ఈ జాతి యొక్క మంత్రం- భారత్‌మాతాకీజైభారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 70వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నా కూడా దేశంలోని కొందరు మేధావులు భారతమాతకు జై అని పకడం వివాదాస్పదం చేస్తున్నారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఉద్యమానికి స్పూర్తినిచ్చిన వందేమాతరం పకటంలో కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసే వాళ్లు కనబడుతున్నారు. దేశ సరిహద్దులు దాటి అక్రమంగా భారత్‌లో ప్రవేశించడానికి ప్రయత్నించే విదేశీయును నిరోధించడానికి ఆందోళన చేయాల్సిన పరిస్థితులు దేశంలో కనబడుతున్నాయి.
ప్రపంచంలో బహుశా  ఏ దేశంలో కూడా ఇటువంటి పరిస్థితి మనకు కనబడదు. రాజకీయ నాయకులు, ఉదారవాదులు దేశభక్తిని, దేశం పట్ల ఉండే ప్రేమను తమ అవసరా కోసం తాకట్టుపెట్టడానికి ఎటువంటి జంకు, గొంకు లేకుండా వ్యవహరించడం మనదేశంలోనే సాధ్యం. 
ఔరంగబాద్‌ దగ్గరలో వున్న దౌల్తాబాద్‌లో భారతమాత విగ్రహాన్ని ప్రతిష్టించి స్వాతంత్య్ర సమపార్జనకు ఆ విగ్రహం ముందు శపథం చేసి 1857వ సంవత్సరంలో ఆంగ్లేయుపై తొలి స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రారంభించారు. ఆంగ్లేయులు ఔరంగబాద్‌లోని క్రాంతిచౌక్‌ వద్దగ చెబుతర వద్ద స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని బందీలుగా దొరికిన వారిని ఉరితీశారు. 160 సంవత్సరా తరువాత మనదేశంలో భారతమాతను ఆరాధించడం వ్యతిరేకిస్తారని ఎవరైనా ఊహించి ఉంటారా? కానీ అదే జరుగుతున్నది. నా మెడ మీద కత్తి పెట్టినా భారతమాతకు జై అనను అని అనగలిగే సాహసం మనం ఊహించగుగుతామా?ఈ మధ్య కాంలో ఢల్లీలోని జెఎన్‌యూ విశ్వవిద్యాయంలో విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలు ఇవ్వటం జరిగింది. దానిపైన ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాక్‌ మోహన్జీ భగవత్‌గారు మాట్లాడుతూ ఆ యునివర్శి టీలోని యువకుకు భారతమాతాకి జై కారం పలికే సంస్కారాన్ని అందించవసిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు చెందిన మజ్లీస్‌ పార్టీ నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ నా మెడ మీద కత్తి పెట్టినా నేను భారతమాతాకీ జై కారం పకను అని అసందర్భమైన వ్యాఖ్యలు చేశాడు.
భారత్‌ దేశంలోని సెక్యూర్‌ మేధావులు దేశభక్తికి సంబంధించిన అనేక విషయాను విపరీత అర్థాలు, విపరీత వ్యాఖ్యానాలు  చేస్తూ వాటిని ప్రచారం చేస్తున్నారు. ఎటువంటి సంకోచం లేకుండ దేశభక్తి సంబంధించిన విషయాపై వ్యతిరేకించిండాన్ని పెంచిపోషిస్తున్నారు. జాతి వ్యతిరేక నినాదాలు చేస్తున్నవాళ్లను, అటువంటి కార్యకలాపాలు చేస్తున్నటువంటి వాళ్లను ప్రోత్సాహించడమే కాదు వాళ్లకు రక్షణ కల్పిస్తూ సన్మానాలు చేసే నీచత్వానికి దిగజారారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో దేశభక్తి, జాతీయతకు చిహ్నలుగా భావించబడిన వాటిని వ్యతిరేకించటంలోనే తమ అస్తిత్వాన్ని వెతుక్కోవడంలో వామపక్ష మేధావులు దిగజారే వ్యవహారం చేస్తున్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటానికి ఊపిరిగా మారిన వందేమాతరం అనటాన్ని వ్యతిరేకిస్తున్నారు. భారత్‌మాతాకీ జై అనే జయఘోషలో ఎక్కడా  మూర్తిమత్వం యొక్క వర్ణన లేదు. అది దేశభక్తికి సంబంధించిన నినాదం. ఆ నినాదం ఇస్లాంకు వ్యతిరేకం అని అంటున్నారు. ఎందుకంటే భారత్‌మాత ఒక మూర్తిమత్వంగానే వాళ్లు భావిస్తున్నారు. కాని అది ఈ దేశానికి సంబంధించిన జై కారం. ఈ దేశంలోనే వామపక్ష మేధావులు, ఉదారవాదులు దేశంలోని మైనార్టీను సంతృప్తిపరచటము అనే రాజకీయ చదరంగంలో జాతీయ విషయాలు పరిభాషను కూడా మార్చేశారు. ఉదాహరణకు కాషాయ పతాకం గణేషు ఉత్సవాలు మొదలైనవి స్వాతంత్య్ర పోరాట సమయంలో జాతీయ ప్రతీకలుగా ఉండేవి. వాటిని ఇప్పుడు మతం రంగు పూసి వ్యతిరేకించడం అనేది జరుగుతోంది. ఈ మధ్య జెఎన్‌యు వివాదం జరుగుతున్న సమయంలో నాతో పరిచయం లేని ఒక వ్యక్తి నాతో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు మాట మధ్యలో నా నుండి హిందుస్థాన్‌ అనే మాట వచ్చింది. ఈ మాట రావటంతోటే ఆ వ్యక్తి ఈ దేశాన్ని మీరు హిందుస్థాన్‌ అంటున్నారు. ఈ దేశం భారతదేశం, మీరు భారతదేశం అని అనండి, ఈ దేశానికి భారత్‌ అన్న పేరు సాధికారికంగా రాజ్యాంగంలో పేర్కొనబడింది అని అన్నాడు. దానికి నేను మీరు చెప్పింది ఒప్పుకుంటాను కానీ మీరు భారత్‌మాతాకీ జై అని అంటారా అని నేను ప్రశ్నించాను. దానికి ఏమీ సమాధానం చెప్పకుండా ఫోన్‌ పెట్టేశాడు. బహుశా అతను ఒక సామ్యావాద భావజాలం కలిగిన వాడు అయి ఉంటాడు.
ఈ దేశంలో జాతీయపతకానికి ప్రణామం చేయాని నిర్భంధం చేయవద్దని ఒక సందర్భంలో సయ్యద్‌ షాబుద్దీన్‌ తన మాటలో వ్యక్తం చేశాడు. నా మెడ మీద కత్తిపెట్టినా భారత్‌మాతాకీ జై అనను అని ఒవైసీ లాంటి వారు అంటున్నారు. ఇవన్నీ ఇస్లాం మతానికి వ్యతిరేకం. ఇస్లాంలో లేనిదాన్ని జాతీయ విషయమైనా, జాతీయ భావమైన మేము అనుసరించం అని ఈ ఇద్దరు నాయకులు చెప్పకనే చెప్పారు. వాళ్లకు వాళ్ల మతం తప్పించి మిగిలిన విషయాలు తమకు విరుద్ధంగా భావిస్తుంటే ఈ దేశంలోని వీరసెక్యురిస్టులు వాళ్లను సమర్థిస్తున్నారు. దానికి సెక్యులరిజం అనే దానిని సాకుగా చూపిస్తున్నారు. ఒకప్పుడు ఈ దేశంలో సెక్యులరిజం అనేదానిపై ఓ పెద్ద చర్చ జరిగింది. సెక్యులరిజం అంటే అన్ని మతాను సమానంగా చూడటమా? లేక మతాను పట్టించుకోకపోవటమా అనే విషయాన్ని తేల్చి చెప్పలేకపోయారు. ఈ సెక్యులరిజం అనేటటువంటిది మన రాజ్యాంగంలో చేర్చబడింది. దానికి స్పష్టమైన నిర్వచనం లేదు. వాస్తవంగా సెక్యులరిజం అనేది పంథ నిరపేక్షతను సూచించే పదం. దేశంలో ప్రజలు వారివారి ఆరాధన పద్ధతును అనుసరించే స్వేచ్ఛ వారికి ఉంది. అన్ని మతాను, సాంప్రదాయాను గౌరవించడం అనేదానికి మనదేశంలో సర్వపంథ సమభావన అని చెప్పారు. కాని వ్యవహారంలో మతం పేరుతో దేశ వ్యతిరేక భావాను ప్రాధాన్యత ఇవ్వటం అనే విషయాన్ని అల్పసంఖ్యాక వాదులు చేస్తుంటే వారికి సమర్ధన తెలియజేస్తూ మరింత ధైర్యాన్ని కలిగించే పనులు ఈ సెక్యులర్ వాదులు చేయటం మన దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి. రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని, భారతీయ జనతా పార్టీని గుడ్డిగా వ్యతిరేకించేందుకు కుహనా సెక్యులర్ వాదులు భారత్‌మాతాకీజై అని పకడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ భారత్‌మాతాకీ జై అనే నినాదాన్ని రాష్ట్రీయం స్వయం సంఘమే తయారు చేసిందని వాళ్లు అనుకుంటున్నారు. కానీ రాష్ట్రీయ స్వయం సంఘం ఈ నినాదాన్ని చేస్తున్నది కాని దాన్ని సృష్టించలేదు. అన్నహజారే ఉద్యమం చేస్తున్నప్పుడు ఒక పెద్ద సభాకార్యక్రమంలో భారత్‌మాతా ఫోటో స్టేజీపైన పెట్టబడి ఉంది. ఆ ఫొటోను చూసి ఈ కార్యక్రమం సంఘ కార్యక్రమమా అని కొందరు వ్యంగంగా అడిగారు. భారతమాత కల్పనకు మూలం బెంగాల్‌కి చెందిన కిరణ్‌ బెనర్జీ అనే వ్యక్తి. 1873లో భారతమాత అనే నాటకాన్ని రాశారు. ఆ నాటకం ఆ సంవత్సరంలో ప్రదర్శించబడింది. దీనిని నుండే భారత్‌మాతాకీ జై అనే నినాదం ఉద్భవించింది.బంకింన్‌చంద్ర ఛటర్జీ 1882లో ఆనందమఠం అనే నవలో ప్రపథమంగా వందేమా తర గేయాన్ని రచించి దేశానికి సమర్పించారు. ఆ వందేమాతర గీతమే స్వాతంత్య్ర పోరాటానికి ప్రేరణ దాయకమైంది. భాతరమాత రూపాన్ని ఆవిష్కరించిన ఖ్యాతి అభనీంధ్ర ఠాగూర్‌కి చెందుతుంది. ఆయన భారత మాతను చతుర్భుజీ అయిన దుర్గామాత రూపంలో ఒక చిత్రాన్ని చిత్రీకరించారు. ఆ దేవి చేతిలో పుస్తకం పట్టుకుని కాషాయ వస్త్రాలు ధరించినట్లుగా చూపారు. ఆ స్వరూపమే ఆ రోజుల్లో దేశ స్వాతంత్య్రం కొరకు భారతమాత చిత్రాన్ని ఉపయో గించుకొన్నారు. స్వామి వివేకానంద శిష్యురాలైన సోదరి నివేదిత ఆ భారతమాత చిత్రాన్ని మరింతగా తీర్చిదిద్దారు. భారతమాతను ఆకుపచ్చని నేపై నిలిపి వెనుక వినీలాకాశం ఉంది కాళ్లకింద నాలుగు తామరపువ్వులు వుంచారు. చతుర్భుజాలు ఆధ్యాత్మికతకు ప్రతీకగా చూపించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న సుబ్రహ్మణ్య భారతి భారతమాతను గంగయొక్క భూమిగా, శక్తిస్వరూపిణిగా వర్ణించారు. 1936వ సంవత్సరంలో వారణాసిలోని కాశీ విశ్వవిద్యాయంలో భారతమాత మందిరాన్ని నెకొల్పారు. విశ్వహిందూ పరిషత్‌ ద్వారా హరిద్వార్‌లో నిర్మించబడిన భారతమాత మందిరాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభం చేశారు. భారత్‌ సైన్యాన్ని ఉత్తేజపరిచే భారతమాత నినాదం ఒక ధ్యేయ వ్యాక్యమైపోయింది. ఈ నినాదాన్ని బపరచవసిన సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్‌ వాదులు తటస్థంగా ఉండిపోతుంటారు. వామపంథీయులు భారతమాతాకి జై నినాదాన్ని వ్యతిరేకిస్తుంటారు. మొత్తం మీద ఈ దేశంలో కొన్ని శక్తులు ఈ అంశంపై ఒకే త్రాటిమీద నిబడటం అనేది మనకు కనబడుతుంది.
ఆచార్య గోవిందరావ్‌ గిరి మహరాజ్‌ ఒక ఉపన్యాసంలో మాట్లాడుతూ భారత్‌మాతాకీ జై అనటం ఈ దేశం యొక్క జైఘోష మాత్రమే కాదు ఈ దేశాన్ని పరమవైభవ స్థితికి తీసుకునిపోగలిగే మంత్రం అని వ్యాఖ్యానించారు. నిజ జీవితంలో జాతి, మతం, భాషా విబేధావంటి సంకుచిత భావాను విడనాడి దేశంలో సమరసత భావాన్ని వికసింపచేయటమే మనం పలికే భారతమాత జై కారానికి నిజమైన అర్థంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చూపించింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పాడే ఒక పాటలో కొన్ని పంక్తులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. స్వతంత్య్రాన్ని సార్థకం చేసుకోవాలంటే దేశం యొక్క శక్తి ఆధారం కావాలి.  రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సరసంఘచాక్‌ శ్రీ మోహన్‌భాగవత్‌ గారు భారత్‌ మాతాకీ జై అన్న నినాదంపై వివాదం జరుగుతున్న సమయం లో వారు ఒక మాట చెప్పారు. మన దేశంలో ఒక సకారాత్మకమైన సంఘటిత శక్తి నిర్మాణం కావాలి. ఆ శక్తి ఎట్లా ఉండాలంటే కేవలం మన దేశంలోనే కాక విశ్వవ్యాప్తంగా భారత్‌మాతాకీ జై అనే నినాదాలు చేయగలిగేట్టుగా ఉండాలి అని అన్నారు. ఇటువంటి శక్తిని దేశంలో నిర్మాణం చేయాలంటే సమర్పణ భావంతో పనిచేస్తూ నిర్మాణం చేయాలి. తద్వారా ఈ దేశాన్ని శక్తివంతం చేయాలి.