300 వ్యాధులకు సింపుల్‌ మెడిసిన్‌

మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అంతే కాకుండా అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనా లున్నాయిన పరిశోధనల్లో వెల్లడైంది. అసలు 4,5వేల ఏళ్ల నుంచే పూర్వీకులు మునగాకులను మెడిసిన్‌ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది.
ఆయుర్వేదంలో 300లకు పైగా వ్యాధులను నయం చేయ
మునగాకులో ఉన్న అద్బుతమైన ఔషధ గుణాలు
మునగాకుల్లో విటమిన్స్‌, ఎమినో యాసిడ్స్‌ మినరల్స్‌ సమృద్ధిగా ఉంటాయి. 

మునగాకు రసాన్ని దోసకా య రసంతో కలిపి ప్రతి రోజు సేవిస్తే గుండె, కాలెయం, మూత్ర పిండాలకు సంబంధిచిన సమస్య లు క్రమంగా తొలగిపోతాయి.
మునగాకుల రసాన్ని పాలలో కలిపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. గర్బిణుల, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం,ఐరాన్‌,విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతో పాటు పాలుతాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి.
గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఈ నీటిలో కొంచెం ఉప్పు, మిరయాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా,టీబీ,దగ్గు తగ్గుతాయి.
మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిముల,బ్లాక్‌ హెడ్స్‌ పోతాయి. ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటివారు విరివిగా మునగాకు ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ వుంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది.మరి ఇన్ని మంచి లక్షణాలున్న మునగాకును నిర్లక్ష్యం చేయడం తగునా?డానికి ఈ మునగాకును ఉపయో గిస్తారు. అందుకే దీనిని సాంప్రదాయకమైన మందుగా చెబుతుంటారు మన పెద్దలు.