కలంగ్‌పూర్‌- ఆడపిల్ల పుడితే సన్మానం కలంగ్‌పూర్‌ గ్రామము, బాలోద్‌ జిల్లాలో గుండర్‌ దేహి బ్లాకులో వున్నది. ఈ గ్రామములో ఏ ఇంట్లోనైనా ఆడపిల్ల జన్మిస్తే, పిల్ల తల్లిదండ్రుకు ఊరంతా వచ్చి సన్మానం చేస్తారు. ఇదేకాకుండా గ్రామ పంచాయితీ 1500 రూపాయ విలువగ బహుమతి ఆ శిశువుకు ఇస్తుంది. 2011లో ఈ పధ్ధతిని అప్పటి మహిళా సర్పంచి ప్రారంభించారు. ఆ పద్ధతిని ఇప్పటి సర్పంచి కొనసాగిస్తున్నారు.  శ్రీమతి తా సాహు 2011 గ్రామ సర్పంచిగా ఎన్నుకోబడ్డారు. ఆవిడకు ఇద్దరు కుమార్తెలు. వారికి ఆవిడ తగిన చదువు సంస్కారాలు ఇచ్చారు. తమ కాములో ఆడపిల్ల విషయముపై ఆలోచనయే తక్కువనీ, ఇంకా ఆడపిల్ల పుట్టటమే శాపముగా భావించే వారని అన్నారు. అందువన తను ఒక వేళ సమాజములో బాధ్యతాయుతమైన పదవిని చేపడితే, తాను ఆడపిల్లల క్షేమం కోసం పనిచేయాని నిర్ణయించుకొన్నానని చెప్పారు. ఐదు సంవత్సరా పూర్వము తాను సర్పంచిగా ఎన్నికైనప్పుడు మొట్టమొదటిగా, ఎవరి ఇంట్లోనైనా ఆడపిల్ల పుడితే గ్రామమంతా వారి ఇంటికి వెళ్ళి వారిని సన్మానించాని నిర్ణయించానని చెప్పారు. ఇందుకోసము పంచాయితీ 1500 రూపాయలు కేటాయించిందని చెప్పారు. వారి ఇష్టప్రకారము వస్తు రూపేణాగాని, ద్రవ్యరూపంగా గాని ఈవ్వబడుతుంది. ఒకప్పుడు భ్రూణ హత్యకు పేరుపొందిన ఈగ్రామములో ఇప్పుడు ఆడపిల్లల పట్ల సకారాత్మకమైన దృష్టి వున్నది. ఈ పరంపరను ప్రస్తుత సర్పంచి గోవింద సిన్హా కొనసాగిస్తున్నారు. వారు ఆడపిల్ల కోసము ఇంకా ఏమైనా చేయాని అనుకొంటున్నారు. వారి చదువు సంధ్య విషయములో ఏదైనా సహాయము చేయానకుంటున్నాము అన్నారు. గ్రామములో 75 పైగా దంపతుకు సన్మానము చేసామని చెప్పారు.