దేశహితమే లక్ష్యం- జాతివైభవమే మతం

విజయదశమి ఆర్‌.యస్‌.యస్‌ ఆవిర్భావ దినోత్సవం 

మనిషి సంఘజీవి. సమాజశ్రేయమే తన శ్రేయస్సుగా భావించే వ్యక్తులు, కలిసి జీవించే గుణం సహజంగా గల సమాజం, ఇవే సామాజిక స్పృహకు, సామాజిక పరివర్తనకు కావాల్సినవి. 91 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిలో స్ఫురించిన ఈ ఆలోచనకు సాకారరూపమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌. ఆయనే డాక్టర్‌ కేశవరావు బలిరామ్‌ హెడ్గేవార్‌. 1889లో ఉగాదినాడు నాగపూర్‌లో ఓ సామాన్యకుటుంబంలో పుట్టిన కేశవరావు జన్మజాత దేశభక్తుడు.

సంకల్పంబలం గొప్పంది. శివాజీ కథ ఆయనకు స్ఫూర్తి. నాడు దేశ స్వాతంత్య్రం కోసం జరుగుతున్న ఉద్యమంలో తిలక్‌ను ఆయన అనుసరించేవారు. తిలక్‌ సంపూర్ణ స్వాతంత్రోద్యమా నికి బలమిచ్చేందుకు ఆయన కాంగ్రెస్‌లో నాయకుడవుతాడు. పదవులకోసం కాదు. కలకత్తాలో మెడిసిన్‌ చదువుతూ ఆయన విప్లవోద్యమంలో పాల్గొన్నారు. బెంగాలీ జీవనసాధన చేశారు. 1914 నాగపూర్‌ తిరిగివచ్చి కాంగ్రెస్‌ పార్టీ తరపున ఊరూర తిరిగి ప్రజలను బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా ఉద్యమింపజేశారు. 1921లో సహాయ నిరాకర ణోద్యమంలో ఏడాదిపాటు జైలు శిక్షననుభవిస్తారు. ఆరోజుల్లో బర్మానుంచి ఆయనకు నెలకు రూ.300 జీతం వచ్చే ఉద్యోగం లభించినా దాన్నివద్దన ఆ జన్మాంతం బ్రహ్మాచారిగా వుండి దేశసేవకు అంకితమయ్యేందుకు నిశ్చయించుకుంటారు. 1921-25 మధ్యకాలంలో ఆయన మస్తిష్కంలో జరిగిన మహా సాగరమదనమే సంఘ ఆవిర్భావానికి కారణమైంది. అంతా 'స్వాతంత్రం కావాలి అంటుంటే' అసలు స్వాతంత్య్రం ఎందుకుపోయింది' అని ఆయన ప్రశ్నించారు. 1000 సం|| విదేశీదా డుల్లో చితికిపో యిన మన సమాజంలో అనేక కుసంస్కారాలు ప్రవేశించాయి. కనుక వ్యక్తి వ్యక్తిని అన్ని భేదభావాల కతీతంగా కలిపే కార్యక్రమం కావాలి. అది ధర్మభక్తి, దేశభక్తి, దైవభక్తి, సామాజిక స్పృహ, నిరాడంబర జీవనం, నిస్వార్థసేవ, ప్రసిద్ధి పరాన్ముఖత, రాజీలేని ఉద్యమశీలత, కష్టసహిష్ణుత, విజయా కాంక్ష ఇలాం టి విశేష లక్షణాలను వ్యక్తిలో ప్రోదిచే సేదిగా ఉండాలి. ఇది వేల సంవత్సరాల జాతీయ జీవనం, మహాపురుషుల త్యాగఫలం నేపథ్యంలో జరగాలి. దేశ కార్యం ఎవరో కొందరు నాయకులు చేసేదికా దని, ప్రతిసామాన్యుడు సమాజంగురించి, దేశం గురించి ఆలోచించాలని డా|| హెడ్గేవార్‌ భావించా రు. ఇది ఓ అఖిలభాతర స్వరూపం సంతరించుకో వాలని, కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఓతప్రోతం కావాలని ఆయన ఆకాంక్షించారు. 1914 నుండి 1925 వరకు వివిధ ఉద్యమాల్లో క్రియాశీలకంగా, వివిధ సంస్థలకు అధ్యక్షుడిగా, సంకల్ప అనే వారపత్రికకు సంపాదకుడిగా వున్న అనుభవాల నిష్కర్షగా 1925లో విజయదశమినాడు ఓ పదిమంది కిశోర వయసున్న పిల్లలతో, తన భావాలున్న కొందరు సామాజిక కార్యకర్తలతో కలిసి నాగపూర్‌లో ఓ ఆటస్థలంలో 'సంఘం' ప్రారంభించారు. 'బలోపాసనే' ఈ దేశానికి తారక మంత్రమని ఆయన భావించారు. అందుకే 'శక్తి'కి ప్రతీకమైన విజయదశమినాడు సంఘం ప్రారంభిం చారు. ఇవాళ ఆర్‌యస్‌యస్‌ దేశ వ్యాప్తంగా వేలగ్రామాలకు విస్తరించింది. స్వయం ప్రేరణతో పనిచేసే లక్షలాది స్వయంసేవకులు కోట్లమంది హితైషులను కలిగివుంది. దేశవ్యాప్తంగా 1,50,000 సేవా కార్యక్రమాలు స్వయం సేవకులు నిర్వహిస్తున్నారు. నిత్యమూ జరిగే 'శాఖ' గంట కార్యక్రమంలో ప్రతివ్యక్తికీ శారీరక, మానసిక, బుద్ధిపరమైన శిక్షణ ఇవ్వబడుతుంది. ఇదొక నిత్యవాస్తవం. నిత్య అనుష్ఠానం, నిత్యసాధనాస్థలం, సాధికుల నిర్మాణం నేటి జాతీయ అవసరం. నిత్యమూ ప్రజలతో సంబంధాలు కలిగిన సంస్థ సంఘం. ఇది నెటిజన్‌ల సంస్థకాదు, ఓ వెబ్‌సైట్‌ కాదు, ఒక రోడ్‌షోకాదు, మీడియా మాయాజాలం కాదు. ఇదో నిర్మాణ కేంద్రం. ఇక్కడ దేశంలోని వివిధ జాతీయ జీవనరంగాలలో పనిచేసేందుకు 'దేశహితం' తమ ప్రాధామ్యంగా భావించే వ్యక్తులు తయారవుతారు. స్వయం సేవకుల నుండి స్ఫూర్తిపొందినవారి మిత్రులు, స్నేహితులు కలిసి అనేక రంగాలలో సంస్థలను ఏర్పరిచారు. రాష్ట్ర సేవికాసమితి, అఖిలభారతీయ విద్యార్థి పరిషత్‌, వనవాసీ కళ్యాణాశ్రమం, భారతీయ మజ్దూర్‌ సంఘ్‌, విద్యాభారతి, వివేకానందకేంద్ర, భారత్‌ వికాస్‌ పరిషత్‌, విశ్వహిందూ పరిషత్‌, అఖిలభారతీయ సాహిత్య పరిషత్‌, దీనదయాళ్‌ పరిశోధనాసంస్థ, భారతీయ ఇతిహాస సంకలన సమితి, భారతీయ కిసాన్‌ సంఘ్‌, భారతీయ శిక్షణమండల్‌, సంస్కార భారతి, స్వదేశీ జాగరణమంచ్‌, అఖిలభారతీయ అధివక్తా పరిషత్‌, సేవాభారతి, ప్రజ్ఞాభారతి, విజ్ఞానభారతి, సామాజిక సమరసతామంచ్‌, లఘు ఉద్యోగభారతి, పూర్వసైనికపరిషత్‌ ఇలా అనేక పరివారసంస్థలు ఆయా రంగాలలో మార్పుకోసం ప్రయత్నిస్తున్నాయి. పత్రికారంగంలో, రాజకీయ రంగంలో కూడా స్వయంసేవకులు విశేషంగా పనిచేస్తున్నారు. అందరం భారతమాత బిడ్డలం, ఒకే హిందుభూమి సంతానం- ఇదే స్వయం సేవకుల ఏకతామంత్రం. అందుకే ఈ జాతీయ మహోద్యమంలో సంఘం అందరికీ ఆహ్వానం పలుకుతోంది. 1983లో పూనాలో 35000 మందితో జరిగిన శిబిరానికి ఎన్‌.జి.గోరే వంటి సోషలిస్టులకు, 2005లో ఢిల్లీలో 65,000 మందితో జరిగిన శిబిరానికి శ్రీమతి సోనియా గాంధీకి సంఘం ఆహ్వానం పంపింది. 1975 ఎమర్జెన్సీ సమయంలో స్వయం సేవకులు జైళ్ళలో అనేకమంది నాయకులతో కలిసి జైలు జీవితం గడిపారు. అందరిలో 'ప్రజాస్వామ్యాన్ని' పరిరక్షించా లన్న విశ్వాసం కల్గించారు. జమాయితే ఇస్లామీ వంటి ముస్లిం సంస్థల నాయకులు కూడా సంఘంతో స్వరం కలిపారు. 40వేల మంది స్వయంసేవకులు అజ్ఞాతంలో ఉండి శ్రమించారు. లక్షలాదిగా సత్యాగ్రహం చేశారు. చివరకు 1977లో నియంత, ఇందిరపాలన అంతమైంది. కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య కూడా తన ఆత్మకథలో 'గోల్వల్కర్‌ వ్యక్తిత్వం నాలో దేశభక్తి రగిలించింది. ఆర్‌యస్‌యస్‌లో దేశభక్తి ఉచితంగా లభిస్తుంది' అన్నారు. 1977 నవంబర్‌ లో ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతంలో సంభవించిన భయంకరమైన ఉప్పెనలో ఆర్‌యస్‌యస్‌ చేసిన సేవాకార్యక్రమాలను ఆయన అభినందించారు. సంఘం ఓ సంస్థగా ఏనాడు ఉద్యమంలో పాల్గొనకపోయినా 1931-32లో మహాత్మాగాంధీ పిలుపుననుసరించి వ్యక్తిగత హోదాలో డా|| హెడ్గేవార్‌, ఆయన వెంట అనేక మంది స్వయంసేకులు శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు. 1942లో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో శ్రీయుతులు సానే గురూజీ, జయప్రకాశ్‌నారాయణ్‌, అరుణా అసఫలీ వంటివారి అజ్ఞాతవాస జీవితానికి కావాల్సిన ఏర్పాట్లు స్వయం సేవకులు చేశారు. దేశ విభజన సమయంలో ముస్లింలీగ్‌ పెద్దపెట్టున హింసాకాండ సాగించేందుకు చేసిన యోజనను భగ్నం చేయడంలో అనేకమంది పిల్లలను, స్త్రీలను రక్షించడంలో స్వయంసేవకులు అహర్నిశలు పనిచేశారు. 1947లో కొత్తగా ఏర్పడిన స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు, కేంద్రమంత్రులను, ఇతర ప్రముఖులను హత్యచేసేందుకు ముస్లింలీగ్‌ చేసిన కుట్రను నాటి గృహమంత్రి సర్దార్‌పటేల్‌కు తెలియజేశారు స్వయంసేవకులు. జమ్ముకాశ్మీర్‌ భారత్‌లో విలీనమయ్యేందుకు రాజా హరిసింగ్‌ను ఒప్పించేందుకు అప్పటి సంఘ అధినేత శీ గోల్వల్కర్‌ స్వయంగా శ్రీనగర్‌ వెళ్ళారు. 1948అక్టోబర్‌ 23న జమ్ముకాశ్మీర్‌పై పాకిస్తాన్‌ దాడి చేసింది. అక్టోబర్‌27న భారత్‌ సైన్యాలు శ్రీనగర్‌ విమానా శ్రయంలో దిగేందుకు వీలుగా శ్రీనగర్‌కు చెందిన 200 మంది స్వయంసేవకులు విమానాశ్రయాన్ని రెండురోజులపాటు రాత్రింబవళ్ళు పనిచేసి శుభ్రంచేశారు. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించినప్పటికీ బుడతకీచుల పానలో వున్న గోవా, డమన్‌, దీవ్‌, దాద్రానగర్‌ హవేలిలను విముక్తం చేసేందుకు 1954 ఆగస్టు 2న వందమంది స్వయంసేవకులు హఠాత్తుగా దాద్రానగర్‌ హవేలిల పై విరుచుకుపడి వాటిని విముక్తంచేసి భారత్‌కు అప్పగించారు. 1962లో చైనా దురాక్రమణ సమయంలో స్వయంసేవకులు ప్రభుత్వానికి, సైన్యానికి పూర్తి మద్దతుగా నిలిచారు. స్వయంసేవకుల సేవను చూసిన నాటి ప్రధాని నెహ్రూ 1963 జనవరి 26 రిపబ్లిక్‌డే పెరేడ్‌లో పాల్గొనమని సంఘాన్ని ఆహ్వానించారు. 2005లో తమిళనాడులో సునామీ సంభవించినపుడు, 1996లో ఒరిస్సాలో, కాకినాడలో తుఫాను సంభవించినపుడు, 2009లో కర్నూలు వరదల్లో స్వయంసేవకులు సత్వర సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. కులనిర్మూలనలేదు, కులం నిర్మాణం లేదు, అందరం ఈ హిందుభూమి బిడ్డలం- ఇదే నినాదంగా సామాజిక సమరసత కోసం సంఘం పనిచేస్తుంది. మరఠ్వాడ విశ్వవిద్యాల యాన్ని అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంగా పేరు మార్చడంలో, నాసిక్‌లో కాలారామ్‌ మందిర్‌లో హరిజనులకు ప్రవేశం కల్పించడంలో సంఘం ప్రముఖపాత్ర వహించింది. 1947లో గాంధీ వార్దాలో సంఘ శిబిరం సందర్శించారు. సంఘం లో అస్పృశ్యత లేదన్నారు. 1939లో అంబేద్కర్‌ పునాలో సంఘ శిబిరానికి వచ్చి తమతోటి స్వయం సేవకుల కులం తెలుసుకోవాలనే కుతూహలం కూడా స్వయంసేవకులకు లేదని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సామాజిక పరివర్తనలో ఆర్‌యస్‌యస్‌ అగ్రభాగాన ఉందని 1977 నవంబరులో పాట్నాలో శ్రీ జయప్రకాశ్‌ నారాయణ్‌ అభినందించారు. ఇంకా జకీర్‌హుస్సేన్‌ లాంటి దేశాధినేతలు కూడా సంఘాన్ని ప్రశంసించారు. తెలంగాణలో ఈ మధ్యకాలంలో శ్రీకృష్ణయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య వంటివారు సంఘశిబిరాల్లో సమరసతను ప్రత్యక్షం గా చూసినవారే. స్థూలంగా సంఘం ఒక సామాజిక విజయం కోసం పనిచేస్తున్న సంస్థ. మనం నాలుగు రోజులుంటాం, పోతాం. కాని ఈ దేశవైభవం అమరంగా ఉండాలి. 'సామా జిక స్పృహ' ప్రకృతి లోని ఒక అద్భుతరహస్యం. మనం ఎంత ఎక్కువ మందిని సంతోషపెడితే మనకు అంత ఎక్కువ ఆనందం లభిస్తుంది. ఇది వేదాంతం కాదు. సైన్సుకూడా. సంఘంలో జరిగే వ్యక్తిత్వవికాసం, దేశం, సమాజం వికాసపథంవైపు పయనించేందుకు ఉద్దేశించబడిందే! భారత్‌ మాతకు జయమగుగాక!