గృహ వైద్యం

చక్కెరను నియంత్రించే దాల్చిన చెక్క : దాల్చిన చెక్కలో ప్రొటీన్లు, పీచు, ఐరన్‌, సోడియం, విటమిన్‌ సి ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిలోని ఔషధ విలువల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతూ, కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిసెరైడ్‌ స్థాయిని తగ్గిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.