రాహుల్‌కు సుప్రీం చురకలు


 కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధి యధావిధిగా ఆర్‌ఎస్‌ఎస్‌ మహాత్మాగాంధీని హత్య చేసిందని’ 2014 ఎన్నిక సమయంలో ఆరోపించారు. సంఘం ఈ విషయమై ఆయనపై పరువునష్టం కేసు వేసింది. తనపైన ఉన్న కేసును కొట్టివేయవసిందిగా ఆయన సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. తాజాగా సుప్రీంకోర్టు రాహుల్‌గాంధిని ఆర్‌ఎస్‌ఎస్‌కి క్షమాపణ చెప్పమని లేకపోతే విచారణకు సిద్ధంకమ్మని నోటీసులిచ్చింది. చరిత్రలో జరిగిన విషయాన్ని ఐపిని ఓ సమూహము లేదా సంస్థకు ఆపాదించడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. సెక్షన్‌ 499 ప్రకారం సంఘం రాహుల్‌ గాంధీపై వేసిన పిటీషన్‌ను త్రోసిపుచ్చుతూ కాంగ్రెస్‌ పార్టీ క్షమాపణ చెప్పేది లేదని, విచారణకే సిద్ధమని తెలిపింది. సంఘం సీనియర్‌ అధికారి శ్రీ మన్‌మోహన్‌వైద్య ఈ విషయమై మాట్లాడుతూ కాంగ్రెస్‌ గాంధీó హత్యపై అబద్ధాలు, ఆధారాలులేని ఆరోపణలు చేస్తున్నదని, సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుపట్ల, రాజ్యాంగ ధర్మాసనంపట్ల రాహుల్‌ గాంధికి, కాంగ్రెస్‌ పార్టీకి గౌరవం లేదని విచారణను తప్పించుకునేందుకే వారు ప్రయత్నిస్తున్నారనిఅన్నారు. ముస్లింలందరినీ తీవ్రవాద ఘటనకు నిందించలేం. అదే అయితే 1984లో జరిగిన సిక్కు ఊచకోతకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తి బాధ్యత వహించి  రాజకీయా నుంచి తప్పుకుని వుండాలి. గాంధీ చనిపోయినప్పుడు హిందూమహాసభ కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారని, వారంతా సంఘం సభ్యుని కాంగ్రెస్‌ చేసే ఆరోపణకు అర్థం లేదు. సంఘం ఓ సంస్థగా గాంధి హత్యపైన ప్రణాళికను రచించిందనడానికి ఎటువంటి ఆధారాలులేవు. నిజానికి సంఘం సంస్థాపకులు డాక్టర్‌ హెడ్గేవార్‌కు మహాత్మాగాంధి పట్ల గౌరవముండేది. 1934లో వార్ధాలో జరిగిన శిబిరానికి మహాత్మాగాంధీ వచ్చారు కూడా. గాంధీ-హతకుడు నాధూరామ్‌గాడ్సే కొంతకాలం సంఘంలో సభ్యుడైనప్పటికీ ఆయన సంఘం అహింసాయుతంగా చేస్తున్న కార్యంపట్ల విముఖుడై 1930వ దశకం లోనే సంఘం విడిచి పెట్టారు. గాంధీó హత్యానంతరం 10 రోజు పాటు అన్ని సంఘశాఖ ల్లోనూ సంతాప దినం పాటించమని నాటి సంఘ అధినేత శ్రీ గురూజీ గోల్వల్కర్‌ పిలుపునిచ్చారు. గాంధీ హత్య జరిగిన జనవరి 30, 1948 నాడు గురూజీ నాటి ప్రధానినెహ్రూ, గృహ మంత్రి పటేల్‌కు సంతాప టెలిగ్రామ్‌లు కూడా పంపారు. గాంధీ హత్య విషయమై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ నెహ్రూ, పటేల్‌కు గురూజీ ఉత్తరాలు కూడా రాశారు. 1933వ సంవత్సరంలో గాంధీజీ హరిజ నోద్ధరణకు పూనుకున్నారు. డాక్టర్‌ హెడ్గేవార్‌జీ ఆ ఉద్యమంలో పాల్గొనాని, అందుకు సహకరించాని స్వయం సేవకుకు పిలుపునిచ్చారు. గాంధి హత్యకు సంఘానికి సంబంధంలేదని కోర్టు ఎప్పుడో తేల్చి చెప్పాయి. నాధూరాంగాడ్సే కాన్పూరులో రతన్‌లాల్‌గుప్తా అనే పేరుగ కాంగ్రెస్‌ కార్యకర్త ఇంట్లో ఆశ్రయం పొందాడు. మహామ్మద్‌ అలీ జిన్నా కాంగ్రెస్‌ పార్టీలో వుండి దేశవిభజనకు కారకుడయ్యాడు. అలాగని మీరు దేశం విభజించారంటే కాంగ్రెస్‌ పార్టీ ఒప్పుకుంటుందా? గాంధీ హత్యలో సంఘానికి సంబంధం లేదని నాధూ రాంగాడ్సే నిందితుడని, సుప్రీం కోర్టు, బీహార్‌ హైకోర్టు, ఉత్తరప్రదేశ్‌ హైకోర్టు కూడా తీర్పుచెప్పింది. 2.2.1948 నాడు జస్టిస్‌ ఆత్మచరణ్‌ నేతృత్వంలో 149 మంది సాక్షును, 636 పత్రాను పరిశీలించారు. నాధూరామ్‌గాడ్సే నిందితుడని తేల్చారు. అయినా కాంగ్రెస్‌ పార్టీ పదేపదే అబద్ధాలు ప్రచారం చేస్తోంది. మహాత్మా గాంధీ మనమడు శ్రీ కృష్ణకుకర్ణి రాహుల్‌ గాంధీకి ఉత్తరం రాశారు. అనేక విచారణ సంఘాలు సైతం సంఘం పేరు ప్రస్తావించలేదని, మహాత్మాగాంధీ పేరు కాంగ్రెస్‌ స్వార్థరాజకీయాకోసం వాడుకోవద్దని హితవు పలికారు.