ఉర్దూ మీడియం ముస్లింలను తీవ్రవాదులుగా మారుస్తోంది- మాజీ బిబిసి విలేఖరి తుఫైల్‌ అహ్మద్‌


ముస్లింలోని తీవ్రవాద భావాకు ఉర్దూ మీడియంను  ప్రధానంగా ఆరోపిస్తూ, అటువంటి భావాను ప్రోత్సహిస్తున్న ఇస్లాం మత ప్రచార సంస్థలు అయిన బ్రదర్‌ ఇమ్రాన్‌ హైదరాబాద్‌ముస్లిం మత ప్రచారకుపై కఠిన చర్యలు తీసుకోవాని ప్రముఖ అంతర్జాతీయ వార్త సంస్థ బి.బి.సి మాజీ ఉర్దూ విలేఖరి తుఫైల్‌ అహ్మద్‌ కోరారు. సౌత్‌ ఏషియా స్టడీస్‌ ప్రాజెక్ట్‌ ది మిడిల్‌ ఈస్ట్‌ మీడియా రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌యు. యస్‌) సంస్థ డైరెక్టర్‌, మరియు రచయిత అయిన తుఫైల్‌ అహ్మద్‌ తాను రచించిన జిహాదిస్ట్‌ త్రెట్‌ టు ఇండియాఅనే శీర్షకతో ఉన్న పుస్తకావిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌లో మాట్లాడుతూ ఇస్లామిజమ్‌ ఒక పద్ధతి అని మరియు జిహాదిజమ్‌ అనేది ఆయుధాలు ధరించిన ఇస్లాం యొక్క స్వరూపం అని అన్నారు. భారతదేశములో ఇస్లామిక్‌ ఉగ్రవాదం యొక్క పెరుగుద మరియు దాని పట్ల భారతీయ ముస్లిం స్పందన  మరియు వారి పాత్ర గురించి ఈ పుస్తకములో వివరించారు. ఇస్లామీకరణ ద్వారా ఇస్లాం అఫ్ఘనిస్థాన్‌ మరియు పాకిస్థాన్‌లో హిందూవును నిర్మూలించగలిగిందని అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు ప్రకటించిన ముస్లింకు 12 శాతము రిజర్వేషన్‌ గురించి మాట్లాడుతూ దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికి రిజర్వేషన్‌ అమలు చేయడము వన అన్ని వర్గాకు  చెందిన వారికీ  ఈ పరిధిలోకి వస్తారు అని భావించారు. యూనిఫార్మ్‌ సివిల్‌ కోడ్‌ను సమర్ధిస్తూ దీని పట్ల పెడర్ధాలు తీస్తూ తప్పుగా అర్ధం చేసుకున్నారు అని అన్నారు. న్యూ ఏజ్‌ ఇస్లమ్‌ అనే వెబ్‌ సైట్‌ సంపాదకుడు శ్రీ సుల్తాన్‌ షాహీన్‌ మాట్లాడుతూ ఇస్లాములో హింసను ప్రేరేపించే కొన్ని సూక్తులు సందోర్బోచితంగా ఉండవచ్చు కాని 21వ శతాబ్దములో వాటికి ఎలాంటి ఔచిత్యం లేదు అని అన్నారు. ముస్లిమ్‌ - కాఫిర్‌- ముస్లిమ్‌- ముష్రిక్‌ అనే జంటపదా వివరణ పోవాని, వాటిపై విచారించాల్సిన అవసరం ఉన్నది అని, ఎందుకంటే వ్రాసి ఉన్న వాటిని పాటించమని ఖురానులో చెప్పబడియున్నది అని ఆయన అన్నారు. ఇస్లాములో ఆత్మహత్య పూర్తిగా నిషేధింపబడినదని చెప్తూనే, ప్రస్తుతము ఆత్మాహుతి దాడులు చేసే సైన్యాలు ముస్లిమ్‌ సముదాయా నుండి తయారవుతున్నాయని షాహీన్‌ అన్నారు. గత 40 సంవత్సరాలుగా ముస్లిములో మత ఛాందసము అధికమ వడానికి సౌది అరేబియా ప్రచారం చేస్తున్న వాహబి ఇస్లామిక్‌ ధోరణే కారణమని అని వారు ఆరోపించారు.