సమరసతలో అందరికంటే ఒక అడుగు ముందున్న మెట్‌ పల్లి గ్రామం
శివుని రుద్రభూమిలోన అందరికీ అవకాశం కల్పించిన గ్రామ పెద్దలు..రాష్ట్ర చరిత్రలోనే సాటి లేనిదిగా అందరినీ సమరసతో కలిపివుంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందీగ్రామం. హిందూ సమాజంలో అస్పృశ్యత జాఢ్యం జడలు విప్పుతున్న వేళ, చాలా గ్రామా మాదిరిగా..ఇంక ఒకింత ముందడుగు వేసి అద్భుత ఆదర్శాన్ని చూపించారు.
హుస్నాబాద్‌ సబ్‌ ఇన్స్పెక్టర్‌ శ్రీ.భూమయ్య , శ్రీ.తుమ్మ శ్రిరాంరెడ్డి ముఖ్యంగా ఈ దైవ కార్యాన్ని ముందు వుండి నడిపారు. కుభేదాలు, కు రాజకీయాతో ఆటలాడుకునే ఇటువంటి సమయంలో అందరికి ఒకేచోట అంత్య్రక్రియ సంస్కారాకు 20-30 గుంట భూమిలో 20 క్షలు ఖర్చు పెట్టి, చూస్తేనే శ్మశానం కాదు అది ఒక అందమైన పార్కులాగా ఏర్పాటు చేసారు.
ఒకే సారి ఇద్దరి అంత్యక్రియలు జరుపుకోవచ్చు.సాధారణంగా అంత్యక్రియ ఖర్చు 15 వే రుపాయలు దాటి పోతున్న వేళ కేవలం అన్ని క్రియలు 5వేలు ఖర్చు చేస్తె చాలు..తృప్తితొ మరణించిన తమ వారి ఆత్మకు సద్గతు కగటానికి చేసుకోవచ్చు ఇక్కడ. దీని ఆనా పానా అంతా సత్యం అని ఒక మెకానిక్‌ షాప్‌ నడిపే వ్యక్తితో పాటు, రవి అలాగె ఎల్లారెడ్డి వంటి ఆత్మీయులు అందరూ ఈ కార్యక్రమా నిర్వహణ చూస్తారు.
ఈ సంవత్సరం 2016 లో ఫిబ్రవరిలో ప్రారంబించిన ఈ శ్మశానంలో ఇద్దరు ఎస్‌సి వర్గానికి చెందిన వారితో పాటు మొత్తం 9మంది అంత్యక్రియలు ఇప్పటి వరకు (2016 జూన్‌) జరిగాయి..
అగ్రవర్ణా ఆగడాలు ఎక్కువైయినాయి అని మైక్‌ కనపడితే చాలు మైకంతో గొంతుచించుకునే వారికి, అలాగే చేతివ్రెళ్ళు సమానమున్నాయా అంటూ అంటరానితనాన్ని సమర్థించే ఇతర కులావారికి, మెట్‌ పల్లి వారు చేసిన ఈ పని చెంప దెబ్బ వంటిది..గుణపాఠం కూడా..అన్ని గ్రామా పెద్దలు, యువకులు కొట్లాటలు పెట్టే బదులు గౌరవంగా అందరినీ చూసే సమతాభావం నిర్మాణం చేయాలి.
-  అప్పా ప్రసాద్‌