ఉమ్మడి పౌరస్మృతి - నేటి ఆవశ్యకత

భారతదేశం విభిన్న మతాలకు, వివిధ ఆచారవ్యవహరాలకు ఆలవాలమైన దేశం. అనేక మతాలు, భాషలు, కులాలు, ఆచారవ్యవహారాలు, విశ్వాసలతో కూడిన దేశం. పుట్టుక నుంచి మరణందాకా అనేక సందర్భాలలో వివాహలు, విడాకులు, ఆస్తి వారసత్వము, జీవనభృతి వంటి అనేక విషయాలలో ఇప్పటి దాకా మతవిశ్వాసాల ఆధారంగానే ఆయా మతాల వారికి ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాడ్డాయి

ఈ నేపథ్యంలోనే కేంద్రప్రభుత్వం ఇటీవల కామన్‌ (యూనిపామ్‌ సివిల్‌ కోడ్‌)ను దేశంమంతటా అమలు చేయటానికి గల ఇబ్బందులను, సాధ్యాసాధ్యాలను పరిశీలించి సలహాలను సూచించ వలసిందిగా గత మాసంలో లా కమిషన్‌ను కోరింది. దీంతో దేశంలోని ముస్లిం వర్గాలలో ప్రధానంగా మతపెద్దలు తమ మతచట్టాలజోలికి రాకూడదని ఆందోళన చేస్తూ వార్తల్లోకెక్కారు. ఈ నేపథ్యంలో యూనిపామ్‌ (కామాన్‌) సివిల్‌ కోడ్‌ పుట్టుపూర్వోత్తరాలు గురించి, అమలులో లాభనష్టాల గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది.
ఈ సమస్య ఈనాటి ఎన్‌డీఎ
ప్రభుత్వంతో రాలేదు
ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చినప్పుడు ఈ దేశంలోని భిన్న సంస్కృతులు, ఆచారవ్యవహరాలను పరిశీలించి వీరందరిని ఒకే చట్టబద్దమైన నాగరిక పాలన ''కామన్‌ సివిల్‌ కోడ్‌'' అమలు చేయాలని భావించారు. కానీ వారు ''విభజించు పాలించు'' అనే సూత్రంపై ఆధారపడి ఈ దేశంలోని హిందూ ముస్లింలలో ఐక్యతను సాధించటం ఇష్టంలేక ఈ చట్టాన్ని అమలు చేయలేదు. అటు తరువాత భారతదేశంలో స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత భారత రాజ్యాంగంలో దీనిని ప్రస్థావించడం జరిగింది. 1949లో పార్లమెంట్‌లో దీనిపై విస్తృత చర్చ జరిగింది. అటు తరువాత 1951 మరియు 1954లో కూడా ఈ యూనిపాం సివిల్‌ కోడ్‌ను అమలు చేయాలని పార్లమెంట్‌లో చర్చ జరిగింది. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ చట్టాన్ని అమలు చేయాలని వ్వక్తిగతంగా భావించినప్పటికీ నాడు జరిగిన దేశ విభజన రాజకీయాల దృష్ట్యా ముస్లింల సంతుష్టీకరణ విధానంలో ఈ చట్టాన్ని అమలు చేయలేక పోయారు. దీంతో దేశంలో వివిధ మతాల విశ్వాసాల ఆధారంగా హిందూ వివాహచట్టం, ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, వక్ఫ్‌ బోర్డు వంటి సంస్థలు ఏర్పాటు చేయవలిసి వచ్చింది. వీటి ఏర్పాటు వల్ల దేశంలోని ప్రజలలో చట్టాల అమలు, నిబంధనలలో ఏకరూపత కొరవడింది. దీంతో ఈ ప్రత్యేక చట్టాలు భారత రాజ్యాంగంలో మౌలిక అంతర్లీన స్వరూపమైన లౌకిక వాదానికి వ్యతిరేకంగా రూపుదిద్దుకుంటున్నాయి.
అసలు ''యూనిఫాం సివిల్‌ కోడ్‌'' అంటే ఏమిటి? ఈ దేశంలోని ప్రజలందరికి ఒకే జాతీయత ఒకేజాతి ప్రజలందరికి ఒకే చట్టం ఒకే న్యాయం. వివాహాలు, దత్తత, ఆస్తి వారసత్వము, విడాకులు, జీవనభృతిలాంటి అనేక అంశాలలో కుల,మత,వర్గ, లింగ బేధము లేకుండా దేశంలోని అన్నిరకాల మతాల ప్రజలకు ఒకే చట్టాన్ని న్యాయాన్ని అమలు చేయడమే కామన్‌ సివిల్‌ కోడ్‌ ఉద్ధేశం.
ప్రస్తుతం మనదేశంలో పై అంశాలకు సంబంధించి హిందువులకు హిందూవివాహ చట్టం ముస్లింలకు ముస్లిం పర్సనల్‌ లా ఆధారంగా చట్టాలు అమలులో ఉన్నాయి. దీని ద్వారా ఒకే దేశంలో ఒకే గ్రామంలో పక్కపక్కన ఇళ్లలో వుంటూ కూడా హిందూస్త్రీ విడాకులు తీసుకుంటే భర్త నుంచి జీవన భృతి/భరణం కోర్టు చట్టం ద్వారా విడాకులు పొందిన భర్తనుంచి పొందవచ్చు. కానీ పక్కింట్లో వున్న ముస్లిం స్త్రీకి చట్టం ద్వారా కోర్టుల ద్వారా జీవనభృతి లేదా భరణం విడాకులు తీసుకున్న భర్త నుంచి పొందేహక్కు లేదు. ముస్లిం పురుషుడు ప్రయత్న పూర్వకంగా గానీ, అప్రయత్నపూర్వకంగా కానీ కలలోగాని ''తలాక్‌ తలాక్‌ తలాక్‌'' అని మూడుసార్లు గట్టిగా ఉచ్చరించినట్లైతే ఆ స్త్రీతో విడాకులు పొందినట్లే. భర్త ఎలాంటి భరణం ఇవ్వవలిసిన అవసరంలేదు. అలాగే ఒక ముస్లిం పురుషుడు 7వివాహాలు చేసుకోవచ్చు. ఇది వారికి ముస్లిం పర్సనల్‌ లా పురుషులకు కల్పిస్తున్న వెసులుబాటు. దీనివల్ల ఇస్లాం మతంలోని స్త్రీలు వారి సహజమైన హక్కులను న్యాయాన్ని పొందలేక పోతున్నారు. ఇదే విషయాన్ని భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం 1985లో మహ్మద్‌ ఆహ్మద్‌ఖాన్‌/శాహబానో బేగం అనే చారిత్రాత్మకమైన కేసులో తలాక్‌ పద్ధతిని తప్పుబట్టింది. ముస్లిం పురుషుడి నుంచి విడాకులు పొందిన భర్త నుంచి జీవన భృతి/భరణం పొందే హక్కు ముస్లిం స్త్రీకి ఉందని స్పష్టం చేసింది. అదే సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను అమలు చేయవలిసిందిగా ప్రభుత్వానికి సూచించింది. కాని నాడు అధికారంలో వున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రధానిగా వున్న రాజీవ్‌ గాంధీ ముస్లిం సంతుష్టీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పును యధా తధంగా అమలు చేయకుండా నీరుగార్చింది. ఆ తరువాత అనేక సందర్భాలలో సర్వోన్నతన్యాయస్థానం యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను అములు చేయవలిసిందిగా సూచించింది.
ప్రస్తుతం కేంద్రప్రభుత్వం కామన్‌ సివిల్‌ కోడ్‌పై 'లా'కమిషన్‌ను సలహాలు కోరినందున ఇటీవల వారు ముస్లిం విడాకుల అంశామైన 'తలాక్‌' విషయమై ప్రజల అభిప్రాయలను తెలియజేయవ లిసిందిగా ప్రజల అభిమతాన్ని కోరుతూ ప్రశ్నావళి జారిచేసింది. దీని ప్రధాన ఉద్ధేశం మతం ఆధారంగా ఏర్పాడిన చట్టాల లోసుగులతో స్త్రీల హక్కులకు భంగం కలుగకుండా స్త్రీ పట్ల ఏలాంటి వివక్ష లేకుండా దేశంలోని ప్రజలందరికి ఒకేరకమైన చట్టాన్ని నిబంధనలను అమలు చేయడమే ఈ కామన్‌ సివిల్‌ కోడ్‌ యొక్క ముఖ్య ఉద్ధేశం.
ఇందులో ప్రభుత్వాల బాధ్యత ఏమిటి?
1. యునిఫామ్‌ సివిల్‌ కోడ్‌ అమలుపై దేశంలోని సామాన్య ప్రజలలో ముఖ్యంగా వివాహ వయస్సు గల యువతలో విస్తృతంగా చర్చ జరగాలి ఈ చట్టంపై సాధారణ ముస్లి ప్రజలకు అవగాహన చైతన్యం కలిగించాలి.
2. ముఖ్యంగా యునిఫామ్‌ సివిల్‌ కోడ్‌ అమలు పట్ల ముస్లిం వర్గాలలో అభద్రతాభావం వుంది. కనుక ప్రభుత్వం వారి భక్తి, పూజావిధానం, ఆచారవ్యవహారాలు మొదలైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా కేవలం ముస్లిం స్త్రీల హక్కులకు దేశాభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన అంశాలు అనగా వివాహము, దత్తత, ఆస్తి వారసత్వము, విడాకులు, జీవన భృతి, భరణము వంటి విషయాలలో సంస్కరణలుగా వారికి అర్థమయ్యేరీ తిలో చైతన్యం కలిగించి యునిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను అమలు చేయడం ఎంతైనా అవసరం.

. ఉదా: హిందూవివాహ చట్టం-ముస్లిం పర్సనల్‌ లా వంటి అనేక చట్టాలు చేయబడ్డాయి. కాని వీటివల్ల దేశంలో పౌరులకు సమన్యాయం చేకూరకపోగా వివిధ మతాలలో స్త్రీల హక్కులను ఈ పర్సనల్‌ చట్టాలు హరించేవిగా ఉన్నాయి.
మూలం: డా|| శుచి చౌహన్‌ స్వేచ్ఛానువాదం : పతికి