ఇది కూడా గో సంరక్షణ కార్యమే

ఒకటి రెండు ఆవులను పోషించటానికే జనం ఇబ్బంది పడుతున్న కాలమిది. అటువంటిది, ఒక కర్షకుడు తన తండ్రి ఇచ్చిన రెండు ఆవులను జాగ్రత్తగా పోషించి ఆవులను 80 సంఖ్యకి పెంచాడు. వరంగల్‌ జిల్లా ఘణపురం మండలానికి చెందిన అశోకు బాల్యం నుండి పశుపోషణలోనే ఉన్నాడు. ఇతడి ఆవుల మందలో కొన్ని ఎడ్లు కూడా ఉన్నాయి. వాటితో తన 12 ఎకరాల పొలం దున్నుతున్నాడు. ఇతడు దినానికి 80 లీటర్ల పాలు అమ్ముతాడు. కాని ఒక మెచ్చుకోదగిన అంశం ఏమిటంటే అశోకు ఇప్పటి వరకు ఒక్క ఆవును గాని ఎద్దునుగాని అమ్మలేదు. ఇతడు ఇతర కర్షకులకు నిజంగా ఆదర్శప్రాయుడు.