వాల్మీకి జయంతి ఆశ్విజ పౌర్ణమి (అక్టోబరు-16)

భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వాల్మీకి జయంతిని 'ప్రగట దివస్‌'గా జరుపుకొంటారు. ఆ రోజున భజనలు, సమాజంలోని వివిధ వర్గాలు కలిసి సహపంక్తి భోజనము చేస్తారు. వేటగాడుగా ఉన్న రత్నాకరుడు అచంచలమైన సాధనతో మహర్షిగా రూపొందాడు. మానవ జీవనానికి ఆదర్శప్రాయమైన శ్రీరాముని చరిత్రను రామాయణంగా రచించిన వాల్మీకి భారతీయులందరికీ ప్రాత: స్మరణీయుడు.  

మహార్షి వాల్మికి ఆశ్వయుజ పౌర్ణమి నాడు జన్మించారు. వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు. కుటుంబ పోషణ కోసం వేటను వృత్తిగా స్వీకరించాడు. ఒకసారి నారదుడు రత్నాకరుడికి అడవిలో తారసపడి పవిత్రమైన 'రామ' నామాన్ని ఉపదేశిస్తాడు. సంవత్సరాల కొద్దీ రామనామాన్ని జపిస్తూ రత్నాకరుడు తీవ్ర తపస్సు చేస్తాడు. ఆయన శరీరం మీద చీమలపుట్ట పెరుగుతుంది. నారదుడు చీమలపుట్టను తొలగించి రత్నాకరుడికి 'వాల్మీకి' అని నామకరణం చేస్తాడు. చీమలపుట్టను సంస్కృతంలో 'వాల్మీకి' అంటారు. వాల్మీకి సంస్కృతంలో రచించిన రామాయణంలో 7 కాండలు, 24వేల శ్లోకములు కలవు. సంస్కృతంలో శ్లోకములు వ్రాసిన తొలికవి కావున వాల్మీకిని ఆదికవిగా భావిస్తారు. 