తీవ్రవాద దేశంగా పాక్‌ను ప్రకటించాలి ఆన్‌లైన్‌ పిటీషన్‌కు భారీ స్పందన

పాకిస్థాన్‌ను తీవ్రవాద ప్రాయోజిత దేశంగా ప్రకటించాలని ఒబామా ప్రభుత్వాన్ని కోరుతూ ఆన్‌లైన్‌లో దాఖలైన ఒక పిటిషన్‌కు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో స్పందన లభించింది. అయిదులక్షల మంది దీనిపై సంతకాలు చేశారు. నిర్దేశిత సంఖ్యకంటే అయిదురెట్లు ఎక్కువ మంది ఈ పిటిషన్‌పై సంతకాలు చేయడం గమనార్హం. సెప్టెంబరు 21వ తేదీన ఆర్‌.జి. అనే పొడి అక్షరాలతో తనను తాను పేర్కొన్న ఓ వ్యక్తి ఈ ఆన్‌లైన్‌ పిటిషన్‌ను సిద్ధం చేశారు. దీనిపై ఒబామా సర్కారు స్పందించాలంటే... 30 రోజుల వ్యవధిలో లక్షల సంతకాలు అవసరం. అయితే, అందుకు అయిదురెట్లు అధికంగా సంతకాలు వెల్లువెత్తాయి. రెండువారాల వ్యవధిలోనే ఇంతటి స్పందన రావడం విశేషం. ఇంతటి స్పందనకు నోచుకున్న ఈ పిటిషన్‌పై 60 రోజుల వ్యవధిలో ఒబామా పాలనాయంత్రాంగం స్పందిస్తుందని భావిస్తున్నారు.