లోక కళ్యాణం కోసం కన్యాకుమారి నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర


దేశం మొత్తం సుభిóక్షంగా ఉండాలంటే గ్రామాలు సుభిక్షంగా ఉండాలి. గ్రామ చైతన్యం కోసం, గ్రామకళ్యానం కోసం తాను కన్యాకుమారి నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టానని శ్రీ సీతారాంజీ స్వామి పాదయాత్ర మహబూబ్‌నగర్‌జిల్లాకు చేరిన సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి అన్నారు. తాను 2012 ఆగస్టు 09న కన్యాకుమారి నుంచి పాదయాత్ర చేపట్టానని 2017 జులై 09వ తేదిన కన్యాకుమారి చేరుకుంటాను. ఆ రోజుతో నా పాదయాత్ర పూర్తవుతుంది. సమరసతా సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నానని తెలిపారు. దేశంలో ఉన్న గ్రామాలలో విస్తృతంగా పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం మహబూబ్‌నగర్‌లోని దోమలపెంటకు చేరుకున్నారు. దోమలపెంట గ్రామస్థులు గంగయ్య, సిద్ధార్థ, బాబురావు, రాంరెడ్డి స్వాగతం పలికారు. అట్లా మూడు రోజులపాటు అచ్చంపేట నుండి గ్రామాలు విస్తృతంగా తిరుగుతూ చివరి రోజు అలంపూర్‌ చేరుకున్నారు. అలంపూర్‌లో గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అలంపూర్‌ చుట్టూ ఉన్న గ్రామాల నుంచి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న కొంతమంది కార్యకర్తలు వారితో కలిసారు. శక్తిపీఠం జోగులాంబ దేవాలయంలో పూజలు కూడా నిర్వహించారు. అక్కడి నుంచి కర్నూలు జిల్లాకు బయలు దేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రాంత కార్యవాహ శ్రీ చంద్రశేఖర్‌, సహకార్యవాహ శ్రీ అన్నదానం సుబ్రహ్మణ్యం, అ.భా.సహసేవా ప్రముఖ్‌ అజిత్‌జీ మహాపాత్ర తదితరులు పాల్గొన్నారు.