శక్తికి ప్రత్యామ్నాయం లేదు

దేశ విభజన జరిగినప్పటి నుంచి (1947) పాకిస్తాన్‌ మన దేశానికి పక్కలో బల్లెం చందాన దాపరించింది. గత 70సంవత్సరాల మన ప్రభుత్వాలు నిష్క్రయాతత్వంతో పాకిస్తాన్‌ ఆడింది ఆటగా సాగింది. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. మన యుద్ధ శక్తిని పెంచే ప్రయాత్నాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం మన వద్దనున్న ''బ్రహ్మోస్‌ అణుక్షిపణుల వ్యాప్తి సామార్థ్యం 300కి.మీ ఉన్నది. ఐతే ఇప్పుడు ఈ క్షిపణుల సామార్థ్యం రెట్టింపుకానున్నది. 600 కి.మీ వ్యాప్తిసామార్థ్యంతో ఈ అణుక్ష్షిపాణి పాకిస్తాన్‌ భూ భాగంలో ఏ మూలకైన విరుచుకుపడి సర్వ నాశనం చేసే శక్తి దీనికి ఉన్నది. ఇది కాకుండా 2020-21 నాటికి అత్యంత ఆధునిక ''ఆకులా-2'' తరగతికి చెందిన అణుజలాంతరంగా మన నావికా దళంలో చేరబోతున్నది. ఈ జలాంతరం విలువ రూ. 13.500కోట్లు. - ఈనాడు