గీతా జయంతి

మార్గశిర శుద్ధ ఏకాదశి (డిసెంబర్‌-10)  శ్రీకృష్ణభగవానుడు రణరంగమున అర్జునుడికి గీతోపదేశం చేసిన దినము మార్గశిర శుద్దఏకాదశి. కాబట్టి ఈ దిన ము మహాపర్వ దినముగా భావించ బడుచున్నది. భగవద్గీత స్వయంగా భగవంతుడగు శ్రీకృష్ణనిచే అర్జునుడికి బోధించబడినట్లు, అద్వ్తేత జ్ఞానము, అమృతమును వర్షించు నట్టియూ,18 అధ్యాయాలతో కూడినట్టిది. శ్రీ వేదవ్యాసునిచే మహాభారతమందాలి బీష్మ పర్వములో కూర్చబడినది. వేదముల సారము ఉపనిషత్తులు-ఉపనిషత్తుల సారము భగవద్గీత. భగవద్గీత దైనందిన జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు పరిష్కారం చూపించును. కోపము వచ్చినప్పుడు, భౌతిక సుఖములపై ఆసక్తి కలిగినప్పు డు మరణభయం ఉన్నప్పుడు, అసూయ, ధ్వేేషం జనించినప్పుడు అహంకారం కలిగిప్పుడు కర్తవ్యం బోధపడనప్పుడు ''గీత'' మార్గ దర్శనం చేస్తుంది. భగవద్గీత ఒక పారాయణ గ్రంధము మాత్రమే కాదు ఒక ఆచరణీయ గ్రంధము కూడా. ఎచట గీతయుండునో అచటకృష్ణుడు ఉండును. కృష్ణడు ఉన్నచో అచట విజయము ఉండును. అక్కడ ఐశ్వర్యము నీతి తాండవించును. కాబట్టి ప్రతి ఒక్కరు కుల మత బేధము లేకుండా 'భగవద్గీత' ను అభ్యసించగా గీతా గంగా ప్రవాహముచే తమ తమ హృదయక్షేత్రములను పండించుకోని కార్యోన్ముఖులు కావలెను.