గ్రామ దేవతల పండగే`బోనాలు


ఆషాడ బోనాలు ముగిశాయి. కొత్త కుండలో నైవేద్యం వండి కుండను పసుపు కుంకుమతో, వేపాకుతో అలంకరించి, శక్తి రూపంలో అమ్మవారిని భక్తి ప్రపత్తుతో పూజించి నివేదించడమే ఈ బోనా పండుగలోని ప్రధాన సాంప్రదాయం. ఈ సాంప్రదాయం దేశంలోని అనేక ప్రాంతాల్లో వున్నప్పటికీ, ప్రధానంగా మన తెలంగాణాలో ఈ పండుగను ‘‘బోనాలు’’ జాతరగా జరుపుకుంటున్నాము. ఈ బోనా యొక్క పూర్వపరాను చరిత్రను పరిశీలించినట్లయితే కాకతీయు కాలం నుండి ఈ పండుగ మనకు కనపడుతుంది. కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి ఆషాడ మాసంలో కాకతీదేవికి బలిపూజు నిర్వహించేవారని ప్రతీతి. ఆ విధంగా ప్రారంభమైన సాంప్రదాయం, ప్రధానంగా జనపదాలో గ్రామదేవత ఆరాధనా రూపంలోనే కనబడుతుంది. వైదిక, ఆగమ శాస్త్ర ప్రధాన దేవాయాలు గ్రామాకు దూరంగా వుండటం వల్ల, ప్రాచీన కాలంలో రవాణా సదుపాయాలు లేకపోవడం వల్ల జానపదులు, గ్రామీణులు ప్రతిగ్రామంలోను, ప్రతి వీధిలోనూ స్థానికంగా వారి భక్తి విశ్వాసాను భక్తి ప్రవత్తును, కృతజ్ఞతను వెలిబుచ్చుకోవడానికి ఈ గ్రామదేవత ఆరాధన విధానం ప్రారంభమై వుండవచ్చు.ఈ గ్రామదేవతలో ప్రధానంగా మైసమ్మ, అంకాళమ్మ, యెల్లమ్మ, పోలేరమ్మ, పోచమ్మ మొదలైన దేవత రూపంలో చేసే పూజలు శక్తి ఆరాధనమే. ఈ గ్రామదేవత పేర్ల ఉత్పత్తి పదాను పరిశీలించినట్లయితే, మహిషాసురమర్థని ` మహిషమ్మ` మైషమ్మ` ‘‘మైసమ్మ’’గా జానపదులులుకుబడు ద్వారా పదాలు రూపాంతరం చెంది వుండవచ్చు. అలాగే మహంకాళీ ` మహంకాళమ్మ` అహంకాళమ్మ` అంకాళమ్మ. అలాగు యెల్లమ్మ గ్రామానికి లేదా పోలానికి యల్లలు అనగా  సరిహద్దు కాపాడే తల్లిగా కోలిచేదైవమే యెల్లమ్మ. యెల్లమ్మ ` యెల్లమ్మగా రూపాంతరం చెందివుండవచ్చు. అలాగే పోలేరమ్మ` గ్రామపొలి మేరను క్షేమంగా  కాపాడే తల్లి పోలేరమ్మ` పోలేరమ్మగా రూపాంతరం చెంది వుండవచ్చు. ఏదీ ఏమైనప్పటికీ ఈ గ్రామదేవతకు జరిపే ఆరాధనలు, జాతరలు అన్నీ శక్తి ఆరాధనలో భాగమే. ఈ శక్తిఆరాధన భారతదేశంలో అనేక వే సంవత్సరాలుగా జరుగుతున్నదే. కాగా ఈ శక్తి ఆరాధన ప్రధాన దేవాయాలో లిత, గాయత్రి, కనకదుర్గ రూపంలో శ్లిష్ఠ ఆచార వ్యవహారా ప్రకారం, వైదిక`ఆగమశాస్త్రా ప్రకారం జరుగుతుందా? లేక జానపదు/గ్రామీణు సాంప్రదాయం ప్రకారం గ్రామదేవతకు జాతరలు/ఉత్సవా రూపంలో జరుగుతున్నదా? అనేది అప్రధానం. ఆరాధన తేడా వున్నప్పటికీ శాక్తేయఆరాధన మార్గమే అందరికీ ప్రధానము.
a