యంత పుణ్యకాలంగా పరిగణింపబడు తుంది. వచ్చే ఆగష్ఠు మాసంలో కృష్ణా పుష్కరాలు వస్తాయి. కృష్ణాపుష్కరా ప్రత్యేక వ్యాసం లోకహితం పాఠకుకు వచ్చే సంచికలో..