భాగ్యనగర్‌ వరద సహాయక చర్యల్లో ఆర్‌యస్‌యస్‌

పోయిన వారంలో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా భాగ్యనగర్‌ నగరంలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలోని చిన్న, పెద్ద చెరువులు, కుంటలు వరద నీటితో పొంగిపొర్లాయి. వర్షం కారణంగా అల్వాల్‌ ప్రాంతంలోని 10 కాలనీలలో మోకాళ్ళ లోతు వరదనీరు చేరింది. వారి సహాయార్థం సికింద్రాబాద్‌, అల్వాల్‌లలో నివసించే 40 మంది స్థానిక ఆర్‌యస్‌యస్‌ స్వయంసేవకులు వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 2000పైగా ఆహార పొట్లాలను, తాగు నీటిని ప్రతిరోజూ ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇంటిటికీ తిరిగుతూ అందించారు. 15 మంది స్వయం సేవకులు అల్వాల్‌ మెయిన్‌ రోడ్‌లోని ట్రాఫిక్‌ సాఫీగా సాగేందుకు ఉదయం నుండి సాయంత్రం వరకు ట్రాఫిక్‌ పోలీసు వారికి తోడ్పడ్డారు.