మూర్తిభవించిన ఆదర్శం సూరుజీ

శరీరంలో అణువణువును సంఘ కార్యం కోసం సమర్పించిన వారు శ్రీ సూర్యనారాయణరావు. వారు జీవితాన్ని విజయవంతంగా శాశ్వతంగా, ప్
సమాజాన్ని సంఘటితం చేయడంలో 'సేవ' ఒక విశిష్టమై నది అని, ఒక తల్లి పిల్లలకు ఏ విధంగా సేవ చేస్తుందో అదే ప్రేమ, ఆప్యాయతతో మనం కూడా సమాజ సేవ చేయాలి అని ఆయన సరళం గా వివరించే వారు అని తెలిపారు. అలాంటి ఆలోచన, దూర దృష్టి కలిగిన వ్యక్తి. సంఘం ఇప్పుడు లక్ష యాబైవేలకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించ డంలో వారి పాత్ర ఒక మూల స్తభంలాంటిది అని, వారి మరణంతో దేశం ఒక సామాజిక కార్య కర్తను కోల్పోయింది అని కూడా భాగయ్య అన్నారు. ప్రస్తుతం మన సమాజంలో ఎస్సీ,ఎస్టీ వర్గాలకు సంబంధించిన మన సోదరులకు రాజ్యాంగ బద్ధమైన సర్వ హక్కులను వారికి అందివ్వడంలో, వారిని అందరితోపాటు సగర్వంగా, ఆత్మ విశ్వాసంతో సమాజంలో జీవించేలా సంపూర్ణ హృదయంతో నిరంతరం ప్రయత్నం చేయడమే ప్రతి స్వయం సేవకుడు సూరుజీకి అర్పించే నిజమైన శ్రద్ధాంజలి అని ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ శ్రద్ధాంజలి సభలో పాల్గొన్న దక్షిణ మధ్య క్షేత్రప్రచారక్‌ శ్రీ శ్యాంజీ మాట్లాడుతూ సూరుజీ తన 93ఏళ్ల జీవితంలో 25సంవత్సరాలు కర్ణాటకలో, 45 సంవత్సరాలు తమిళనాడులో సంఘ వ్యాప్తికై జీవితాన్ని ధారపోసిన మహాపురుషుడు అని వివరించారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అనే తలంపుతో 75సంవత్సరాల వయసు మీద పడిన తరువాత స్వతహగా బాధ్యతల నుంచి తప్పుకున్నారు అని అన్నారు. 1948లో మొదటి సారి సంఘంపై నిషేధం విధించిన కాలానికి ఆయన ప్రత్యక్ష సాక్షి అని ఆ సంఘటనలు స్వయంసేవకులకు వివరించే వారని అన్నారు. తెలంగాణ ప్రాంత సంఘచాలక్‌ శ్రీ ప్యాటా వెంకటేశ్వరరావు గారు సూరుజీ జీవిత విశేషాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ శ్రద్ధాంజలి సభలో శ్రీ ఎక్కా చంద్రశేఖర్‌, శ్రీ లింగం సుధాకర్‌ రెడ్డి గారు, వి.హెచ్‌.పి క్షేత్ర ప్రచారక్‌ శ్రీ గోపాల్‌ గారు, జస్టీస్‌ శ్రీ పర్వతరావు గారు తదితరులు మాట్లాడుతూ తమకు సూరుజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్య క్రమానికి హైదరాబాద్‌, సికిందరాబాద్‌లో ఉన్న దాదాపు 600మంది పైగా స్వయంసేవకులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.
రస న్నంగా మరియు పరాక్రమయుతంగా కష్టాన్ని సైతం సునాయాసంగా మలుస్తూ స్వయంసేవకులందరికీ ఒక ఆదర్శంగా జీవించిన ధన్యజీవి కీర్తి శేషులు శ్రీ సూర్యనారాయణరావుగారు అని ఆర్‌.ఎస్‌.ఎస్‌ సహ సర్‌ కార్యవాహ మాననీయ శ్రీభాగయ్య గారు తెలిపారు. శ్రీభాగయ్య గారు నవంబర్‌29 నాడు హైదరాబాద్‌ నారాయణ గూడ కేశవ మెమోరియల్‌ కళాశాలలో జరిగిన శ్రద్ధాంజలి సభలో మాట్లాడుతూ సూరుజీ వ్యక్తి త్వం, సాటి మనుషుల పట్ల వారు చూపిన వాత్స ల్యం, ప్రేమ, మమతానురాగాలు ముఖ్యంగా తమిళ నాడు ప్రాంతంలో సంఘ వ్యాప్తికై వారు చేసిన విశేష కృషికి సంబంధించిన సంఘటనలను వివ రిస్తూ పురుషార్థంతో జీవన ప్రయాణాన్ని కొనసాగించిన తపస్సంపన్నుడు అని కొనియాడారు. శ్రీ సూర్యనారాయణరావు గారు 93 ఏళ్ల వయసులో నవంబరు18న బెంగుళూరులో స్వర్గస్తులైనారు.