మనం యుద్ధంలోనే ఉన్నం అప్రమత్తత అవసరం

ప్రత్యక్ష యుద్ధం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టు లేదు. కానీ ఒక తీవ్రమైన హెచ్చరిక చేయాలనే విషయంలో బేధాభిప్రాయాలు లేవు. పరిమిత దాడులతో పాకి స్తాన్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని నిర్ణయిం చుకుంది. ఆ నిర్ణయ పర్యవసనమే సర్జికల్‌ స్ట్రైక్స్‌. బుధవారం అర్థరాత్రి నియంత్రణ రేఖ దాటివెళ్ళి పాకిస్తాన్‌ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా భారత్‌ మెరుపుదాడి చేసింది. ఆ దాడిలో ఎనిమిది ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి. నలభై మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. 200 మంది ఉగ్రవాదులు చెల్లాచెదు రై పారిపోయారు. 

ఇది కూడా గో సంరక్షణ కార్యమే

ఒకటి రెండు ఆవులను పోషించటానికే జనం ఇబ్బంది పడుతున్న కాలమిది. అటువంటిది, ఒక కర్షకుడు తన తండ్రి ఇచ్చిన రెండు ఆవులను జాగ్రత్తగా పోషించి ఆవులను 80 సంఖ్యకి పెంచాడు. వరంగల్‌ జిల్లా ఘణపురం మండలానికి చెందిన అశోకు బాల్యం నుండి పశుపోషణలోనే ఉన్నాడు. ఇతడి ఆవుల మందలో కొన్ని ఎడ్లు కూడా ఉన్నాయి. వాటితో తన 12 ఎకరాల పొలం దున్నుతున్నాడు. ఇతడు దినానికి 80 లీటర్ల పాలు అమ్ముతాడు. కాని ఒక మెచ్చుకోదగిన అంశం ఏమిటంటే అశోకు ఇప్పటి వరకు ఒక్క ఆవును గాని ఎద్దునుగాని అమ్మలేదు. ఇతడు ఇతర కర్షకులకు నిజంగా ఆదర్శప్రాయుడు.

సేవా సంస్థ ముసుగులో మత మార్పిడి

చిన్న పిల్లలను ఎత్తుకుపోతున్న ముఠాలు గురించి మనం తరుచుగా వింటూ ఉంటాం. ఇటువంటి ముఠా గురించిన అనుమానంతో పోలీసులు లోతుగా పరిశీలించిన తరువాత బయటికి వచ్చిన వాస్తవం ఇది. ఉత్తర ప్రదేశ్‌ మీరట్‌ పట్టణంలో ఒక సేవా సంస్థ. పేరు 'ఇమ్మానియేలు సేవా గ్రూప్‌' దీని నిర్వాహకుడు ఫాదర్‌ దేవరాజగౌడ. ఇక్కడ 5-14 మద్య వయస్సుగల పిల్లలు 23 మంది పోలీసులకు దొరికారు. ఈ పిల్లలను ఎత్తుకొచ్చి వారిచేత బలవంతంగా బైబిలు చదివించి మతం మారుస్తున్నారు. ఈ పిల్లలందరికీ కిరస్తానీ పేర్లు కూడా పెడుతున్నారు. ఏ పిల్లవాడినైనా పేరు అడిగితే వారు రెండు పేర్లు చెపుతున్నారు. తల్లిదండ్రులు పెట్టిన హిందూ పేరు ఫాదర్‌ పెట్టిన కిరస్తానీ పేరు. ఇన్‌స్పెక్టర్‌ సిరోహీ దర్యాప్తు చేస్తున్నారు. ఇమ్మానియేల్‌ సేవా గ్రూపుకు ఎటువంటి రిజిస్ట్రేషన్‌ కాని అనుమతి కాని లేవు అంటున్నారు పోలీసులు. ఔరా! ఎంతకి తెగిస్తున్నారు.- తస్మాత్‌ జాగ్రత్త.

హిందూ దేశమా?

ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం అని వాపోయాడొక కవి. ఇతర దేశాల సంగతి ప్రక్కన పెట్టి మన దేశ చరిత్ర తెలుసుకుందాం! రండి, 'గ్రూప్స్‌' మరియు 'కానిస్టేబుల్‌' పరీక్షల కొరకై 'చరిత్ర' విషయంపై కొన్ని ప్రశ్నలు రూపొందించారు అక్షరాలా 49 ప్రశ్నలు ఉన్న ఈ పట్టికలో అన్నీ కూడా మహమ్మదీయ వైభవం, ప్రాభవం గురించి మాత్రమే ఉన్నాయి. భారతదేశం హిందూ దేశమా లేక ముస్లిం దేశమా అని సందేహం కలుగుతుంది. ఉదాహరణకి కొన్ని ప్రశ్నలు చూద్దాము..
1) ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఢిల్లీ ప్రభువు ఎవరు? 2) జనాబ్‌ అల్లాఉద్దీన్‌ ఖిల్జీ ఏ సంవత్సరంలో గుజరాత్‌పై దాడి చేశాడు? 3) అల్లా ఉద్దీన్‌ హిందువులపై విధించిన భూమిశిస్తు ఏది? సెక్యులరిజం పూర్తిగా తలకెక్కితే చరిత్ర ఇలాగే ఉంటుందేమో!!

మట్టికరిచిన మతోన్మాది

పాకిస్తాన్‌ క్రీడాకరులు, నటీనటులూ, గాయకులు భారత్‌కి రావటం వారికి మన వారు బ్రహ్మరథం పట్టటం మనకి సుపరిచితమే. మన ఆతిథ్యం స్వీకరించి మనను దూషించటం వారికి కూడా అలవాటే. ఇటీవల ముంబైలో ఒక మల్లయుద్ధం పోటీ జరిగింది. పాకిస్తాన్‌ నుండి వచ్చిన ఒక మహిళా మల్లయోధురాలు అందరినీ ఓడించి విజయం సాధించింది. అంతటితో ఆగకుండా నన్నెదిరించే శక్తి ఉన్న వాళ్ళు భారతదేశంలో ఉన్నారా? మీకు అంతశక్తి ఉందా? అంటూ అహకరించి భారతీయులను తూలనాడింది. ఇది విన్న సంద్యాఫడ్కే అనే ఒక మహిూళ ఆ పాకిస్తానీయురాలిని ఎదుర్కొని మల్లయుద్ధం చేసి పాకిస్తాన్‌ మహిళని చిత్తుగా ఓడించింది. కొసమెరుపు: సంధ్యాఫడ్కే ముంబైకి చెందిన 'దుర్గావాహిని'కి చెందిన జిల్లా స్థాయి కార్యకర్త.

ఎట్టకేలకు..

స్వతంత్ర దేశంగా భారత్‌ ఆవిర్భవించి 69 సం||లు దాటింది. ఈ కాలఖండంలో పాకిస్తాన్‌ భారత్‌పైకి మూడు పర్యాయాలు యుద్ధానికి వచ్చింది ఇది కాక ప్రచ్ఛన్నంగా తీవ్రవాదం ద్వారా యుద్ధం చేస్తూనే ఉన్నది. అయితే భారత్‌ మాత్రం చేష్టలుడిగి క్రియా శూన్యంగానే ఉంటూ వచ్చింది. అయితే కాలం మారింది ధైర్యసాహసాలు కల ఒక దేశభక్తుడు ప్రధాని అయ్యాడు.. గురువారం, సెప్టెంబర్‌ 29 అర్థరాత్రి మన సైనిక దళాలు కాశ్మీరులోని నియంత్రణరేఖ దాటి పాక్‌ ఆక్రమిత కాశ్మీరులోని 7 తీవ్రవాదుల స్థావరాలపై దాడిచేసి 40 మందికి పైగా తీవ్రవాదులను అంతమొందించారు. యావద్దేశ ప్రజలూ ఎంతో సంతోషిం చారు. మోడీని అభినందిస్తున్నారు. చివరకు సోనియా, సీతారాం ఏచూరి, ములాయంసింగ్‌లు కూడా ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారంటే ఇది తప్పకుండా గొప్ప విజయమే. భారత్‌ మాతకు జయము జయము.

భాగ్యనగర్‌ వరద సహాయక చర్యల్లో ఆర్‌యస్‌యస్‌

పోయిన వారంలో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా భాగ్యనగర్‌ నగరంలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలోని చిన్న, పెద్ద చెరువులు, కుంటలు వరద నీటితో పొంగిపొర్లాయి. వర్షం కారణంగా అల్వాల్‌ ప్రాంతంలోని 10 కాలనీలలో మోకాళ్ళ లోతు వరదనీరు చేరింది. వారి సహాయార్థం సికింద్రాబాద్‌, అల్వాల్‌లలో నివసించే 40 మంది స్థానిక ఆర్‌యస్‌యస్‌ స్వయంసేవకులు వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 2000పైగా ఆహార పొట్లాలను, తాగు నీటిని ప్రతిరోజూ ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇంటిటికీ తిరిగుతూ అందించారు. 15 మంది స్వయం సేవకులు అల్వాల్‌ మెయిన్‌ రోడ్‌లోని ట్రాఫిక్‌ సాఫీగా సాగేందుకు ఉదయం నుండి సాయంత్రం వరకు ట్రాఫిక్‌ పోలీసు వారికి తోడ్పడ్డారు.

గృహ వైద్యం: తలనొప్పి (వాత దోషం)

త్రిదోషాలలో (వాత, కఫ, పిత్త) ఏ దోషము ఎక్కువవ్వడం వల్లనైనా తలనొప్పి రావచ్చని ఆయుర్వేదము చెబుతుంది. తలనొప్పి రాగానే వెంటనే ఇంగ్లీషు మందు వేసుకొనే కంటే, ఎందుకు వచ్చిందో కాస్త పరిశీలించాలి.

ఉదాహరణకి మానసిక వత్తిడి, జ్వరము, మత్తుపదార్థాలు ఎక్కువ సేవించడంటీవీని దగ్గరగా ఎక్కువ సమయం చూడడంగతంలో తీసుకున్న ఇంగ్లీషు మందుల చిట్కాలు

ఈ చిట్కాలను పాటించండి

బాదంనూనె - ముక్కు రంధ్రాల లో చెరొక చుక్క బాదంనూనె వేసుకోవాలిఒక చంచా దాల్చినచక్క నూనె, మరో చంచా లవంగనూ నె కలిపి నుదురుపై మర్దన చేసుకోవాలితడి తువ్వాలును మెడ చుట్టూ కట్టుకోవాలికొబ్బరి నూనె గాని, నువ్వులునూనె గాని జుట్టు కుదుళ్ళలో బాగా మర్దన చేసుకోవాలి వేయగలిగి కుదిరితే శీర్షాసనం చాలా ఉపశమనం ఇస్తుంది. వీటితో పాటు ఆహారనియమాన్ని కూడా పాటించాలి: వేరు శనగలు, బాదాం పప్పు, ప్రొద్దుతిరుగుడు పువ్వు గింజలు మొదలగునవి నానపెట్టి తినవలెను. నానపెట్టని చో వాతదోషం ప్రకోపిస్తుంది సొరకాయ, బీరకాయ మొదలగు తొందరగా జీర?మయ్యే కూరగాయలనే తినవలెను. మాంసాహారము, కోడిగుడ్లు, చేపలు అస్సలు తినరాదు. ఇవే కాక ఎల్లప్పుడూ మల, మూత్ర విసర్జనలు ఎక్కువగా ఆపరాదు.పగలు నిద్ర పోకూడ దు. తీక్షణమైన ఎండలో బయటకు పోకూడదు ఇవన్నీ పాటించినా ఉపశమనము కలుగకున్నచో, దీర్ఘకాలంగా ఒకే ప్రదేశంలో తలనొప్పి ఉన్నచో వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి.
సైడ్‌-ఎఫెక్ట్సమీపకాలంలో తలకి తగిలిన గాయాలుతగినంత నిద్ర లేకపోవడం మొదలగు కారణాల వల్ల కూడా రావచ్చు.

పంచవటి

రావి చెట్టు, వటవక్షము (మర్రి చెట్టు), బిల్వ వక్షము, ఉసిరిచెట్టు మరియు అశోక వక్షములను కలిపి పంచవటి అంటారు.. ఈ ఐదు వక్షాలను ఐదు దిక్కులలో నాటవ లెను. రావిచెట్టు తూర్పు దిశలో, బిల్వ వక్షము ఉత్తరదిశలో, వట వక్షము పశ్చిమ దిశలో, ఉసిరి చెట్టు దక్షిణ దిశలో తపస్సు చేసుకోవ డానికి వీలుగా నాటుకోవలెను. ఐదు సంవత్సారాల తరువాత వాటి మధ్యలో నాలుగు అడుగుల ఒక వేదిక కట్టుకోవలెను. ఇటువంటిచోట చేసే ధ్యానము వలన కలిగే ఫలితము అనంతము.
పంచవటి యొక్క మహాత్మ్యము
ఔషధ మహత్యము
ఈ ఐదు వ క్షములలో అద్వితీయమైన ఔషధీ తత్వములున్నాయి. ఉసిరిక ' సి' విటమిన్‌ అధికముగా కలిగియుండి, రోగ నిరోధక శక్తి పెంచే గుణములు కలిగియుండును. మర్రి చెట్టుయొక్క పాలు ఎంతో బలవర్ధకమైనవి. వీటిని ప్రతిరోజు స్వీకరించుటవలన శరీరము బలవర్ధకమగును. రావి రక్తదోషాలను పొగొట్టే గుణము కలిగి యుండును. బిల్వము ఉదర సంబధమైన బాధలను నివారించగా, అశోక వక్షము ఆడువారికి కలిగే సమస్యలకు ఔషధకారి.
ఈ వక్షాలకుగల ప్రత్యేకత ఏమంటే, సంవత్స రము పొడుగునా ఏదో ఒక వ క్షానికి ఫలాలుం టాయి. ఇవి ఏ రుతువుకు సంబంధించిన వ్యాధికి ఆ రుతువులో ఆ ఫలం అతి సులభంగా లభిస్తుం ది. ఎండాకాలములో జీర్ణ శక్తికి సంబధించిన సమస్యలకొరకు బిల్వ ఫలము వుంటుంది. వర్షాకాలములో చర్మ సంబంధమైన సమస్యలకూ మరియు రక్త సంబంధిత సమస్యలకొరకై అశోక వక్షము ఫలిస్తుంది. శీతాకాలపు సమస్యలకు శరీర ఉష్ణోగ్రత పెంచుటకొరకు మరియు శక్తి పెంచుటకొరకు ఉసిరిక ఉపయోగపడును.
పర్యావరణం కొరకు మర్రి చెట్టు చల్లని నీడనిచ్చే పెద్ద చెట్టు. ఎండా కాలములో మధ్యాహ్న వేళలో సూర్యుడు తన ప్రచండ కిరణాలతో ఎంతో తాపాన్ని కలిగిస్తాడు మరియు వేడిగాలులు వీస్తాయి. పశ్చిమదిక్కునగల వటవక్షము యొక్క దట్టమైన నీడ పంచవటి అంతా వ్యాపించి చల్లబడడానికి కారణమౌతుంది.
రావి చెట్టు పర్యావరణాన్ని కాపాడి ప్రాణవాయు వు ఉత్పత్తి చేయగల గుణముకల వక్షము. అశోక వక్షము సతతహరిత వక్షము. ఎల్లప్పుడూ నీడనిచ్చే వక్షము. బిల్వ పత్రాలు, బెరడు మరియు కాయలలో గలతైల గ్రంధులవలన వాతావరణములో సుగంధ ము వ్యాపిస్తుంది. పూర్వ మరియు పశ్చిమదిశలలో నున్న మర్రి మరియు రావి వ క్షాలనుండి వీచే గాలి పూర్వపశ్చిమ దిశలనుండి వచ్చే ధూళిసహిత ఈదురుగాలుల వలన రేగే దుమ్మువలన కలిగే వాతావరణ శోషణను అరికట్టగలవు.
ధార్మిక మహాత్మ్యం
బిల్వ వ క్షంపైన శివుడు నివసిస్తాడని, రావి వక్షము విష్ణు మూర్తి నివాసమనీ మరియు మర్రి చెట్టుబ్రహ్మదేవుని నివాసమని విశ్వసిస్తారు. ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పంచవటిలో నివసించడంవలన వారు ముగ్గురినీ ఒకేసారి పూజించిన ఫలితము లభిస్తుంది.
జీవుల సంరక్షణ
పంచవటిలో నిరంతరము ఫలాలు లభించుట వలన పక్షులు మరియు ఇతర జీవులకు తినడానికి ఆస్కారముంటుందిమరియు వాటికి నివాసస్థాన ముంటుంది. రావి మరియు మర్రి వక్షాల కొమ్మలు మదువుగా వుండి పక్షులు గూడు కట్టుకొంటాయి.
- సరోజిని

తీవ్రవాద దేశంగా పాక్‌ను ప్రకటించాలి ఆన్‌లైన్‌ పిటీషన్‌కు భారీ స్పందన

పాకిస్థాన్‌ను తీవ్రవాద ప్రాయోజిత దేశంగా ప్రకటించాలని ఒబామా ప్రభుత్వాన్ని కోరుతూ ఆన్‌లైన్‌లో దాఖలైన ఒక పిటిషన్‌కు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో స్పందన లభించింది. అయిదులక్షల మంది దీనిపై సంతకాలు చేశారు. నిర్దేశిత సంఖ్యకంటే అయిదురెట్లు ఎక్కువ మంది ఈ పిటిషన్‌పై సంతకాలు చేయడం గమనార్హం. సెప్టెంబరు 21వ తేదీన ఆర్‌.జి. అనే పొడి అక్షరాలతో తనను తాను పేర్కొన్న ఓ వ్యక్తి ఈ ఆన్‌లైన్‌ పిటిషన్‌ను సిద్ధం చేశారు. దీనిపై ఒబామా సర్కారు స్పందించాలంటే... 30 రోజుల వ్యవధిలో లక్షల సంతకాలు అవసరం. అయితే, అందుకు అయిదురెట్లు అధికంగా సంతకాలు వెల్లువెత్తాయి. రెండువారాల వ్యవధిలోనే ఇంతటి స్పందన రావడం విశేషం. ఇంతటి స్పందనకు నోచుకున్న ఈ పిటిషన్‌పై 60 రోజుల వ్యవధిలో ఒబామా పాలనాయంత్రాంగం స్పందిస్తుందని భావిస్తున్నారు.

బ్రహ్మపుత్రా నదిని అడ్డుకోచూస్తున్న చైనా

భారత్‌ పొరుగు దేశమైన చైనా ఎప్పుడు భారత్‌ను రెచ్చగొట్టేందుకు, ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నం చేస్తుంది. తాజాగా మరో ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తల్లో తెలుస్తున్నది. చైనా ఆక్రమణలో ఉన్న టిబెట్‌లోని మానస సరోవర్‌లో పుట్టిన బ్రహ్మపుత్రా నది మన
దేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ప్రవహిస్తుంటుంది. ఆ బ్రహ్మపుత్రా నది జలాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఆసియాలో అన్ని రంగాలలో తనకు పోటీగా వస్తున్న భారత్‌పై అక్కసు వెళ్లగట్టడానికే ఈ ప్రయత్నం చేస్తున్నదా? మానస సరోవర్‌ సమీపంలో కైలాస పర్వతం దిగువన పుట్టే ఈ నది అక్కడ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి అక్కడ బంగాళఖాతంలో కలుస్తుంది. మొత్తం 2900 కిలోమీటర్లు ప్రవహించే ఈ నది పరివాహాక ప్రాంతమంతా అత్యంత సారవంత మైనది. సగటున సెకనుకు 19300 గణపు మీటర్ల నీరు ప్రవహిస్తుంది. ఆ నది ఒకొక్కచోట అత్యధి కంగా పదికిలోమీటర్ల వెడల్పున ప్రవహిస్తుంది. భారత్‌ చైనా మధ్య జల ఒప్పందాలు ఏవీ లేవు. 2013 అక్టోబర్‌లో మాత్రం సరిహద్దు నదుల విషయమై సహకారం బలపరుచుకునేలా రెండు దేశాలు అవగాహన పత్రంపై సంతకం చేశాయి. బ్రహ్మపుత్రా నదిమీద ఇప్పటికే ఒక ప్రాజెక్టు చైనా నిర్మించి ఉంది. మరో మూడు ప్రాజెక్టులు నిర్మాణం చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. దీని కారణంగా భారత్‌పై ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. గత మార్చిలో భారత ప్రభుత్వం ఈ విషయాన్ని చైనా దృష్టికి తీసుకువెళ్ళింది కానీ చైనా స్పందన ఏమీ లేదు.

హిందూ రాష్ట్ర్రము అంటే భారతదేశములోని జీవన విధానమే - ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌ - డా|| మన్మోహన్‌ వైద్య


భారత జాతీయ జండా గురించి ఆర్‌యస్‌యస్‌ కు కొన్ని అభిప్రాయబేధాలున్నాయన్న మాట నిజమా?
సంవిధానము ఆమోదించిన భారతజాతీయ జండాను ప్రతిఒక్కరూ గౌరవించాలి. సంఘ్‌ తరపు నుండి జాతీయ జండాను రక్షించడానికై ప్రాణాలను పణంగా పెట్టినవారు ఎందరో ఉన్నారు. ఈ కారణం గా ఈ జండాను మేము ఆమోదించము అనడము సత్యవిదూరము.
జండాను ఆమోదించినప్పుడు ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదా?
మువ్వన్నెల జండా 1921లోని అప్పటి రాజకీయ పరిస్థితులలో రూపొందింది. సమాజము లో అధిక సంఖ్యలోనున్న జనాభాను దష్టిలోవుంచు కొని రూపొందిచాలన్నది గాంధీగారి అభిలాష. అడుగు భాగములో ఎరుపు (కాషాయము కాదు), మధ్యలో ఆకుపచ్చ మరియు పైన తెలుపు హిందువు లను, ముస్లిములను మరియు క్రిష్టయన్లకు సంకేతం గా ఉండేడట్లు రూపొందించబడినది. ఆ జండా మత ఆధారితమైనదని అప్పుడే దానిని చాలామంది వ్యతిరేకించారు. ఒక్కొక్క మతాన్ని వేర్వేరుగా చూపు తూ అందరూ కలసే ఉండాలనే భావనయే కమ్యూ నల్‌ అని అన్నారు. అందువలన మతాలకు అతీతమై న జాతీయజండా కావాలని కోరారు. ఈకోరిక ఎంత బలీయమైనదంటే అందుకోసము ఏడుగురు సభ్యులతో కూడిన (ఫ్లాగ్‌ కమిటీ) ఒక కమిటీని ఆల్‌ ఇండియా కాంగ్రేస్‌ కమిటీ నియమించింది. అందరి వాదనలు విన్న తరువాత, కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది.
1931లో ఫ్లాగ్‌ కమిటీ సమర్పించిన నివేదికలో ఇలా చెప్పబడింది - ''మన జండా సకారాత్మకంగా, ప్రత్యేకత కలిగి మరియు మతాలకు సంబంధం లేకుండా ఉండాలి. అది ఒకటే రంగులో ఉండాలని ఏకగ్రీవంగా ఆమోదించడమైనది. ఒకటిని మించి ఒకటి ప్రత్యేకతకలిగిన రంగులున్నట్లయితే భారతీయులు ఏకగ్రీవంగా ఆమోదించగలిగిన ఒకే ఒక్క రంగు పురాతన కాలమునుండి ప్రాముఖ్యత సంచరించుకున్న కాషాయ వర్ణము.'' కాషాయవర్ణ ము కలిగి, మధ్యలో నీలిరంగు చరఖాతోనున్న దీర్ఘచతురస్రాకారములోనున్న జండా ను ఫ్లాగ్‌ కమిటీ ప్రతిపాదించింది. కాషాయ వర్ణాని కి మతము రంగు పూయడము స్వాతంత్య్రం వచ్చిన తరువాత సెక్యులర్‌ అన్న పదాన్ని సంవిధా నములో చేర్చి మత తత్వమునకూ మతసమానత్వ మునకూ సరైన నిర్వచనం లేకపోవడం వలన సమస్యలు వచ్చాయి.
ఆర్‌యస్‌యస్‌ యొక్క ప్రార్ధన మరియు ప్రతిజ్ఞ రెండూ కూడా హిందూ రాష్ట్రమునుద్ధేశించి ఉంటాయి. ఆర్‌యస్‌ యస్‌ దీనిని ఎలా విశ్లేషిస్తుంది?
రాష్ట్రం అన్న పదము ఇంగ్లీషులో దేశానికి వర్తిస్తుంది. దేశము అన్న పదము యొక్క ఆవిర్భావ ము యూరప్‌ లో 15వ శతాబ్దములో మతప్రాతి పదిక కారణంగా జరిగింది. భారతదేశంలో అటు వంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. వైదిక కాలమునుండి రాష్ట్రం (దేశము) అన్నపదము దేశవాసుల భావాల ను పంచుకుంటూ వారిని ఒకే సంస్కతిగా నిలబె ట్టింది. రాష్ట్రానికి దేశానికీ బేధం వుంది. రాష్ట్రం అన్నది ఒక రాజకీయ సంఘము దేశం అంటే మనుష్యులు. దేశమంటే ఏమిటి అన్న దానికి ప్రఖ్యాత ఫ్రెంచి శాస్త్రవేత్త ఎర్నెష్ట్‌ రెనాన్‌ ఇలా అన్నారు- ''మట్టి మనుగడకు ఆధారాన్ని , కాయకష్టం చేయడానికీ అవకాశం ఇస్తుంది, మానవుడు దానికి ఆత్మను ప్రసాదిస్తాడు. ప్రజలు అనబడే ఈ మహాకా ర్యం జరగడానికి కారణం మానవుడే. పదార్ధము ఒక్కటే సరిపోదు. దేశమన్నది ఆత్మసంబ ధమైన విషయము, సున్నితమైన చరిత్ర నిర్మాణము యొక్క ఫలితము, ఆధ్యాత్మిక సంబధములు గల కుటుంబ మేకాని, భూమివలన కలుపబడే వ్యక్తులు కారు.
''ఆత్మ లేక ఆధ్యాత్మిక సూత్రాలకు సంబధించి రెండు విషయాలున్నాయి. ఒకటి భూతకాలమునకు చెందినది ఇంకొకటి వర్తమానమునకు సంబంధిచినది . మొదటిది వారసత్వ సంపదకు చెందిన జ్ఞాపకాలు, రెండవది కలిసి బ్రతకాలనే కోరిక మరియు వారసత్వ సంపదను పరిపూర్ణంగా ఉపయోగించుకొ నుటకు చేసే ప్రయత్నాలగురించిన ఒడంబడిక.
''మానవుణ్ణి తమకు తగినట్లుగా మలచడానికి వీలుపడదు. ఒక వ్యక్తిలాగానే దేశము కూడా ఎంతో పరిశ్రమ, ఎన్నో త్యాగాలు మరియు భక్తికి పరాకాష్ట. పూర్వీకులను పూజించడమనేది అన్ని విధాలా ఆమోదదాయకము. మనము ఇలా తయారుకావడా నికి మన పూర్వీకులే కారణము. సాహసవంతమైన చరిత్ర, విశిష్టమైన వ్యక్తులూ, కీర్తి, నిజమైన కీర్తి - ఇవే దేశ స్థాపనగురించి ఆలోచించేటప్పుడు ఉండవలసిన మదుపు.'' ఇందువలన హిందూ రాష్ట్రమ న్నది భారతీయులది మరియు భారతదేశములోని ప్రజలు పాటించే జీవన విధానము. మన సమాజము లో హిందూ భావన అనగా ప్రతి మనిషిలో వున్న దైవత్వాన్ని గుర్తించడమే కాకుండా మతము అన్నది వ్యక్తిగత విషయము అని గుర్తించడము.
ఆధ్యాత్మిక లక్ష్య సాధనకోసము మీరు ఏదైనా మార్గాన్ని ఎంచుకోవచ్చును. హిందుత్వమన్నది భారతీయ విలువలే. ధర్మము అనే పదాన్ని మతము అనే అర్ధం వచ్చేటట్లుగా తర్జుమా చేయడం వలన ఈ గందరగోళం ఏర్పడింది.
అయితే హిందూ రాష్ట్రానికీ లౌకిక దేశానికీ ఏం వ్యత్యాసము లేదా?
లేదు. ఠాగూరు యొక్క ''స్వదేశీ సమాజ్‌'' అన్న వ్యాసము లోని ఒక పంక్తి ద్వారా ఈ విషయ ము ఇంకా బాగా అర్ధమౌతుంది: ''భిన్నత్వంలో ఏకత్వం -విభిన్నమైనవాటిలో ఏకత్వం కలిగించుట అన్నదే భారత ధర్మం. భారత్‌ అభిప్రాయ బేధాలను శత్రుత్వ భావాలుగా భావించదు. అటువంటి వారిని శత్రువు లుగా పరిగణించదు. ఎటువంటి త్యాగాలు, విధ్వం సాలు లేకుండా అందరినీ తనలో ఇముడ్చుకోవాల నుకుంటుంది. అందువలన ప్రతిఒక్క రి మార్గాలనూ ఆమోదించి అందరిలో గొప్పదనాన్ని చూస్తుంది.
''ఇటువంటి ధర్మము వలననే భారత్‌లో ఎవరినైనా చూస్తే భయంకలుగదు ఎందుకంటే ఏ సమాజాన్ని మనము శత్రువుగా భావించము. ప్రతి తాజా సంఘర్షణ మనము విస్తరించేందుకు అవకాశమిస్తుంది. హిందువులు, బౌద్ధులు, ముస్లింలు, క్రిష్టియన్లు ఒకరితో ఒకరు సంఘర్షిస్తూ మరణించరు వారు ఒక మీటింగ్‌ పాయింట్‌కి చేరుతారు. ఆ మీటింగ్‌ పాయింట్‌ హిందూయేతర మయి వుండదు, నిశ్చయముగా హిందువే.'' హిందుత్వము ఒక మతము కాదు, అని డా||రాధాకష్ణన్‌ అభిప్రాయపడ్డారు. అది సర్వమతాల సమ్మేళనమని అన్నారు. హిందు ధర్మాన్ని పాటిస్తే ఏ మతాన్నైనా పాటించగల్గుతారని అన్నారు.
అటువంటి సందర్భంలో ఘర్‌ వాపసీ యొక్క ఆవశ్యకత ఏమిటి?
హిందువులుగా మేము మతాంతరీకరణను నమ్మ ము. చాలామంది ముస్లిములు, క్రిష్టియన్లు ఆర్‌యస్‌ యస్‌ శాఖలకు వస్తారు కానీ వారిని మతం మార్చడా నికి మేము ప్రయత్నించము. వారివారి మతాలను వారు పాటిస్తారు. ఆర్‌యస్‌యస్‌ సీనియర్‌ కార్యకర్త అయిన శ్రీ ఎం.జీ. వైద్య నాగపూరులోని స్కాటిష్‌ చర్చ్‌ ద్వారా నడుపబడిన సంస్కత కళాశాలలో ప్రొఫె సర్‌గా పని చేశారు. ఒకసారి ఆయన సహోద్యో గి అయిన ఒక క్రిష్టియన్‌ ప్రొఫెసర్‌ తను ఆర్‌యస్‌ యస్‌లో చేరడాని కి అవకాశం వుంటుందా అని అడిగాడు. శ్రీ వైద్య ఆయనకు సమాధానమిస్తూ, ''తప్పకుండా, ఇందుకోస ము మీరు మతము మార్చుకొనే అవసరము లేదని అన్నారు. కానీ మీరు చర్చి బయటకూడా మోక్షానికి దారి ఉంటుందని అంగీకరించాలి'' అని అన్నారు. దానికి ఆ క్రిష్టియన్‌ ప్రొఫెసర్‌ సమాధానమిస్తూ అందుకు తాను అంగీకరిం చననీ దానికి కారణము తను మతాంతరీకరణ చేయడానికి గల అర్హతను, అవకాశాన్ని కోల్పోతాననీ అన్నాడు. ప్రసిద్ధ సర్వోద యా నాయకుడు, ఆచార్య వినోబా భావే ''హిందూయే తరమార్గము ద్వారా మోక్ష ప్రాప్తి కూడా హిందూ ధర్మమే'' అన్నారు. ఏదిఏమైన ప్పటికీ చాలా మందిని సామూహికంగా మతాంతరీక రణ వ్యక్తులు చాలా మంది తమతమ మూలాలను చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్న ములో వారికి సహకరించడమే ఘర్‌ వాపసీ లేక హోమ్‌ కమింగ్‌. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుండి పబ్లక్‌ అడ్మినిష్ట్రే షన్‌ విభాగములో ఎగ్జిక్యూటివ్‌ మాష్టర్‌ ప్రోగ్రామ్‌ చేస్తున్న ప్రగ్యా తివారీ ఢిల్లీ వాసియైన విలేఖరి.
లైవ్‌ మింట్‌. కామ్‌ సౌజన్యంతో

దేశహితమే లక్ష్యం- జాతివైభవమే మతం

విజయదశమి ఆర్‌.యస్‌.యస్‌ ఆవిర్భావ దినోత్సవం 

మనిషి సంఘజీవి. సమాజశ్రేయమే తన శ్రేయస్సుగా భావించే వ్యక్తులు, కలిసి జీవించే గుణం సహజంగా గల సమాజం, ఇవే సామాజిక స్పృహకు, సామాజిక పరివర్తనకు కావాల్సినవి. 91 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిలో స్ఫురించిన ఈ ఆలోచనకు సాకారరూపమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌. ఆయనే డాక్టర్‌ కేశవరావు బలిరామ్‌ హెడ్గేవార్‌. 1889లో ఉగాదినాడు నాగపూర్‌లో ఓ సామాన్యకుటుంబంలో పుట్టిన కేశవరావు జన్మజాత దేశభక్తుడు.

బల ప్రయోగాన్ని బలప్రయోగంతోనే ఎదుర్కొంటాం - లాల్‌ బహదూర్‌ శాస్త్రిపాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం ఆగిపోయి ఖచ్‌ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం మీద సంతకాల సిరా తడిఆరకముందే పాకిస్తాన్‌ మళ్లీ మారువేషంలో కాశ్మీర్‌లో జొరబడిం ది. దానికి లాల్‌ బహదూర్‌ శాస్త్రి బలయప్రయోగాన్ని బలప్రయోగంతో నే ఎదుర్కొంటామని చెప్పారు. స్నేహపూర్వక వచనాలతో సర్పం దారికి రాదు కదా!.

పూర్తిగా చదవండి

వాల్మీకి జయంతి ఆశ్విజ పౌర్ణమి (అక్టోబరు-16)


భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వాల్మీకి జయంతిని 'ప్రగట దివస్‌'గా జరుపుకొంటారు. ఆ రోజున భజనలు, సమాజంలోని వివిధ వర్గాలు కలిసి సహపంక్తి భోజనము చేస్తారు. వేటగాడుగా ఉన్న రత్నాకరుడు అచంచలమైన సాధనతో మహర్షిగా రూపొందాడు. మానవ జీవనానికి ఆదర్శప్రాయమైన శ్రీరాముని చరిత్రను రామాయణంగా రచించిన వాల్మీకి భారతీయులందరికీ ప్రాత: స్మరణీయుడు.  

కొత్త జిల్లాలతో పరిపాలన ప్రజలకు చేరువవుతుందా?


తెలంగాణ ప్రాంతంలో విజయదశమి నుంచి కొత్త జిల్లాల ఆధారంగా పరిపాలన ప్రారంభం కాబోతుంది. జిల్లాల సంఖ్య ఇప్పటివరకు 27గా నిర్ణయించబడింది. దానికితోడు గద్వాల, సిరిసిల్లా, జనగాంలకు సీఎం సానుకూలంగా స్పందిస్తున్నారు అనే వార్త ఈ రోజు (అక్టోబర్‌3) పత్రికల్లోకి ఎక్కింది. ఇదే నిజమైతే తెలంగాణ 30 జిల్లాలుగా మారబోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోవటం అనేది అత్యంత అవసరం. 1) జిల్లాల విభజన చారిత్రక నేపథ్యానికి అనుకూలత ఉండవలసిన అవసరం ఉంది కానీ ఈ ఏర్పాటు అంతగా చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకున్నట్లుగా కనబడటం లేదు. 2) ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అప్పటి వరకు ఉన్న సమితులను రద్దు చేసి మండల వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ మండల వ్యవస్థ ఏర్పాటు చేసిన కారణంగా పరిపాలన సౌలభ్యం పెరిగింది. కాని పరిపాలన అనేది పలుచన పడటం మాత్రం చాలా స్పష్టంగా కనబడింది.
ఈ రోజుకు కూడా ఆ మండల వ్యవస్థ పరిపాలన ఎంత పటిష్టంగా ఉందో మనందరికీ కూడా తెలుస్తుంది. పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం ఎంత అవసరమో పరిపాలనను సుధృడంగా పలుచన కాకుండా చూడటం కూడా అంతే అవసరం. ఈ జిల్లాల ఏర్పాటు కారణంగా రాజకీయ సమీకరణాలు మారిపోతాయి. దానితో పాటు ప్రజలకు రాజకీయ పరమైనటువంటి ఆశలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఇది ఎన్టీరామారావు పరిపాలన కాలంలో ప్రజల్లో చోటుచేసుకున్న రాజకీయపరమైనటువంటి ఆశలు మళ్లీ ఈ కొత్త జిల్లా సమయంలో కనబడవచ్చు అని అనిపిస్తున్నది.

లోక కళ్యాణం కోసం కన్యాకుమారి నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర


దేశం మొత్తం సుభిóక్షంగా ఉండాలంటే గ్రామాలు సుభిక్షంగా ఉండాలి. గ్రామ చైతన్యం కోసం, గ్రామకళ్యానం కోసం తాను కన్యాకుమారి నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టానని శ్రీ సీతారాంజీ స్వామి పాదయాత్ర మహబూబ్‌నగర్‌జిల్లాకు చేరిన సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి అన్నారు. తాను 2012 ఆగస్టు 09న కన్యాకుమారి నుంచి పాదయాత్ర చేపట్టానని 2017 జులై 09వ తేదిన కన్యాకుమారి చేరుకుంటాను. ఆ రోజుతో నా పాదయాత్ర పూర్తవుతుంది. సమరసతా సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నానని తెలిపారు. దేశంలో ఉన్న గ్రామాలలో విస్తృతంగా పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం మహబూబ్‌నగర్‌లోని దోమలపెంటకు చేరుకున్నారు. దోమలపెంట గ్రామస్థులు గంగయ్య, సిద్ధార్థ, బాబురావు, రాంరెడ్డి స్వాగతం పలికారు. అట్లా మూడు రోజులపాటు అచ్చంపేట నుండి గ్రామాలు విస్తృతంగా తిరుగుతూ చివరి రోజు అలంపూర్‌ చేరుకున్నారు. అలంపూర్‌లో గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అలంపూర్‌ చుట్టూ ఉన్న గ్రామాల నుంచి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న కొంతమంది కార్యకర్తలు వారితో కలిసారు. శక్తిపీఠం జోగులాంబ దేవాలయంలో పూజలు కూడా నిర్వహించారు. అక్కడి నుంచి కర్నూలు జిల్లాకు బయలు దేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రాంత కార్యవాహ శ్రీ చంద్రశేఖర్‌, సహకార్యవాహ శ్రీ అన్నదానం సుబ్రహ్మణ్యం, అ.భా.సహసేవా ప్రముఖ్‌ అజిత్‌జీ మహాపాత్ర తదితరులు పాల్గొన్నారు.