ఏకతాటిపైకి హిందూ పీఠాధిపతులు

దక్షిణ భారతదేశంలో తొలిసారి మహాద్వైత, అద్వైత, ద్వైత మార్గాలను అనుసరించే ధర్మ ప్రచారకులంతా ఒకే వేదికపైకి వచ్చి 'హిందూ ధర్మాచార్య ప్రతిషా'న్‌' పేరిట హిందూ ధర్మ పరిరక్షణ సంస్థను ఏర్పాటు చేశారు.


 ధార్మిక సాహిత్యాన్ని పల్లెల్లోకి తీసుకువెళ్లడం, మత స్వేఛ దుర్వినియోగం కాకుండా చూడటం, హిందూ సూార్తిే కార్యక్రమాలను నిర్వహించడం, మత గ్రంధాలను ముద్రించి, పరిరక్షించడం, హిందూ మత సంస్థలు, ప్రచారకుల మధ్య సౌహార్ద్రాన్ని నెలకొల్పడం వంటి లక్ష్యాలతో సంస్థను ఏర్పాటు చేసినట్టు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌ స్వామి చెప్పారు.