మత స్వేచ్ఛకు ముసుగు

శక్తి స్వరూపిణి మహాలక్ష్మీగా పూజింపబడే ఈ మహోన్నత భారతవనిలో నేడు మహిళలకు అవమానాలు ఎదురవుతున్నాయి. అడుగడుగునా అత్యాచారాలు.. అణచివేతలే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం ఉన్నాయంటే అందుకు కారణం సనాతన హైందవ ధర్మమే అని చెప్పుకోవాలి. కాని అఖండ భారతావనిలోని ఇరాన్‌, అప్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, బలోచిస్థాన్‌ వంటి ఇస్లామిక్‌ దేశాలుగా ముక్కలు అవుతున్నా కొద్ది ఆ మతాచారాల ప్రకారం మహిళల స్థానం మారుతూ వస్తోంది. అంటే వారు కేవలం మతాచారాలకే పరిమితమవుతున్నారు. 

వివాహం ముందు వరకు తల్లిదండ్రులు చాటున, వివాహ అనంతరం పూర్తిగా భర్త చెప్పుచేతల్లో ఇస్లామిక్‌ దేశాల మహిళలు ఉంటున్నారు. ఇందుకు ఉదాహరణకు ఒక్క పురుషుడు ఒకేసారి ఎంతమందైన మహిళలను వివాహం చేసుకోవచ్చు. కాని ఆ స్వేచ్ఛ మహిళలకు ఉండదు. వాస్తవానికి ఈ రెండు అంశాలు చట్ట ప్రకారం చూసినా, నైతికంగా చూసినా ఆమోదించదగినవి కావు. కాని ఇస్లామిక్‌ దేశాల్లో షరియా చట్టాల పాపానికి ఎందరో మహిళలు బలిపశువులు అవుతున్నారు. వారి స్వేచ్ఛకు ముసుగు పడుతోంది. పూర్తి స్థాయి ఇస్లామిక్‌ దేశంగా మారిన ప్రాంతల్లో మహిళలు తమ కండ్లకు కూడా పర్దా వేసుకోవాలంటే అక్కడ ఉన్న మహిళలకు ఉన్న స్వేచ్ఛ ఎంతో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు భారత్‌కు చెందిన షూటింగ్‌ క్రీడాకారిణి హీనా సిదు ఉదాహరగా తీసుకుందాం. ఎంతో ఇష్టంగా ఆటను నేర్చుకున్న తాను ఉన్నత శిఖరాలను అందుకోవాలనుకుంది. కాని తమ ఆశలకు, ఆశయాలకు హిజబ్‌ అనే ముసుగు అడ్డు వచ్చింది. ఇరాన్‌లో జరిగే పోటీల్లో పాల్గొనే షూటర్‌లు తప్పక హిజబ్‌ ధరించాలనే నిబంధనే ఇందుకు ప్రధాన కారణం. హిజబ్‌ ధరించమని మహిళా క్రీడాకారిణులను బలవంతం చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను క్రీడాస్ఫూర్తిని విడువలేనని, అలా అని ఆచారాలకు విరుద్ధంగా వెళ్లలేనని, తాను చేయగలిగింది ఏమి లేదని, చేయగలిగినదంతా ఆట నుంచి వైదొలగడమేనని షూటింగ్‌ పోటీల నుంచి తన ఆటనే విరమించుకుంది. ఇరాన్‌ సంప్రదాయాలకు అంత ప్రాధాన్యతను ఇస్తే తమ ఆటగాళ్లను క్రీడలకు దూరంగా ఉంచాలని, పోటీల నుంచి వారిని ఉపసంహరించుకోవాలని, అంతేగాని వారి విధివిధా నాలను ఆటగాళ్లపై రుద్ధడం సరైన విధానం కాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రీడల్లో వివిధ ప్రాంతాలు, దేశాలు, సంస్కృతుల వారు ఒక్కచోట చేరుతారని, వారి మధ్యవైషమ్యాలు రుద్ధడానికి పూర్తి వ్యతిరేకమని, కాని ఇందుకు సంబంధించి రాజకీయాలు చేయడం కూడా సరైన విధానం కాదన్నారు. అలా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ లో డిసెంబర్‌లో జరగనున్న షూటింగ్‌ పోటిల్లో పాల్గొనకపోవడమే ఉత్తమమని వెనుదిరిగారు హీనా. ఇదిలాగే కొనసాగితే భారతదేశంలో మహిళల పరిస్థితి కూడా ముసుగులోకి చేరిపోతుం దేమోననే భయాందళనలు ఇప్పటికీ మొదలవ్వడం విస్మయకర విషయం. ఇందుకు కారణాలు లేకపోలేదు. ముస్లిం మహిళలకు షరియా చట్టాల ప్రకారం మూడుసార్లు తలాక్‌ చెప్పి విడాకుల ఇచ్చే పద్ధతిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇస్లామిక్‌ మేధావులు, విద్యావంతులు, ఇమామ్‌ల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎన్నో ఆందోళనలు నిర్వహించారు. అయితే ఈ అందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నది పురుషులే అనేది మరో విషయం. ఎటు ఉంచి భారతీయ ముస్లిం మహిళల్లో తలాక్‌,హిజబ్‌ వంటి అంశాల పట్ల వ్యతిరేకత పెరుగుతుందనే భావాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇందుకు వారు చేపడుతున్న పోరాటాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని హక్కుల ఆధారంగా సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు స్త్రీ, పురుషులు ఇరువురికి సమానంగా ఉంది. అయితే ఆ నిర్ణయాలు ఇతరులకు హాని కలిగించనంతవరకు ఆహ్వానమే. అయితే షరియా చట్టాలు ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయని కొందరు మహిళలపై హిజబ్‌ను బలవంతంగా రుద్దడం, పురుషులను ఉత్తములుగా చూపించడంతో పాటు మహిళల పట్ల వివక్షపూరితంగా వ్యవహరించడాన్ని సూచిస్తుందని వారు తమ వాదనను వినిపిస్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని, లింగవివక్షకు బీజం వేయడమేనని మానవహక్కుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాతాచారాలను పాటించుకునే హక్కు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించింది. భారతదేశం లో అందరూ సమానం అనే రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధం గా ప్రవర్తించే వారిని కొన్ని స్వార్ధపూరిత శక్తులు సమర్ధించడం విస్మయకర విషయం. ఇవి మహిళల స్వేచ్ఛకు ముసుగునేసే కబంధ హస్తాలకు ఊతమిస్తూ షరియా సంకెళ్లను వేస్తూ లౌకికవాద ముసుగు దాక్కొంటున్న మదఛాందసవాద శక్తులు. వీటిని చైత న్యం పొంది మహిళలు బయటకు రావలసిన అవసరం ఎంతైన ఉంది. మన ఆలోచనకు స్వేచ్ఛ ఉండాలి. మన పనులకు బాధ్యత ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు ఆనందం వ్యక్తం చేస్తారు. ఆ భూమి సస్యశ్యామల మవుతుంది. అందుకే ఆవును కూడా మనం గోమాత అంటాము. దేశాన్ని భారతమాత అంటాము.